ఒక మీడియా మాయావి వంకరతనం


02_PARTY (2)

తెలంగాణ ఐటి మంత్రి కే తారకరామారావు బిజినెస్ టూరుపై అమెరికా వెళ్లారు. ఆయన చాలా మంది పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. వారిలో విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టడానికి అంగీకరిస్తూ అవగాహనా పత్రాలపై సంతకాలు కూడా చేశారు. అయితే తెలంగాణ రావాలని ఇంతకాలం కోరుకున్నవారు, ఆరాటపడినవారు తారకరామారావు పర్యటన సందర్భంగా కొంత హడావిడి చేసి ఉండవచ్చు. ఆయన యాత్రలో సందడి చేసి వుండవచ్చు.

కానీ వంకరతనం పుణికిపుచ్చుకున్న ఓ పత్రికా మాయావికి ఇందులో కూడా ఏదో వెలితనం కనిపించింది. తారకరామారావు పర్యటనను చులకన చేయడంకోసం, ఆయన ఏదో ప్రచారం కోసం అక్కడ పర్యటిస్తున్నారని చెప్పడంకోసం లోకేశును అడ్డంపెట్టుకుని ఇటు నాయకులమీద, అటు ఎన్నారైలమీద తెగతీర్పులు ఇచ్చేశారు. తానాల పేరుతో, ఆటాల పేరుతో, నాటాల పేరుతో జరిగిన రసాభాసలెప్పుడూ ఈ మాయావికి కనిపించలేదు. గుంపులు గుంపులుగా పోయి అక్కడ సందేశాలిచ్చి, వారిచ్చిన ఆతిథ్యాలు స్వీకరించినప్పుడు వెకిలితనం కనిపించలేదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s