అది చంద్రబాబు వాయిసే, పరకాలే సగం ఒప్పుకున్నారు


ట్యాపింగుకు, ఫోను రికార్డింగులకు తేడా తెలియదా?
పరకాల తెలివి తక్కువతనం
చాణుక్యుని చలాకీతనం

babu-cartoon-e1333080500174

ఎదుటివాళ్లు చిన్న తప్పు చేసినా మీడియా ద్వారా వీలైనంత గోలచేయించి, అవతలివాడిని ఆగమాగం చేసే చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతర ఆంధ్ర పత్రికలు, చానెళ్లు…. ఇప్పుడు ఎంత నంగనాచుల్లాగా వ్యవహరిస్తున్నాయో చూడండి. కేటీ రామారావు ఏదో ఒక భూమి సెటిల్‌మెంటులో ఒక కిడ్నాపర్‌కు సహకరించారని, ఒక చిన్న ఫొటో పట్టుకుని నానా రచ్చ చేసిన రాధాకృష్ణ, ఇప్పుడు రాజకీయాలను, న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి నిర్లజ్జగా దొరికిపోయిన చంద్రబాబును రక్షించడానికి ఎంతగా ఆరాటపడుతున్నారో చూడండి. ఆంధ్ర మీడియా స్వభావమే అంత తమ వాళ్లయితే ఎంత నేరాలు ఘోరాలు చేసినా కాపాడుకుంటుంది. అవి పెద్ద నేరాలుగా కనిపించవు. తెలంగాణ వాళ్లు ఎంత చిన్న తప్పు చేసినా నిలువునా బలిపెట్టడానికి ఒడిగడుతుంది.

1. ముఖ్యమంత్రి ఫోను ట్యాపు చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ట్యాపింగ్‌లే అవసరం లేదు. ఫోన్లలో రికార్డు చేయవచ్చు. స్టీఫెన్‌సన్ స్వయంగా ఓటుకు వ్యవహారాన్ని ఏసీబీ దృష్టికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే తనతో మాట్లాడిన వ్యక్తుల సంభాషణలను తన ఫోనులోనే తానే స్వయంగా రికార్డు చేసినట్టు తెలుస్తున్నది. సెబాస్టియన్ బారీ, ఉదయ సింహుల ఫోను సంభాషణలు కూడా రికార్డు చేసినట్టు సమాచారం. చంద్రబాబు పంపిన ఓటు దొంగలు ఫోను కలిపి చంద్రబాబుతో మాట్లాడించినట్టు బయటికి విడుదలయిన ఆడియో రికార్డులు వెల్లడిస్తున్నాయి. లోకేశ్ బాబు సంభాషణ రికార్డులు కూడా ఉన్నట్టు తెలుస్తన్నది. వీరితో మాట్లాడించిన ఈ దొంగల ఫోన్ల సంభాషణను రికార్డు చేసినా సరిపోతుంది.

2. రికార్డయిన సంభాషణలోని వాయిస్ చంద్రబాబుది కాదట. తెలివైన మేధావిననుకునే పరకాల ప్రభాకర్‌కు ఆ వాయిస్ చంద్రబాబుదే అనే అనుమానం కూడా లోపల ఉందేమో. వెంటనే – అక్కడక్కడ బాబుగారు మాట్లాడిన మాటలు పోగేసి అతికించారా? అని ప్రశ్నించారు. ఇంతపెద్ద మేధావికి…. ఏ వాయిస్‌ను అయినా ఫోరెన్సిక్ టెక్నాలజీతో ఫిల్టర్ చేసి నిర్ధారించవచ్చునని తెలియదా? న్యాయపరీక్షకు, ఫోరెన్సిక్ పరీక్షకు సిద్ధం కావచ్చు కదా? నిర్దోషిత్వం నిరూపించుకోవచ్చు కదా?

3. నిప్పును, నిజాయితీకి కొప్పును అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పే చంద్రబాబు తన జీవితకాలంలో ఎప్పుడన్నా ఒక్క సారయినా న్యాయపరీక్షకు నిలబడ్డాడా? ఎన్ని ఆరోపణలు, కుంభకోణాలు, కేసులు వచ్చినా విచారణకు రాకుండా చేయడం, స్టేలు తెచ్చుకోవడం, వ్యవస్థలను మ్యానేజి చేయడం, కేసు వేసిన వాడిని డ్యామేజీ చేయడం లేదంటే రాజీ చేయడం….ఇదేకదా జీవితమంతా? చంద్రబాబు నిప్పు కాదు, కచ్చితంగా తుప్పు, తప్పు. కాలం చెల్లిన నాయకుడు.

4. నడిచినంతకాలం నన్ను మించిన మొనగాడు లేడని విర్రవీగిన బాబు ఇప్పుడు బాధితునిలాగా తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి తెగబడుతున్నాడు. ఆంధ్రలో కేసులు పెట్టిస్తున్నాడు. తెలంగాణలో ఆయనకు నోటీసు ఇస్తే, ఆంధ్ర పోలీసులు కేసీఆర్‌కు నోటీసు ఇస్తారట. ఇచ్చి చూడండి. ఏమి జరుగుతుందో తెరపై చూడండి. మీరు తెలంగాణ ప్రభుత్వం అతిథులుగా మాత్రమే హైదరాబాద్‌లో ఉన్నారన్న విషయం మాత్రం మరచిపోకండి. ఇంతకాలం అన్ని వ్యవస్థలతో ఆడడం మీ ఒక్కరికే తెలుసు. మీరు విజేతలు అందరూ పరాజితులు. ఇప్పుడు తెలంగాణ కూడా మొదలు పెట్టింది. ఎలా తప్పించుకుంటారో చూద్దాం.

5. పరకాల ప్రభాకర్ అంతూ లోతూ ఏదో చూస్తామని వాగాడు. ఆయన శక్తి ఏమిటో అందరికీ తెలుసు. మీకు నిజాయితీ ఉంటే న్యాయపరీక్షకు నిలబడండి. ఏసీబీ విచారణకు సహకరించండి. నోటీసులిస్తే తీసుకోండి. న్యాయమూర్తి ముందు హాజరై నిర్దోషిత్వాన్ని నిరూపించుకోండి. అలాకాకుండా దబాయించి, బుకాయించి, స్టేలు తెచ్చుకుని, కౌంటర్ నోటీసులిచ్చి….తప్పించుకోవాలని చూస్తే మాత్రం మీరు దొంగలుగా తేలినట్టే. దోషులుగా రుజువయినట్టే. మీ లోతు తేలిపోయినట్టే. మీ అంతు చూడకతప్పదు.

6. ఎదుటివాళ్లు చిన్న తప్పు చేసినా మీడియా ద్వారా వీలైనంత గోలచేయించి, అవతలివాడిని ఆగమాగం చేసే చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇతర ఆంధ్ర పత్రికలు, చానెళ్లు…. ఇప్పుడు ఎంత నంగనాచుల్లాగా వ్యవహరిస్తున్నాయో చూడండి. కేటీ రామారావు ఏదో ఒక భూమి సెటిల్‌మెంటులో ఒక కిడ్నాపర్‌కు సహకరించారని, ఒక చిన్న ఫొటో పట్టుకుని నానా రచ్చ చేసిన రాధాకృష్ణ, ఇప్పుడు రాజకీయాలను, న్యాయ సూత్రాలను తుంగలో తొక్కి నిర్లజ్జగా దొరికిపోయిన చంద్రబాబును రక్షించడానికి ఎంతగా ఆరాటపడుతున్నారో చూడండి. ఆంధ్ర మీడియా స్వభావమే అంత తమ వాళ్లయితే ఎంత నేరాలు ఘోరాలు చేసినా కాపాడుకుంటుంది. అవి పెద్ద నేరాలుగా కనిపించవు. తెలంగాణ వాళ్లు ఎంత చిన్న తప్పు చేసినా నిలువునా బలిపెట్టడానికి ఒడిగడుతుంది. అనైతిక కార్యకలాపాల్లో, అక్రమాల్లో తలపండిన ఆంధ్ర ఆధిపత్య శక్తులు వాటన్నింటినీ ఎంచక్కా చట్టంలోని లొసుగుల కింద కప్పేసి పెద్దమనుషులుగా చెలామణి కావడం చాలాకాలంగా జరగుతున్నది. బ్యాంకులను ముంచిన వాళ్లు యథేచ్ఛగా మంత్రులుగా కొనసాగుతారు. కంపెనీలు పెట్టి, సామాన్యుల నుంచి పెట్టుబడులు పోగేసి, బోర్డులు తిప్పేసిన వాళ్లు సమాజంలో చాలా గౌరవనీయులుగా తిరుగుతుంటారు. కుంభకోణాల్లో చిక్కుకున్నవారు ఉన్నత పదవుల్లో నిశ్చింతగా కొనసాగుతారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “అది చంద్రబాబు వాయిసే, పరకాలే సగం ఒప్పుకున్నారు”

 1. Recorded conversations are treated in different ways by the law depending on how the recording is obtained. Tape recordings of conversations have repeatedly been held to be admissible as evidence by courts. However, this does not automatically make telephone tapping and the recording of telephonic conversations legal.

  Telephone tapping is, of course, subject to its own laws:
  •Section 5(2) of the Indian Telegraph Act, 1885, which grants the Government the power to order the interception of messages;
  •Rule 419A of the Indian Telegraph Rules, 1951, which lays down the procedural requirements which must be followed for telephone tapping to be legal;
  •Section 69 of the Information Technology Act, 2000, which deals with the power to issue directions for interception or monitoring or decryption of any information through any computer resource;
  •Information Technology (Directions for Interception or Monitoring or Decryption of Information) Rules, 2009.
  http://copyright.lawmatters.in/2012/02/recording-telephonic-conversations.html

 2. వెయ్యి గొడ్లను తిన్న రాబందువైనా ఒక్క గాలి వానకు నేలకొరగాల్సిందే.. చంద్రబాబు విషయంలోనూ ఇదే జరిగిందనిపిస్తుంది. రాజకీయాల్లో భేరసారాలు, రాయబారాలు ఈ రోజువి కావుకదా.. గుట్టు చప్పుడు కాకుండా సాగిపోయినన్ని రోజులు అందరూ నీతిమంతులే.. బండారం వీడియోల్లోకి, లోగుట్టు ఆడియో టేపుల్లోకి ఎక్కినప్పుడే.. దొంగలు దొరికిపోతారు.. బుకాయించడం రానివాడు రాజకీయనాయకుడే కాదన్నట్టుగా ఉంది బాబు అండ్ కో వాదన. ఏదీ ఏమైనా రాజకీయాల్లో ఎంత కుళ్లు, కుతంత్రముందో.. మరోసారి కళ్లకు కట్టాయి గత కొన్ని రోజులుగా తెలుగు నేలపై జరుగుతున్న పరిణామాలు.. గెలుపు ఎవరిదైనా.. ఓటమెవరిదైనా.. రాజకీయాల వలవలు ఒలిచి నగ్నంగా నిలబెట్టాయి ఈ పరిణామాలు.

 3. parakakala owes his position to his wife.ncb made him advisor to be in good books with her.let us not forget the treacherous role parakala played during prp time.we should not expect ethical behavour from such a dubious fellow

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s