తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో బాబు దీక్షాదక్షతలు


chan1

తప్పు చేసినా దొరకకుండా చేయడం నేర్పు. తప్పు చేయడమే కాక వాటిని మెడలో వేసుకుని తిరిగేవాడు ఎడ్డోడు. చంద్రబాబునాయుడికి చాలా మందికి తేడా అదే. చంద్రబాబునాయుడు ప్రజానాయకుడు కాదు. మంచి ఉపన్యాసకుడు కాదు. మంచి ఆలోచనలు కూడా ఏమీ లేవు. మంచి జనాకర్షణ కలిగిన రూపం కాదు. అందుకే ఆయన ఇతర తెలివితేటలను పుణికి పుచ్చుకున్నారు. నిర్వహణాదక్షుడుగా, నేర్పరిగా, మంత్రాంగకర్తగా పేరు తెచ్చుకున్నారు. చేతులకు మట్టి అంటకుండా పనులు జరిపించడంలో ఆయన దిట్ట. గత రెండున్నర దశాబ్దాల్లో జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే చంద్రబాబు దక్షత మనకు అర్థం అవుతుంది.

1. 1991 నేదురుమల్లి జనార్దనరెడ్డి ప్రైవేటు రంగంలో ఐదు ఇంజనీరింగు కళాశాలలు, రెండు వైద్య కళాశాలలకు అనుమతి ఇస్తే అది కుంభకోణంగానూ, విద్యావ్యాపారంగాను చిత్రించి, ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించగలిగారు. అదే చంద్రబాబునాయుడు 1995 నుంచి ప్రైవేటు ఇంజనీరింగు, వైద్య కళాశాలలు ప్రారంభించడం విప్లవంగానూ చిత్రించగలిగారు.

2. 1984లో ఎన్టీరామారావుపై నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటును వెన్నుపోటుగా నిర్ధరించడంలోనూ, అదే ఎన్టీ రామారావుపై 1995లో తాను చేసిన తిరుగుబాటును ప్రజాస్వామ్య పరిరక్షణగా చిత్రీకరించడంలోనూ ఆయన సఫలీకృతులయ్యారు.

3. చంద్రబాబునాయుడు 1995 నుంచి 2004 వరకు 2004 నుంచి 2009 వరకు రాజశేఖరరెడ్డి చేసిన పనులే చేశారు. చంద్రబాబునాయుడు అమాంతంగా సంపన్నుడయిపోయాడు. ఒక కంపెనీకి అధిపతి అయిపోయాడు. అనేక ఆస్తులు సంపాదించాడు. విద్యుత్ పీపీఏల కుంభకోణం, స్పెక్ర్టం కుంభకోణం, మద్యం ధరల కుంభకోణం, ఏలేరు కుంభకోణం, కేజీ బేసిన్ అప్పగింత… ఒక్క కేసు కూడా విచారణ దాకా రాకుండా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకోగలిగారు. ఎవరికి ఎన్ని రకాల మేళ్లు చేసినా, వారు తనకు ఏరకంగా ప్రతిఫలం సమకూర్చినా కనపడకుండా చూసుకోగలిగారు. మీడియా ఆయన చెప్పినట్టు వింటుంది. అన్ని వ్యవస్థలు ఆయన జోలికి వెళ్లకుండా దూరం పాటిస్తుంటాయి. రాజశేఖరరెడ్డి చేసిన మేళ్లు, తీసుకున్న ప్రతిఫలాలు మరీ ప్రదర్శనకు పెట్టారు. జగను స్వైర విహారమే చేశారు. అందుకే చంద్రబాబు అధికారంలో ఉన్నారు. జగను ప్రతిపక్షంలో ఉన్నారు.

4. రేవంతురెడ్డిది పూర్తిగా ఎడ్డి వ్యవహారం. “రెడ్లు ఎడ్లు. ఏదీ దాచుకోరు. దేనినీ లెక్కపెట్టరు. తొందరగా బయటపడిపోతారు. అందరికీ చిక్కిపోతారు’ అని అయ్యవారు అంటుండేవారు. రేవంతుడిని చూశాక అది ముమ్మాటికీ నిజమనిపించింది. స్వయంగా వెళ్లనేల. గంతసేపు, గన్ని విషయాలు మాట్లాడనేల. రెడ్ల అవసరం గురించి ఓ ఆంగ్లో ఇండియనుకు అంత కథ చెప్ప నేల. మళ్లీ మరుసటి రోజు యాభై లక్షలు తీసుకుని తానే పోనేల. రాష్ర్టానికి కాబోయే ముఖ్యమంత్రిని నేనే అనుకునేవాడు ఇంత చిల్లరగా దూకనేల.

5. ఇప్పుడు కూడా ఎంత తెలివిగా ఆట ఆడుతున్నాడో చూడండి. రేవంతుడు బాహాటంగా దొరికిపోయాడు. చంద్రబాబు చెబితేనే ఈ దొంగతనానికి వచ్చినట్టు ఆయన విడియోసహితంగా అంగీరించాడు. చంద్రబాబు ఇందులో తప్పించుకోవడానికేమీ లేదు. ఇక రైలు మీదికి వస్తుందని తెలుసు. అందుకే పట్టాలు తప్పించే విషయంపై దృష్టిని పెట్టాడు. తాను ఆమాయకుడైనట్టు, తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగినట్టు, కుట్రలో కేసీఆరు, జగను ఏకమైనట్టు ఒక సిద్ధాంతం తయారు చేశారు. వారి మీడియా కూడా ఈ సిద్ధాంతాన్ని అందిపుచ్చుకుంది. విచిత్రంగా ఈ సిద్ధాంతాన్ని తెలంగాణ మేధావులకు కూడా విజయవంతంగా ఎక్కించగలిగారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన ఒక సంపాదక మేధావి కేసీఆరు, జగను ఎక్కడో కలిసి కూర్చుని కుట్ర చేసినట్టు తాను చూసినట్టు రాశారు.

భళా చంద్రబాబు…భళా

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

6 thoughts on “తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయడంలో బాబు దీక్షాదక్షతలు”

 1. He was just lucky enough to survive in the politics because of the support of his community and community members need political power to advance their business interest. Now things are different with Revant episode, because they want to convert Indian State as theyr personal estate and rule people under the guise of Democracy perpetually. NOW IT IS TIME TO SMASH THIS, and this can be done ONLY BY UNITING OBC’s. Their strength is in keeping BOC’s and SC ST disunited. This is a big challenge for OBC leaders to forge unity.

 2. Great summary on CBN Character. First letter in CBN infact stands for “Chaalu” I would leave it to the readers imagination what the next letter stands for but can leave a clue that it comes from Urdu.

  As far as your claim that an esteemed editor from Telengana… What can we say? He fell in the trap that has been carefully woven in the last few days.

  Make no mistake, but ordinary citizens often times behave more rationally than esteemed editors. There is no denying that CBN’s only option, as you correctly said, is it to divert the tracks before the rail over runs him. Unfortunately, going by the history, he is perfectly capable of doing that or at least trying his best.

  This is where the Telangana Administration has to show its mettle and handle it as a pure law and order situation rather than making it look like political maneuvering. It appears that Home Minister’s yesterday remarks do not bode well in this regard. Commenting on an active and ongoing investigation is not at all conducive from a prosecution and investigation perspective. There was no reason to reveal that they have CBN voice recorded while talking to Mr Stevenson. This is immaturity at best if not outright stupidity. There is a time and place to reveal about CBN voice print at appropriate time, place. Yesterday was neither the time nor the place.

  As you can see this is going to be turned in to a illegal call recording case than a Note for Vote case.

 3. Great analysis of CBN’s character basing historical facts and events. Keep it up Mr. Katta. I always enjoy yor column on Namaste Telangana.

 4. మీ మాటలు అక్షర సతా్యలు … బాబు రాజకీయ జీవితమ౦తాఇతరులను మోస౦చేసి పై సా్థయికి వెళ్ళడమే కదా !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s