తాగునీరు, సాగునీరుపై ముందడుగు


TEL_Major Irrigation ProjectsMap (1)

ఒక మీటరు పొడవు మీటరు వెడల్పు మీటరు లోతు మట్టిని తొలగిస్తే వెయ్యి లీటర్ల నీరు నిల్వ చేయవచ్చు. ఇప్పటివరకు ఆరు వేల చెరువుల్లో మూడు న్నర కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వినట్టు అధికారిక అంచ-నాలు వెలువడ్డాయి. రెండు కోట్ల ఎనభై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వితే ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయవచ్చు. ఒక్క టీఎంసీ నీరు కాపాడితే 25 కోట్ల ఆదాయం సృష్టించినట్టు. 2831 కోట్ల లీటర్ల నీటిని కాపాడినట్టు. మొత్తం చిన్న నీటివనరులన్నింటిలో పూడిక తీయించగలిగితే 265 టీఎంసీల నీటిని కాపాడితే ఎంత మేలు జరుగుతుందో ఊహించవచ్చు.

తప్పనిసరయి చేయడానికి, ఇష్టపడి చేయడానికి ఎంత తేడా ఉంటుందో సమైక్య ప్రభుత్వానికి, స్వరాష్ట్ర ప్రభుత్వానికి అంత తేడా ఉంటుంది. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య, అత్యంత ప్రాధాన్యం కలిగిన సమస్య తాగునీరు, సాగునీరు. కృష్ణా, గోదావరి వంటి మహానదులు, అనేక ఉపనదులు, పెద్ద పెద్ద వాగులు, అన్ని నీటి హక్కులు ఉండి కూడా గత ఐదున్నర దశాబ్దాలలో తెలంగాణకు అందుబాటులోకి తెచ్చిన సాగునీరు నికరంగా 300 టీఎం-సీలకు మించలేదు. మరో 265 టీఎంసీల నీటిని చెరువులు, చిన్న నీటి వనరుల కింద మనం వాడుకుంటున్నట్టు లెక్కలు చూపుతారు కానీ నిజానికి అవి ఎప్పుడూ లెక్కలోకి రాలేదు. ఇదే సమయంలో ఆంధ్రా ప్రాంతంలో వివిధ ప్రాజెక్టుల ద్వారా అందుబాటులోకి తెచ్చుకున్న నీరు1000 టీఎంసీలకు పైగానే ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులన్నీ అర్ధమనస్కంగా, సగం పీక-నొక్కి నిర్మించినవి. నీటి సామర్థ్యాన్ని తగ్గించి నిర్మించినవి. తెలంగాణలో తప్పనిసరయి ప్రారం-భించిన చాలా ప్రాజెక్టులు ఇప్పటికీ పూర్తి కాలేదు. ఏ రాష్ర్టానికయినా నీటికి మించిన సంపద లేదు. నీరు ఉంటే అన్నీ ఉన్నట్టే. సాగునీరు లేకనే తెలంగాణ రైతాంగం అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఆంధ్రా ప్రాంత రైతులు అతి స్వల్ప నీటితీ-రువా చెల్లించి కాలువల నీరు మళ్లించుకుని లాభాల పంటలు పండించుకుంటూ ఉంటే తెలం-గాణ రైతులు బోర్లు వేసి, కరెంటు మోటార్లు తెచ్చుకుని, అవి మధ్యమధ్యలో కాలిపోయి నానా-తంటాలు పడి నష్టాల్లో కూరుకుపోవలసి వచ్చింది. కరువు తెలంగాణకు దీర్ఘకాలిక వ్యాధిలా దాపురించింది. వరుసగా రెండు దశాబ్దాలుగా సంవత్సరం విడిచి సంవత్సరం తెలంగాణలోని అత్యధిక మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాల్సిన పరిస్థితి. రాష్ర్టాన్ని అత్యధిక కాలం పరిపాలించి ఈ దుస్థితికి బాధ్యత వహించాల్సిన కాంగ్రెస్, తెలుగుదేశం నాయకత్వాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై నోరుపారేసుకుంటూ ఉంటే ఆశ్చర్యం వేస్తుంది. ఐదున్నర దశాబ్దాల పాపాలను ఏడాదిలో ఎందుకు కడిగేయలేదని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఏమి చేస్తున్నారో ప్రజలకు మాత్రం అర్థం అవుతున్నది. కాంగ్రెస్, టీడీపీల పాపాలను ఊహించిన దానికంటే వేగంగానే ఆయన కడిగేస్తున్నారు. రెండు పార్టీలు మునుపె-న్నడూ చేయలేకపోయిన పనిని కేసీఆర్ తొలి ఏడాదిలోనే చేసి చూపించారు. కరెంటు కోతలు లేని తెలంగాణను ఆయన చూపించారు. తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులపై ఆయన అంతే పట్టుదలగా పని చేసుకుపోతున్నారు.

మిషన్ కాకతీయ ఇందులో తొలి అడుగు. నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు కాలికి బలపం కట్టు-కుని చెరువుల వెంట తిరుగుతున్న తీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక మీటరు పొడవు మీటరు వెడల్పు మీటరు లోతు మట్టిని తొలగిస్తే వెయ్యి లీటర్ల నీరు నిల్వ చేయవచ్చు. ఇప్పటివరకు ఆరు వేల చెరువుల్లో మూడు న్నర కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వినట్టు అధికారిక అంచ-నాలు వెలువడ్డాయి. రెండు కోట్ల ఎనభై లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వితే ఒక టీఎంసీ నీటిని నిల్వ చేయవచ్చు. ఒక్క టీఎంసీ నీరు కాపాడితే 25 కోట్ల ఆదాయం సృష్టించినట్టు. 2831 కోట్ల లీటర్ల నీటిని కాపాడినట్టు. మొత్తం చిన్న నీటివనరులన్నింటిలో పూడిక తీయించగలిగితే 265 టీఎంసీల నీటిని కాపాడితే ఎంత మేలు జరుగుతుందో ఊహించవచ్చు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ సరైన దిశగా అడుగులు పడుతున్నాయన్నది మాత్రం వాస్తవం. ఆధునిక తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాదల్చుకున్నవారు అందరూ ఈ దీక్షలో భాగస్వాముల-వుతున్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వంపై అరవడం కోసం తెలంగాణ ప్రత్యర్థులు నియోగిం-చిన వాళ్లు మాత్రం ఎప్పటిలాగే వంకరచూపులు చూస్తున్నారు. వంకరమాటలు మాట్లాడుతు-న్నారు. మిషన్ కాకతీయ విజయవంతంగా ముందుకు సాగే కొద్దీ ఈ అరిచే జాతి దానంతట అదే అంతరిస్తుంది. అదే జలచైతన్యంతో ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, ఐటిశాఖల మంత్రి కేటీఆర్ ముందుకు తెచ్చిన మరో గొప్ప ఆలోచన జలహారం(వాటర్‌గ్రిడ్). తాగునీరు ప్రజల హక్కుగా గుర్తించి, ఇంటింటికీ నల్లాతో నీరందించాలన్న ఒక మహాసంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తు-న్నారు. ఇప్పటికే ఇంటేక్‌వెల్స్ పనులు ప్రారంభం అయ్యాయి. జలహారం పైలాన్‌ను కూడా త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్కి ఒక విధంగా సాహసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ నల్లా నీరు ఇవ్వకపోతే ఓటు అడగబోమని చెప్పడం సాధారణమైన విషయం కాదు. ఎంత పట్టుదల ఉంటే, ఎంత అంకితభావం ఉంటే ఆ మాట చెప్పాలి.

మిషన్ కాకతీయ, జలహారం పనులతోపాటు నీటిపారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఒక ఆబ్సెషన్తో పనిచేస్తున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయడం తన జీవిత లక్ష్యంగా ప్రకటిస్తున్నారు. తెలంగాణ ఎక్కడ కోల్పోయిందో అక్కడే మొదట విజయం సాధించాలని ఆయన ముఖ్యమంత్రి ఇంజనీర్లు, ఉన్నతాధికారులతో స్పష్టం చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్టును పూర్తి చేయ-డానికి కాలవ్యవధి నిర్ణయించి ఆ కాల వ్యవధి ప్రకారమే పనులు చేయించాలని, లక్షించిన సమ-యానికి నీరు అందించేందుకు కృషి చేయాలని కూడా ఆయన చెప్పారు. తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం కలిగించే విధంగా ప్రాజెక్టుల రీ ఇంజనీరింగు జరగాలని ఆయన చెప్పారు. కృష్ణా నదిలో మనకు రావాల్సిన న్యాయమైన వాటా జలాలకు తగిన విధంగా పెండింగు ప్రాజెక్టులను పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం అవసరమని ఆయన ఆశిస్తున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకం అటువంటి ఆలోచన నుంచి పుట్టిందే. జూన్ రెండోవారంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే పూర్తయిన కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు వద్దే శ్రీశైలం నుంచి నీటిని ఎత్తిపోసి, కల్వకుర్తి ఎత్తిపోతల కాల్వ సామర్థ్యాన్ని పెంచి మధ్యలో రిజర్వాయర్లు నింపుతూ రంగారెడ్డి జిల్లా లక్ష్మీదేవిపల్లి దాకా నీరు తీసుకెళ్లాలన్నది ఈ కొత్త ప్రాజెక్టు ప్రణాళిక. అంతేకాదు ఈ ప్రాజెక్టు సహాయంతో హిమాయత్‌సాగర్‌కు నీరందించే ఈసీ నదిని, మమబూబ్‌నగర్, నల్లగొండ కరువుప్రాంతాలకు నీరందించే డిండి నదులను పునర్జీవింపజేయాలని కూడా ముఖ్యమంత్రి తలపెట్టారు. అంతేకాదు ఏడాదికాలంలోపు కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసి నీరందించాలని ఆయన అధికా-రులను ఆదేశించారు. అటు ఉత్తర తెలంగాణకు నీరందించే కాళేశ్వరం-పాములపర్తి ప్రాజెక్టును కూడా త్వరగానే ప్రారంభించి నాలుగేళ్లలోపే చివరి భూములదాకా నీరు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నది. అంతేగాక గోదావరి పొడవునా బరాజ్ కం రోడ్లను నిర్మించి విద్యుత్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీరందించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది.

కృష్ణా, గోదావరి నదుల్లో ఇంకా వెయ్యి టీఎంసీల నీటిని ఉపయోగించుకోవడానికి తెలంగాణకు అవకాశం ఉంది. వెయ్యి టీఎంసీల నీరంటే కోటి ఎకరాలు సాగులోకి తీసుకురావచ్చు. ఏటా సుమారు 25000 కోట్ల సంపద సృష్టించవచ్చు. తెలంగాణకు ఉన్న విలువైన వనరు నీరు. మన నీటిని మనం వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం తొలిసారిగా మనకు వచ్చింది. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణకు కలసివచ్చిన అంశం. స్వరాష్ట్ర నినాదాన్ని జాతీయం చేయడానికి, ఆమోదం పొందడానికి సాగునీటి సమస్యను ప్రధాన సమస్యగా ముందుకు తెచ్చారు. తెలంగాణ నదీ జలాల సమస్యను ఆయన చదివినంతగా, ఆయన అర్థం చేసుకున్నంతగా మరో నాయకుడెవరూ అర్థం చేసుకోలేదు. నీటిపారుదల ఇంజనీర్లతో, అధికా-రులతో, జర్నలిస్టులతో ఆయన సంభాషించినంతగా మరెవరూ చేసి ఉండరు. ఆయన నిత్య-శోధకుడు. అందుకే ఆయనకు ప్రాజెక్టులపై అంత లోతైన అవగాహన ఏర్పడింది. స్వరాష్ట్రం వచ్చింది కాబట్టి తన ఆలోచనలన్నింటినీ ఆచరణలో పెట్టడానికి ఆయన ఆరాటపడుతున్నారు. ఆయన ఏ సందర్భం వచ్చినా ప్రాజెక్టుల గురించి పలవరిస్తున్నారు. తాను కలలు కన్న జలతోర-ణాల తెలంగాణను సాధించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మన ప్రతిపక్ష నాయకులు ఎంత బురదలో కూరుకుపోయారంటే కొన్నిసార్లు విచక్షణ కూడా మరచిపోతున్నారు. కేసీఆర్ ఒక్క పెండింగు ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి అని ఒక సీని-యర్ రాజకీయ నాయకుడు ఇవ్వాళ ఒక సభలో మాట్లాడాడు. రాజకీయాల్లో ఇంత అంధత్వం ఉంటుందా అనిపించింది.

‘మా ప్రాజెక్టులు పూర్తవుతాయన్న ఆశ కలుగుతున్నది. కల్వకుర్తి పనిని రెండు మూడు రోజులకు ఒకరు వచ్చి సమీక్షిస్తున్నారు. మొదటిసారి ఎండాకాలంలో రాజోలిబండ మళ్లింపు కాలువకు నీళ్లొచ్చాయి. మొదటిసారి జూరాల వద్ద పూర్తిస్థాయిలో నీటిని ఉపయోగించుకోగలిగాం’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన రిటైర్డు ఇంజనీరు ఒకరు వ్యాఖ్యానించారు. ‘మీకు కొత్త చట్టం ప్రకారం మార్కెట్ రేటును దృష్టిలో పెట్టుకుని పరిహారం చెల్లిస్తాం. కాలువ పనులకు అడ్డం పడొద్దు. మీ ఐదెకరాల వివా దం వల్ల పదివేల ఎకరాల భూములకు, ఏడు చెరువులకు, పది గ్రామాలకు నీరు రాకుండాపోతున్నది. ఆ గ్రామాలు తాగునీటికి కూడా కటకటపడతున్నాయి. మీ గ్రామాల ప్రజల కోసం ఆలోచించండి. మీరు మొండికేస్తే నేను కాలువ పనిపూర్తి చేసి జైలు కెళ్ల-డానికైనా సిద్ధం’ అని ఒక ఐఏఎస్ అధికారి ఇటీవల రైతులతో జరిగిన ఒక సమావేశంలో స్పష్టం చేశారు. ఆ అధికారి ధీమా ఈ ప్రభుత్వం దృఢసంకల్పాన్ని తెలియజేస్తున్నది. ‘చిన్న వివాదం-కోసం కోట్లు ఖర్చుపెట్టి ఆరేళ్లు కాలువను పడవా పెడతారా? అసలేం జరుగుతోంది? ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వున్నారు? మీరేం చేస్తారో తెలియదు. ఆ వివాదాన్ని పరిష్కరించి రెండు వారాల్లో తీసుకున్న చర్యల నివేదిక(ఏటీఆర్) పంపాలి’ అని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అధికారులకు స్పష్టం చేశారు. మంత్రి ఆదేశం రాజకీయ సంకల్పాన్ని తెలియజేస్తున్నది. పరుగెత్తే-వాళ్ల కాళ్లల్లో కట్టెలు పెట్టుడు మాని, కలిసి పరుగెత్తడానికి, అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావడానికి ప్రతిపక్ష నాయకులు ప్రయత్నించాలి. కాల్వకు కత్వకు తేడా తెలియకపోయినా రోజుకు రెండుసార్లు మీడియా ముందుకు వచ్చి లొడలొడ వాగిపోయే నాయకులు తెలంగాణకు అక్కర లేదు. తెలంగాణకు కావలసింది నిర్మాణాత్మక రాజకీయ నాయకత్వం. వాళ్లు అధికారపక్షమయినా సరే, ప్రతిపక్షమయినా సరే.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “తాగునీరు, సాగునీరుపై ముందడుగు”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s