రాజకీయ స్వేచ్ఛకు అతీతమా?


image

నిజమే…
పత్రికా స్వేచ్ఛ ఉండాలి.
భావవ్యక్తీకరణ స్వేచ్ఛ తిరుగులేనిది..నిజమే.
కానీ రాజకీయ స్వేచ్ఛ అంతకంటే ఉన్నతమైనది.
మీడియా స్వేచ్ఛ ఇతర స్వేచ్ఛలకు అతీతమైనది కాదు, ఉన్నతమైనదీ కాదు.

కేవలం నాలుగైదు లక్షల పాఠకులు కలిగిన ఒక పత్రిక,
కొన్ని లక్షల మంది వీక్షకులు మాత్రమే చూస్తున్న ఒక చానెల్,
70 లక్షల మంది ఓటర్లు ఇష్టపడి గెలిపించిన
పార్టీపైన, ప్రభుత్వంపైన, నాయకుడిపైన
ఇష్టారాజ్యంగా దాడి చేయవచ్చా?
మీడియాను అడ్డం పెట్టుకుని ప్రజల రాజకీయ మనోభావాలపై
అత్యంత దుర్మార్గంగా స్వారీ చేయవచ్చా?

ప్రజలు అభిమానిస్తున్న నేతను రకరకాల పేర్లు పెట్టి నిందించవచ్చా?
ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలెన్నుకున్న నాయకుడిని
మూడు వారాలు కాకముందే నియంత అని నిందించవచ్చా?
ఏ ప్రజామోదమూ లేకుండా, ఏ నైతిక విలువలకూ కట్టుబడకుండా
వెర్రిమొర్రి రాతలతో చెలరేగిపోయే వాడు ప్రజస్వామికవాదా?
ఇది మీడియా నియంతృత్వం కాదా? మాఫియాస్వామ్యం కాదా?

పౌరుల మీడియా స్వేచ్ఛకు, రాజకీయ స్వేచ్ఛకూ మధ్య ఉండేది సన్నని పొరమాత్రమే.
ఆ సోయి మరచిపోయి, ఆ పరిమితులు తుంగలో తొక్కి
నా పత్రిక నాఇష్టం, నా చానెల్ నాఇష్టం అని వాగే వారిని ఏ స్వేచ్ఛలు కాపాడగలవు?
నీ ముక్కు నా ముక్కుకు తగలనంతవరకే నీ స్వేచ్ఛయినా నా స్వేచ్ఛయినా….

తమలపాకుతో నువ్కొకటంటే, తలుపుచెక్కతో నే రెండంటా…
నేను తిడుతుంటా, నువ్వు పడుతూ ఉండమంటే ఎవరు ఒప్పుకుంటారు?
అంతిశాంతనానికి పోతే జుట్టు పీక్కపోతుంది, గుండు చేతికొస్తుంది.
బుకాయింపులు, దబాయింపులతో స్వేచ్ఛను సంపాదించలేము?
సంస్కారంతో, ప్రజాస్వామిక వర్తనతో మాత్రమే
ఏ హక్కయినా, స్వేచ్ఛయినా సాధించగలం.

అయినా మీడియా స్వేచ్ఛ ఒక ప్రజాస్వామిక విలువ.
దానిని గౌరవించడం సమాజంలో అన్ని వర్గాలకూ మంచిది.
ఎలుకలున్నాయని చూరును తగలబ్టెలేము.
పందికొక్కులున్నాయని ఇంటికి బాంబులు పెట్టుకోలేము.
ప్రభుత్వమే పెద్దరికం వహించి ఎమ్మెస్వోలతో మాట్లాడి
ఆ చానెళ్లపై ఆంక్షలు తొలగింపజేయాలి.
పంతాల వల్ల ప్రజాస్వామిక విలువలు బలికాకూడదు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

4 Responses to రాజకీయ స్వేచ్ఛకు అతీతమా?

 1. deepak says:

  put aside AP-TG issue sir,
  do you meen to say that no media
  should EVER criticize a government for whatsoever purpose?
  is that your intention sir?

  Like

 2. kattashekar says:

  No…not..Dear friend, who questioned criticism? Do u mean that Eenadu, NTV and TV5 are not criticizing Governments? Please see the difference between Criticism and malice. Separate criticism and curse. Can you call a leader who was elected by people, a dictator, just two days after election results? Media must find its space within the frame work of constitutional organs. Ill will and bad mouth about some one cannot be defined as freedom of Press or media. I respect freedom of press. But I cannot respect the arrogance of press or media.

  Like

 3. deepak says:

  sir,
  in one of his editorials,Shri allam narayana gaaru had written that ‘andhra society has not matured fully”.unable to recollect the date but sometime in march-april 2014
  your paper is not circulated in seemndhra
  but does it meen that you can write watever you want about the people there???
  kindly think over

  good night

  Like

 4. kattashekar says:

  i do not believe that Andhra society is not matured enough. blaming the people is a cunning and escape arguement. establishment is different from people. establishment makes difference. my comments are on establishment…what ever the occasion. thank you.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s