చంద్రబాబు నిజస్వరూప దర్శనం / Real face of Chandrababu


    
ఆంధ్ర ప్రజలు విభజన జరుగుతుందనుకోలేదు. విభజనకు సంబంధించిన అనూహ్య షాక్ నుంచి ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఎమర్జెన్సీ కంటే దారుణంగా అరగంటలో విభజన చేశారు. 

….శుక్రవారం ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  

****************

ఆయన ఏడుపు ఏడుపు కాదు

అక్కసుకు హద్దులేదు

ఆడలేక మద్దెలను తిడుతున్నాడు

ఆగకుండా శాపాలు పెడుతున్నాడు

***************

సాగినప్పుడు నాకంటే మొనగాడు లేడన్నాడు

హైదరాబాద్ బలం నా బలమే అన్నాడు

తాము లేకుంటే తెలంగాణా బతకలేదన్నాడు 

తెలంగాణా వాళ్ళకు పాలించడం తెలియదన్నాడు

పేద తెలంగాణాను ఆంధ్రనిధులతో పోషిస్తున్నమన్నాడు

***************

ఇక్కడ తెలంగాణకు మద్దతు ఇచ్చానంటాడు 

అక్కడ విభజనకు వ్యతిరేఖంగా కొట్లాడింది తానేనంటాడు

పద్నాలుగేల్లుగా ఉద్యమం జరుగుతుంటే 

మూడేళ్ళుగా ప్రాసెస్ జరుగుతూ ఉంటె  

జనాన్ని విభజనకు సన్నద్ధం చేయకుండా….

విభజనను అపుతానంటూ విమానం చక్రాలు పట్టుకుని  

చెన్నై టు కోల్కత్త టు లక్నో టు ఢిల్లీ షికార్లు చేసి…

జనాన్నిచివరిదాకా భ్రమల్లో ముంచి, 

చివరికి బంగాళాఖాతంలో ముంచింది నువ్వుకాదా బాబూ? 

బహురూపాలు, భలే వేషాలు, చివరికి మోసాలు…. 

***************

ఎక్కడైనా అద్భుతాలు సృష్టించగల  

నీలోని స్టార్ అఫ్ ఏషియా ఏమయ్యాడు ప్రభూ?

సెల్ ఫోను తెచ్చింది నేనే, గూగుల్ వచ్చింది నావల్లే అంటావు…

ఇప్పుడేమైంది బాబూ ఇంత బేలగా దీనంగా మాట్లాడుతున్నావు? 

హైదరాబాద్లో ఉంటే తప్ప, హైదరాబాద్ సొమ్ములు ఉంటె తప్ప 

కాళ్ళూ చేతులూ ఆడటం లేదా తండ్రీ నీకు? 

**************

ఇప్పటికైనా దిగు తండ్రీ నేలపైకి, వాస్తవ ప్రపంచంలోకి….

నిజాలు చెప్పు ప్రభూ నీ జనానికి…..
 

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

5 thoughts on “చంద్రబాబు నిజస్వరూప దర్శనం / Real face of Chandrababu”

  1. Any news that about politics should be in image form rather than text,news in the form of images spreads viral than news in text format,so try to put news in pictures

  2. Fantastic, Shekar! Congrats! Why not publish this in Namasthe!  Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s