ఆంధ్ర మీడియా కొంగజపం – చంద్రబాబు బుకాయింపులు


IMG_3188

1. ఓటుకు నోటు కుంభకోణంలో ప్రధాన పాత్రధారి రేవంతురెడ్డి తాను చంద్రబాబు పంపితేనే వచ్చానని డజనుసార్లు చెప్పారు. చంద్రబాబు, బాసు, బాబు, బాబుగారు వంటి అనేక పదాలు రేవంతుడు చెప్పాడు. చంద్రబాబుతో మాట్లాడిస్తానన్నాడు. వచ్చి కలవమన్నాడు. వీటన్నింటి అర్థం ఏమంటే కుట్రదారు చంద్రబాబే. జేఎంఎం ఎంపీల కొనుగోలు కేసులో పీవీనే న్యాయవిచారణను ఎదుర్కోక తప్పలేదు. చంద్రబాబు ఎంత?

2. చంద్రబాబు ఇప్పుడు రేవంతుడి ఆపరేషనుతో తనకు సంబంధం లేదని అయినా చెప్పాలి. రేవంతుడిని పార్టీ నుంచి బహిష్కరించాలి. అలాగాక రేవంతుడికి మద్దతుగా బుకాయింపులకు దిగితే చంద్రబాబు కూడా లోపల కూర్చోవాలి. నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. చంద్రబాబు ఇప్పుడు ఏం చెప్పినా జనం నమ్మే స్థితి లేదు. కేసులు, సూటుకేసులు, మ్యానిపులేషన్సు, అమ్మకాలు, కొనుగోళ్లు బాబుకు మామూలేనని రాష్ర్టంలో అందరికీ పరిచితమే.

3. ఆంధ్రా మీడియా తేలుకుట్టిన దొంగల్లా రేవంతుడి ఘనకార్యం చాలా మామూలుదయినట్టు నటిస్తున్నది. ఇటువంటి ఎపిసోడే టీఆరెస్ వాళ్లు చేసి ఉంటే ఇదే ఏబీఎన్్, ఇదే ఈటీవీ తెలంగాణ, ఇదే ఆంధ్రా చానెళ్లు ఏం చేసి ఉండేవి? ఎంత యాగీ చేసి ఉండేవి? భూమీ ఆకాశం ఏకం చేసి ఉండేవి. కేసీఆరు రాజీనామా చేయాలని డిమాండు చేసేవి. ఒక్కటేమిటి కోతికి కొబ్బరికాయ దొరికినంత ఆనందంగా గెంతులేసేవి.

4. విచిత్రమైన వాదనలన్నీ చేస్తున్నాయి. రేవంతుడు నోట్లో వేలు పెడితే కొరకలేని చిన్నపిల్లవాడు. ఆయనను ఇరికించారట. ఎరవేసి పట్టుకున్నారట. అమాయకంగా దొరికిపోయాడట. ఆయన చేసిన నేరమూ వెనుకకు పోయింది. ఆయన ఎంత ముదురో, ఆయన ఇటువంటి సెటిల్్ మెంట్లు ఎన్ని చేసి ఉంటాడో తెలంగాణ వాళ్ల కంటే ఆంధ్రా మీడియాకే బాగా తెలుసు. అయినా ఆయన చేసిన నేరం తీవ్రతను తగ్గిస్తూ ఆయనను ఆమాయకుడిని చేస్తూ తప్పంతా టీఆరెస్సు ప్రభుత్వానిదే అయినట్టు బాబు చంచా మీడియా రాతలు కోతలు చేస్తున్నది.

5. జగను కేసులో కూడా FIRలు చాలా మారాయి. చార్జి షీట్లు మారాయి. మంత్రులు, ముఖ్యుల పేర్లన్నీ తర్వాతనే చేరాయి. IASల పేర్లు కూడా తర్వాతనే చేరాయి. ఇప్పుడూ అదే జరుగుతుంది. చంద్రబాబు పేరును FIRలో ఆ తర్వాత చార్జిషీటులో చేర్చాల్సిందే. ఫ్రాడు నాయకులను చుట్టూ పెట్టుకున్న చంద్రబాబు ఫ్రాడు చేయడని ఎవరు నమ్ముతారు. బ్యాంకులను నిలువునా ముంచినవాళ్లు, ప్రభుత్వ విద్యను భ్రష్టు పట్టించినవాళ్లు, పనులు చేయకుండా కేవలం కమిషన్లు తీసుకునే కాంట్రాక్టర్లు….వీళ్లను దాటుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లాలి. నిజమైన పారిశ్రామిక వేత్తలు జడుసుకుంటున్నారు చంద్రబాబు చుట్టూ ఉన్న వలయాన్ని చూసి.

6. ఇంత నగ్నంగా దొరికిపోయిన తర్వాత కూడా చంద్రబాబు, ఎర్రబెల్లి వంటివారు నిర్లజ్జగా బుకాయింపులకు దిగుతున్నారంటే వీరు ఎంత వీర ముదురు రాజకీయ టెంకెలో అర్థం చేసుకోవాలి. వీళ్లు ఏ వ్యవస్థలనూ గౌరవించరు. జనం అంటే భయం లేదు. ఎవరేమనుకుంటారోనన్న వెరపు లేదు. బుకాయించి, అబద్ధాలు ప్రచారం చేసి బతికేయవచ్చు అనేకునే క్లాసు వీళ్లు. వీళ్లను కాటేయాలంటే మళ్లీ కాలం రావాలె.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

6 thoughts on “ఆంధ్ర మీడియా కొంగజపం – చంద్రబాబు బుకాయింపులు”

  1. బాగా చెప్పారు. నేను ఆంద్ర వాడినైనందుకు సిగ్గు పడుతున్నాను . అసలు తెలంగాణలో తెలుగు దేశానికి చోటు ఇస్తున్న కొద్దిమంది ప్రజలు కూడా సిగ్గు పడాలి

  2. Sir meeru kooda weekend comment by Katta ani oka program chesi veella bagothalu expose cheyandi.
    appude inka migilina koddi mandi kooda clear ga ardam avthadi ee andhra media and leaders nirvakam.

  3. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది రెండుకండ్ల సిద్ధాంతి చంద్రబాబు స్థితి. వొటుకు నోటు కుంభకోణంలో రేవంత్రెడ్డి అడ్డంగా దొరికినా.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడినా మారడం లెదు. అలాగే టి టిడిపి నాయకులు ఇంకా “పచ్చ”కామెర్లు తగ్గడం లేదు.. బాబు భజన చేస్తూ.. మోచేతి నీళ్ళు తాగుతూనే వున్నారు..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s