‘కేసీఆర్ ను ఇలా ఊహించలేదు?’


KCR is a leader with out of box thinking

కట్టా మీఠా

మన రాష్ట్రం, మన ముఖ్యమంత్రి

01_KCR (3)_1

కేసీఆర్ ప్రమోటీ నాయకుడు కాదు. అనేక పరీక్షల్లో నిగ్గుదేలిన నాయకుడు. తనను తాను సానపట్టుకుని రాటు దేలిన నాయకుడు. ఆయనకు పద్నాలుగేళ్ల ఉద్యమం అందించిన దార్శనికత ఉంది. పట్టిన పట్టువదలడన్న పేరు ఉంది. అనుకుంటే సాధించి తీరాలన్న పంతం ఉంది. పని రాక్షసుడు.

ఉదయం ఎనిమిదిన్నర గంటలు. కళ్లద్దాలు పెట్టుకుని బనీను ధరించిన పెద్దాయన ఓ కట్ట పత్రికలు ముందేసుకుని చదువుతున్నారు. కొన్ని పరీక్షగా, కొన్ని పైపైన చూస్తున్నారు. ఆయన అలా ఓ గంటకు పైగా ఆ పత్రికల్లో మునిగిపోతారు. తర్వాత రెడీ కావడం వచ్చిన వారిని కలవడం, సచివాలయానికి వెళ్లడం, అక్కడ గంటలు గంటలు సమీక్షలు. మధ్యాహ్న భోజనం తర్వాత మళ్లీ సమీక్షలు. ఒక్కోసారి ఐదారు గంటలు ఏకబిగిన సమీక్షల్లో కూర్చుంటున్నారు. ఒక్కసారి సమీక్షలో కూర్చుంటే మధ్యలో ఎవరినీ కలవడం లేదు. ముఖ్యమంత్రి మమ్మల్ని కలవడం లేదని కొందరు నొచ్చుకున్న సందర్భాలూ ఉన్నాయి. అసెంబ్లీ నడుస్తున్న రోజుల్లోనూ అంతే. ఆయన దిన చర్య అంతే బిజీగా ఉంటున్నది. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ ఏవో ఆంతరంగిక సమావేశాలు కొనసాగుతున్నాయి. ‘కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంత కష్టపడతారని, ఇలా పనిచేయగలరని మేము ఊహించలేదు. ఇంత సమర్థంగా అసెంబ్లీ సమావేశాలను ఎదుర్కొంటారని అనుకోలేదు. మా అనుమానాలన్నీ పటా పంచలయ్యాయి’ అని ఒక సీనియర్ ఆంగ్ల జర్నలిస్టు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల చివరిరోజున కేసీఆర్ ప్రసంగం అందరినీ సంభ్రమాశ్చర్యాలకు…

View original post 572 more words

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Poetry. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s