పరకాల ప్రభాకర్‌కు ఇరిగేషన్ జీవోల గురించి తనేకేదో గొప్ప తెలివి ఉన్నట్టు ఇవ్వాళ మీడియా ముందు మాట్లాడారు. జీవో 69 జారీ చేసింది జూన్ 1996లో. జీవో 107 జారీ చేసింది సెప్టెంబరు 2004లో. రిజర్వాయరు నీటి మట్టాన్ని 834 నుంచి 854కు పెంచుతున్నట్టు ఈ జీవోలో పేర్కొన్నారు. జీవో 233 జారీ చేసింది 2005 డిసెంబరులో. అన్నీ శ్రీశైలం రిజర్వాయరు నీటి నిల్వల ఆపరేషన్స్‌కు సంబంధించినవే. జీవో 69ని తప్పనిసరిగా అమలుచేయాలని జీవో 233 జారీ చేశారు అని పరకాల స్వయంగా చెప్పారు.
తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పింది కూడా అదే కదా. జీవో 107 తర్వాత జీవో 233 వచ్చింది కాబట్టి, అందులో పేర్కొన్న ఆదేశాలే అంతిమమైనవని, దాని ప్రకారమే నడుచుకుంటు న్నామని హరీశ్‌రావు చెప్పారు. శ్రీశైలం రిజర్వాయరు నీటి నిల్వల నిర్వహణకు సంబంధించి జీవో 69లో పొందుపరిచిన ఆపరేషన్ రూల్సే వర్తిస్తాయని జీవో 233 స్పష్టం చేసింది.
విద్యుత్ వినియోగం కోసం 834 అడుగులకు దిగువన నీటిని వినియోగించరాదదు అని జీవో 69 స్పష్టం చేసింది. 834 అడుగులకు దిగువన తాగునీటి అవసరాలకు మాత్రమే తీసుకోవాలని కూడా ఆ జీవో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జీవో 69కు అనుగుణంగానే విద్యుదుత్పత్తి చేస్తున్నది. అబద్ధాలతో బతుకుతున్నవాళ్లు ఇతరులపై బండలు వేయకుంటే మంచిది.
Parakala talks as if he is the only guy who can read and write, which isn’t the case!
‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు’ అన్నట్టు, నిర్మలా సీతారామన్ సపోర్ట్ తో ఏదో గౌరవప్రదవ మైన పోస్ట్ తెచ్చుకున్న పరకాల ఎంతసేపూ వార్తల్లో ఉండటానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూనే ఉంటాడు. కనీస విషయ పరిజ్ఞానం లేకుండా తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్య పెడుతుంటాడు. అపర మేదావి లా పేద్ద ఫోజు కూడా.
ఒక విధంగా చెప్పాలంటే, తెలంగాణా సాకారమైంది ఇటువంటి మూర్ఖుల మూర్ఖత్వం వల్లనే. నిజం నిలకడగా అందరికీ తెలుస్తూనే ఉంటుందిగా.