చెల్లనికాసుల చిల్లర పంచాయితీ


కట్టా మీఠా

image

తెలంగాణ అసెంబ్లీ గౌరవం కాపాడుకుందాం

నీకు మంచిపేరు లేకపోతే అవతలివాడికి ఉన్న పేరును చెడగొట్టెయ్. నీవు చిన్న గీత అయితే, నీ గీతను పెంచుకోలేకపోతే పెద్ద గీతను చెరిపేసెయ్. ముఖం బాలేకపోతే అద్దం పగులగొట్టు. నీకు చేయడానికి ఏ పనీ లేకపోతే అవతలివాడి పనిని కూడా చెడగొట్టు. సీమాంధ్ర ఆధిపత్య శక్తులు చాన్నాళ్లుగా అమలు చేస్తున్న వ్యూహం ఇది. చంద్రబాబు, వైఎస్సార్, తెలంగాణలోని వారి ఏజెంట్లు, ఆంధ్ర మీడియా… అందరిదీ అదే దారి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని నైతికంగా దెబ్బతీయడానికి వారు చేయని ప్రయత్నం లేదు. కేసీఆర్‌పై వ్యక్తిగతంగా అత్యంత నీచమైన దాడులకు కూడా వెనుకాడలేదు. తాగుడు, జూదం, వ్యభిచారం, ఆర్థిక నేరాలు, దందాలు, మోసాలు, ఏమాటకూ కట్టుబడని రాజకీయ అవినీతి వంటి సకల అవలక్షణాల పునాదులపై పుట్టిపెరిగిన సీమాంధ్ర నాయకత్వం తమ మచ్చలను కప్పి పుచ్చుకుని తెలంగాణ నాయకత్వంపై దాడులు చేయించింది. తెలంగాణలోని కొందరు కిరాయి కోటిగాళ్లను అడ్డంపెట్టుకుని తెలంగాణ నాయకత్వంపై విపరీతమైన విషప్రచారం చేయించింది. తెలంగాణ నాయకులు తాగుతారని, వారికి రాజకీయాలు చేతకాదని, పార్టీలను నడుపలేరని, టికెట్లు అమ్ముకుంటారని….ఇంకా నోటికి ఏమి వస్తే అవి మాట్లాడించారు. నిజానికి రాజకీయాలను లాభసాటి వ్యాపారంగా మార్చింది సీమాంధ్ర నాయకత్వమే. పార్టీలను లిమిటెడ్ కంపెనీలుగా మార్చింది వారే. టిక్కెట్ల అమ్మకాలు కొనుగోళ్లు ప్రవేశపెట్టింది చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలే. హైదరాబాద్ చుట్టూ ఎస్టేట్‌లు, ఫామ్ హౌజ్‌లు, పారిశ్రామిక సామ్రాజ్యాలు నిర్మించుకుంది వారే. మొత్తం కుటుంబాలను రాజకీయాల్లోకి…

View original post 707 more words

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s