ఊరూవాడా సర్వే పండగ


పుచ్చిపోయిన మెదళ్లకు చెత్తబుట్ట సర్వే

editor-2

photo 2(1)

పుచ్చిపోయిన మెదళ్లకు ఇది చెత్త బుట్ట సర్వే. ఈ సర్వే విలువ వారికి అర్థం కాకపోవచ్చు. నేషనల్ శాంపిల్ సర్వే(ఎన్‌ఎస్‌ఎస్)పై ఆధారపడి ప్రణాళికలు, పథకాలు రచించే చెత్తబుట్ట విధానానికి బిజేపీ జాతీయ నేత ఇంద్రసేనారెడ్డి ప్రతినిధి. రాష్ట్రంలో ఒకవైపు సర్వే పండగలాగా జరుగుతున్నది. ప్రజలు సహకరిస్తున్నారు. అక్కడక్కడా ఎన్యుమరేటర్లు అందరినీ చేరుకుని ఉండకపోవచ్చు. అంతమాత్రం చేత ఈ సర్వేను చెత్తబుట్టలో పడేయాలని తొందరపడి కూశారాయన.

కేంద్రం చేసిన, చేస్తున్న సర్వేలకంటే ఈ సర్వే కచ్చితంగా నిర్దుష్టమైనది. కేంద్రం నిర్వహించేది శాంపిల్ సర్వేలే. జనాన్ని కలిసేది తక్కువ. శాంపిల్ సర్వే ఆధారంగా కేంద్ర ప్రభుత్వం దారిద్య్రరేఖను నిర్వచించింది. ఈ శాంపిల్ సర్వే ఒక రహస్యం. ఎవరిని కలిశారో, ఏమి సమాచారం సేకరించారో ఎవరికీ తెలియదు. పట్టణంలో 560 రూపాయల ఆదాయం వస్తే నెలరోజులు బతికేయొచ్చట. గ్రామాల్లో 368 రూపాయల ఆదాయంతో నెలంతా బతకొచ్చట.

ఇది చెత్త బుట్ట లెక్క. ఇంద్రసేనారెడ్డి మాట్లాడితే గీట్లాడితే జాతీయ సర్వేల గురించి మాట్లాడాలి. రాష్ర్టాలలో అమలు చేసే పథకాలకు సంబంధించి విధి విధానాలను రూపొందించుకోవడానికి సొంత సర్వేలు నిర్వహించుకోవచ్చునని ప్రణాళికా సంఘం కూడా సూచించింది. కేంద్రం సర్వేలపై ఆధారపడి సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రంలో పది శాతం మందికి కూడా ఫలితాలు అందవు.

అంతేకాదు ఆధార్ కార్డులు ఇవ్వడం కోసం ఇప్పటివరకు నాలుగు దశల్లో 12397 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇంకా చాలా మందికి కార్డులు అందనే లేదు. వాటి ప్రయోజనం ఏమిటో తేలలేదు. గ్యాస్‌తో లింకన్నారు. అదీ ఎత్తేశారు. బ్యాంకు అకౌంట్లకు లింకన్నారు. అదేమైందో తెలియదు.

ఇటువంటి పరిస్థితుల్లో తొలి తెలంగాణ ప్రభుత్వం ఒక మహాయజ్ఞంలాగా ఈ సర్వేను చేపట్టింది. ఒక్కరోజే పూర్తి చేయాలనుకుంది. సుమారు 20 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున సర్వే నిర్వహించేటప్పుడు కొన్ని లోపాలు సహజం. చాలా మందిని ఎన్యుమరేటర్లు అందుకోలేకపోతున్నారు. సర్వేకోసం అధికారులు ఎన్యుమరేటర్లకు ఇంటినంబర్లు కేటాయించారు. తీరా ఇళ్లకు వెళితే ఒక్కో ఇంటి నంబరులో 10 నుంచి 20 కుటుంబాలు ఉంటున్నాయి. 40 మందిని చేయవలసినవాళ్లు 400 మందిని చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది?

అందుకే అక్కడక్కడా ఆందోళనలు. ప్రజల ఆందోళనను అర్థం చేసుకోవచ్చు. సరిదిద్దు కోవడానికి అవకాశం ఉంది. ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలు స్వచ్ఛందంగా ఈ సర్వేలో పాల్గొన్నారు. అయినా కొంత మంది తమ వంకరబుద్ధులు అదేపనిగా సర్వేపై బురద చల్లడానికి మైకులు పట్టుకుని బయటికి వస్తున్నారు. అయినా పర్వాలేదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “ఊరూవాడా సర్వే పండగ”

  1. కెసిఆర్ అనుకున్నది సాధించారు.కొంత కన్ఫుజన్ వున్నా …. బోగస్ కార్డులు ఎత్తి వేయడం లో 50 % సక్సెస్ అయితే చాలు. ఈ సర్వే మంచి ఫలితాలు ఇచ్చి నట్లే.

  2. అవును సార్…మా నాచారంలో సర్వేకోసం ఉదయం ఆరు గంటలకు ఓ ఉద్యోగి వచ్చాడు..నలబై ఇండ్లలో సర్వేచేస్తే మద్యాహ్నం వరుకు అయిపోవాలి..ఓక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు రెంటర్స్ ఉన్నారు…వారివి పూర్తయ్యో సరికి రాత్రి ఎనిమిది అయింది. అధీ మా వీధిలోని విద్యావంతులు సహాయ పడితే…ప్రజలు మాత్రం అన్నింటికి రేషన్ కార్డు లింకు తెంపినందుకు సంతోషిస్తున్నారు…..జై కేసీఆర్…జై..తెలంగాణ..

  3. ఒక్కరోజు సర్వే అన్నది ఒక కొత్త, మంచి ఆలోచన. మంచి విస్తృత లక్ష్యం ఉన్న ఈ సర్వేకి ఈ సన్నగ్ధత సరిపోలేదు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s