ఇటు నీటికి కటకట, రైతు కంట నీరు, అటు సముద్రంపాలవుతున్న నీరు


80 Water Bodies

అక్కడ అత్యంత అమూల్యమైన వందల టీఎంసీల నీరు గంగలో కలసి పోతున్నది. ఒక్క టీఎంసీ నీటితో సుమారు 10000 ఎకరాలు పారించవచ్చని, పది వేల ఎకరాల్లో 50 నుంచి 100 కోట్ల రూపాయల విలువైన పంటలు పండించవచ్చునని ఒక ఇంజనీరు లెక్క చెప్పారు.

ఈసారి కూడా మా ఊరికి నీరు రాలేదు. కాలం కాలేదు. వరద కాలువ నీరు అదిగో మూడు కిలోమీటర్ల అవతలే ఒక వాగులో పడి కొట్టుకు పోతున్నది. వృధాగా ప్రవహించి కృష్ణా నదికి, అటు నుంచి బంగాళాఖాతానికి వెళ్లి పోతున్నది. ఇక్క బీళ్లు నోళ్లు తెరుచుకుని నీటికోసం అంగలార్చుతున్నాయి. అక్కడ అత్యంత అమూల్యమైన వందల టీఎంసీల నీరు గంగలో కలసి పోతున్నది. ఒక్క టీఎంసీ నీటితో సుమారు 10000 ఎకరాలు పారించవచ్చని, పది వేల ఎకరాల్లో 50 నుంచి 100 కోట్ల రూపాయల విలువైన పంటలు పండించవచ్చునని ఒక ఇంజనీరు లెక్క చెప్పారు.

ఈ మ్యాపు చూడండి. ఇది నల్లగొండ జిల్లాలోని చెరువుల చిత్రం. చిన్నవి, పెద్దవి కలిపి సుమారు 80 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులన్నీ నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాలతోపాటు కొన్ని మిర్యాలగూడెం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ చెరువులకు నీరందించేందుకే ఉదయసముద్రం నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీ(దీనినే డి-40అంటారు)ని, ఉదయ సముద్రం నుంచి మూసీ వరకు కాలువను తవ్వారు. ఈ కాలువలు తవ్వి చాలా కాలమైంది. కానీ చాలా చోట్ల చిన్నచిన్న పనులు మిగిలిపోయాయి.

అధికారులుకు పట్టింపు లేదు. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులకూ పట్టింపు లేదు. ఈ గ్రామాలు నిత్యం నీటి కరువుతో కటకటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడో 700-800 కిలోమీటర్ల దూరంలోని రిజర్వాయర్లకు పోతిరెడ్డి పాడు నుంచి నీటిని తీసుకెళుతోంది. వాళ్లు మంచిపనే చేస్తున్నారు. మన నాయకులు, అధికారులు మాత్రం ఏదో ఒక సాకుచెప్పి కాలువల పనులను పెండింగులో పెడుతూనే ఉన్నారు. జనం సంక్షోభం పాలవుతూనే ఉన్నారు. అక్కడక్కడా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డి పాడు రెగ్యులేటర్ పనిని మూడే మూడు సంవత్సరాల్లో తవ్విపారేశారు. కోర్టు కేసులు, కంప్లెయింట్లు, స్థానిక రైతుల అభ్యంతరాలు….ఇవేవీ లెక్కపెట్టలేదు. పనిని ఒక్క రోజు కూడా ఆపలేదు. కానీ చిన్న కాలువ పనులు పూర్తి చేయడానికి మన నాయకులకు, మన అధికారులకు ఏళ్లూపూళ్లూ పడతాయి. ఎవడో ఒకడు కేసు వేశాడట. ఇక అక్కడితో పని ఆగిపోయిందట.

కాలువల పనులు పూర్తి చేసి ఏటా 80 చెరువులు నింపితే చెరువుకు సగటున వందెకరాలు వేసుకున్నా 8000 ఎకరాలు సాగవుతుంది. ప్రతిఏటా ఒకసారి చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి. తాగునీటి సమస్య ఉండదు. ఊరు సస్యశ్యామలమవుతుంది. కరెంటు కష్టాలు తగ్గుతాయి. రైతులపై భారం తగ్గుతుంది. ఎందుకు ఆలోచించరో మన నేతలు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “ఇటు నీటికి కటకట, రైతు కంట నీరు, అటు సముద్రంపాలవుతున్న నీరు”

  1. sir mana education lage mana rajakeeya nayakulu kooda venukabade vunnaru.andra leaderlu govt nu influence chesi pedda pedda contracts ,business lu chestharu.valla niyojakavarga prajalaku anni panulu chesi pedatharu,mana mla,mp lu chinna kalwartu ku kooda contracter daggara dabbulu gunjutharu.kondaru mana nalgonda nayakulu vellaku neellu isthe devolep ayyi manaku vote veyyaru,veellaku kastalu vuntene manaku votlu vestharu ani private talks lo chepparu,jonreddy ki cenal kinda vunna villages kanna,dry area lo ekkuva votes vosthai ani examples chupisthunnaru.idi mana nayakula theeru.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s