ఈనాడు చంద్రబాబు అబద్దాల పంచాంగం


IMG_2351-0.JPG

IMG_2350-0.JPG

IMG_2350-3.JPG

శ్రీశైలం ఆపరేషన్స్ గురించి చంద్రబాబుకు చాలా విషయాలు తెలిసినట్టు, ఏడు పేజీల వాదన రాసినట్టు ఇవ్వాళ ఈనాడు దినపత్రిక ఒక పావు పేజీ వార్త సమర్పించింది. అందులో పేర్కొన్న ఒకే ఒక్క వాస్తవం మొత్తం వార్ఘ అబద్దమని రుజువు చేస్తుంది…. కుడిగట్టు విద్యుత్తూ కేంద్రం ద్వారా 6 టీఎంసీ లను ఉపయోగించుకునేందుకు జీఓలు అవకాశం ఇస్తున్నప్పటికీ చంద్రబాబు దయతలచి విద్యుత్ కేంద్రం మూసేసారట. చంద్రబాబుకు అవకాశం కల్పించే జీఓలు తెలంగాణకు అవకాశం కల్పించవా? మీకు కరెంటు సరిపోను ఉంది కాబట్టి ఉపయోగించుకోవడం లేదు. కరెంటు లేక జనం కటకట పడుతుంటే తెలంగాణా ఎందుకు ఉత్పత్తి ఆపేయాలి?

రాయల సీమకు ఇంకా 17 టీఎంసీల నీరివ్వాలట. అందుకు తెలంగాణా విద్యుత్ ఉత్పత్తి అపేయాలట. శ్రీశైలం నుంచి ఇప్పటికే ఈ సీజన్లో 76 టీఎంసీల నీటిని తరలించారు. సీమ హక్కు 34 టీఎంసీలు మాత్రమే. సోమశిల, కండలేరు, వెలిగోడు, బ్రహ్మంగారిమఠం, అవుకు సాగరాలు నింపుకున్నారు. తమిళనాడుకు నీరిచ్చేందుకు కండలేరులో 21 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. సోమశిలలో 45.23 టీఎంసీలు, వేలిగోడులో 10.6 టీఎంసీలు నిల్వ చేసినట్టు ఆంధ్ర ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. బ్రహ్మంగారిమఠం, అవుకు, మైలవరం తదితర రిసర్వాయర్ల వివరాలు దాస్తున్నారు. లేని హక్కులు చూపించి తెలంగాణా కడుపుకొట్టాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈనాడు. ఆయనకు మౌత్ పీస్గా పని చేస్తున్నది.

పెద్దగా అరిస్తే, రోజూ రాస్తే అబద్దం నిజం కాబోదు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

3 Responses to ఈనాడు చంద్రబాబు అబద్దాల పంచాంగం

 1. kancherla reddy says:

  Dear Shekar, Divali greetings to you all. A brief, good write up exposing the lies of Andhra C.M. regards, Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

  Like

 2. chandu says:

  andhuke veedu “eenati” “naara”kasurudu

  Like

 3. Water used hydro-electric power generation is “non-consumptive” in nature. In other words, the water is not lost in any way.

  Naidu & his chamchas need to learn this basic fact.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s