మనకు రహస్యాలున్నాయా?


ఏది అఫిడవిట్‌, ఏది ధ్రువీకరణ?

Telangana-map

అఫిడవిట్‌కు, ధ్రువీకరణ ప్రకటనకు తేడా తెలియనివారిని చూసి జాలిపడదాం. సర్వేకు దురుద్దేశాలు ఆపాదించడానికి సీమాంధ్ర మేధావులు, వారికి ఏజెంటుగిరీ చేస్తున్న టీటీడీపీ, బీజేపీ నాయకులు చేయని ప్రయత్నం లేదు. అయినా ప్రజలు వారిని పట్టించుకునే పరిస్థితి లేదు.

జాతీయ మీడియా సైతం ఇంతే వంకరగా ఆలోచిస్తున్నది. ప్రజల రహస్యాలేవో బట్టబయలు చేసే కుట్ర జరుగుతున్నదని ఒక పే…ద్ద జర్నలిస్టు రాశారు. ప్రజలకు, ఇక్కడి ప్రభుత్వాలకు, మహామహానేతలకే రహస్యాలు ఉండే పరిస్థితి ఏనాడో పోయింది. అందరి బ్యాంకు ఖాతాలు చూసే అధికారాలు, అందరి మాటలు వినే అధికారాలు కేంద్రంలోని వాణిజ్య, గూఢచార ఏజెన్సీలకు ప్రభుత్వాలు ఎప్పుడో దఖలు పరిచాయి.

‘నా ఫోను రహస్యం కాదు. నా బ్యాంకు ఖాతాలు రహస్యం కాదు. నా ఆస్తులూ రహస్యం కాదు(ఆన్‌లైన్ వ్యవస్థ మొదలైన నేపథ్యంలో). ఇంకా దాయడానికి ఏముంది?’ అని మా సహచరుడొకరు చేసిన అందరి అనుభవమే.

తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంతకాలం ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న కొన్ని వేల మంది టెలిఫోన్లను ట్యాపింగ్ చేసిన రహస్యాల రక్షకులు ఇప్పుడు కోతలు కోస్తున్నారు.

రాజకీయాలకోసం, ఇక్కడి ప్రభత్వాన్ని బద్నాం చేయడంకోసం ఈ మేధావులు ఆత్మవంచన చేసుకుని, అందరినీ వంచించే ప్రయత్నం చేస్తున్నారు. పర్వాలేదు. ఇది ఈ కాలపు భావజాల యుద్ధనీతి. మనమూ కొట్లాడదాం.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s