చంద్రబాబును వదలని సమైక్య దయ్యం


image

చంద్రబాబును సమైక్య దయ్యం వదలలేదు. జూన్ రెండున విజయవాడలో మైకేల్ జాక్సన్ లాగా వేదికల మీద తిరుగుతూ చేసిన ప్రసంగాలన్నీ రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా చేసినవే. రాష్ర్ట విభజనను ఆపడానికి తాను చేసిన ప్రయత్నాలు, విభజన వల్ల ఆంధ్రకు జరిగిన నష్టాలు, కాంగ్రెసు దుర్మార్గాలు ఏకరువు పెట్టారు. హైదరాబాదును కోల్పోయి ఆంధ్ర ఎలా నష్టపోయిందో విలపించారు. రాజధాని కూడా లేకుండా విభజించారు అని వలపోశారు. అంతేకాదు ఆయన సమైక్య రాష్ర్టం కోసం పోరాడినవారికి పురస్కారాలు కూడా అందజేశారు. రాజకీయ స్వార్థం కోసమే రాష్ర్టాన్ని విభజించారని ఆయన విమర్శించారు. “తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ర్టాన్ని విభజించాలని తెలుగు దేశం తీర్మానిస్తున్నది. తెలుగుదేశం అధికారంలోకి రాగానే రాష్ర్ట విభజనకు అన్ని చర్యలు తీసుకుంటుంది’ చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశమే ఒకప్పుడు తీర్మానించిన విషయమూ ఆయన కన్వీనియంటుగా మరచిపోతారు.

చంద్రబాబు సమస్య ఏమంటే ఆయన హైదరాబాదును, తెలంగాణను మరచిపోలేకపోతున్నారు. హైదరాబాదుపై మోహం ఆయనను పిచ్చివాడిని చేస్తున్నది. అందుకే ఆయన ఎన్నికల్లో గెలవలేమని తెలిసి కూడా ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి, వందలాది మంది పెయిడ్ కార్యకర్తలను పోషించడానికి సిద్ధపడుతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయినా ఇంకా బుకాయింపులకు దిగుతున్నారు. ఆయన ప్రమేయంతోనే రేవంతురెడ్డి టీఆరెసు ఎమ్మెల్యేను కొనడానికి ప్రయత్నించారని చంద్రబాబు బుకాయింపులు నిర్ధారిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొకరయితే ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించేవారు. తెలంగాణపై వ్యామోహమే చంద్రబాబును కట్టిపడేస్తున్నది.

రేవంతురెడ్డి వ్యవహారం వల్ల ఆంధ్రలో కూడా చంద్రబాబు నవ్వుల పాలయ్యాడు. ఒకవైపు పేద అరుపులు అరుస్తూ ఇంత డబ్బు ఎలా వెదజల్లుతున్నారని అక్కడి జనం మాట్లాడుకుంటున్నారు. దీనిని జగను కూడా ఉపయోగించుకుంటున్నారు. ఆంధ్ర టీడీపీ నాయకులు కూడా తెలంగాణ పితలాటకం అవసరమా అని బాబుపై గుస్సా ప్రదర్శిస్తున్నారు. అనసరమైన తలనొప్పులు తెచ్చుకోవడం కాకపోతే రేవంతురెడ్డిని ఇంతగా తలకెక్కించుకోవాలా అని గుంటూరు జిల్లా సీనియరు నేత ఒకరు ప్రైవేటు సంభాషణల్లో అన్నారని సమాచారం. చంద్రబాబు సమైక్య వ్యామోహంతోనే తప్పుల మీద తప్పులు చేస్తున్నారని వారు చెబుతున్నారట. ఎంతకాలమని ఈ మాటలు చెప్పి కాలం వెళ్లదీస్తాం అని వారు ప్రశ్నిస్తున్నారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “చంద్రబాబును వదలని సమైక్య దయ్యం”

  1. “Full-spectrum dominance is a military entity’s achievement of control over all dimensions of the battlespace, effectively possessing an overwhelming diversity of resources in such areas as terrestrial, aerial, maritime, subterranean, extraterrestrial, psychological, and bio- or cyber-technological warfare.”

    Chandrababu and Revent Reddy has envisioned Full Spectrum Dominance of Socio Political life of Telengana and Andhra.
    Revant Reddy’s episode exposes KaRePac(Kamma Reddy Pack) Conspiracy to rule teludu under the disguise of Democracy. It’s time to smash this dominance. Therefore it’s time for OBC and ST SC to unite

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s