సినిసిస్టు మేధావులు

IMG_2293

ఆయన విప్లవకారుడు కాదు, ఎప్పుడో సరిహద్దులు దాటొచ్చాడు…

ఆయన మేధావి కాదు, ఎప్పుడో మేధస్సును అన్ని వాదాలు, తీరాలు దాటించాడు…

ఆయన ఉద్యమకారుడు కాదు, ఎప్పుడో జారుడుమెట్లపై ఒరిగిపోయాడు…

ఆయనేమీ నిక్కచ్చి మనషి కాదు, ఎప్పుడో రాజీల బాటలో జారిపోయాడు…

ఆయన నిరాశ్రయుడు కాదు, అందరికంటే ముందు ఆశ్రితడుగా చేరినవాడు…

ఆయన సాధకుడు కాదు, ఆడిపోసుకోవడం బాగా తెలిసినవాడు…

నాలుగు దశాబ్దాలుగా విఫలమయినా పరవాలేదు, ఆరు మాసాల్లో అన్నీ తేలాలంటాడు…

ఏ ఇష్టులయినా, తెలంగాణ మేధావులంతా ఒక రాష్ర్టం సాధించారు…

అన్ని ఇష్టాలకు దూరమైన ఆయన మాత్రం సినిసిజం సాధించారు…

అయినా ఆయనంటే ఇష్టమే…. ఎందుకంటే ఆయనలోని ఒకప్పటి హీరో ఇప్పటికీ గుర్తే…

–రాచకొండ రామప్ప

మన ప్రాజెక్టులు వద్దట…పోలవరం జోలికి రావద్దట….

తెలంగాణలోని చంద్రబాబు ఏజెంట్లు ఇప్పుడేమంటారు?

prphr

పోతిరెడ్డిపాడు విస్తరణకు అనుమతులున్నాయా?

పోలవరం ప్రాజెక్టుపై తమ సర్కారుకే పూర్తి అధికారాలు అప్పగించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అంతేకాదు, కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన రెండు కొత్త ప్రాజెక్టులపై తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కృష్ణాబోర్డు అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించాలనుకుంటోందని ఫిర్యాదు చేసింది. ఆయా అంశాలను వివరిస్తూ కేంద్రానికి లేఖ పంపించింది. ‘‘కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో చెప్పకుండా, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాలను ప్రతిపాదించడం అభ్యంతరకరం. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ విభజన చట్టం నిబంధనలను తెలంగాణ సర్కారు ఉల్లంఘిస్తోంది’’ అని ఏపీ సర్కారు ఆక్షేపించింది. ఇటీవల తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను ప్రస్తావించారు. ప్రాజెక్టుల ఫీజిబులిటీ అధ్యయనం కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు చేశారు.