స్థానికత-హక్కు, అవసరం


BY పి. సుభాష్ సి రెడ్డి

Telangana-seemandhra-map-e1395162279484

ఇవ్వాళ.. కేసీఆర్ అంటున్నది కొత్తదేమీ కాదు. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయసూత్రాలku అనుగుణంగా తెలంగాణలో ముల్కీ రూల్స్‌ను అమలు చేయాలంటున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న హక్కు, ధర్మం కూడా. కేసీఆర్ ఒకవేళ అలా చేయక పోతే.. తెలంగాణ ప్రజలను మోసం చేసినవారవుతారు. ఈ సందర్భంలోనే చెప్పుకోవాలంటే.. తెలంగాణ ప్రజలు గత 60 ఏళ్లుగా ఈ ముల్కీ రూల్స్ అమలు కోసం, పెద్దమనుషుల ఒప్పందం అమలుకోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ముల్కీ రూల్స్‌ను మరిచిపోవడమంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో అర్థం లేదు. మన రాష్ట్రంలో మన పాలనలో ముల్కీ రూల్స్‌ను పాటించడంలోనే మన విముక్తి ఉన్నది.

నాకు పీఎన్‌వీ నాయర్ అంటే అమిత గౌరవం. ‘హాన్స్ ఇండియా’ పత్రిక ఎడిటర్‌గా ఆయన వృత్తి నిబద్ధతగల జర్నలిస్టుగా, సుదీర్ఘ జీవితానుభవం ఉన్న జ్ఞానిగా విశిష్ట గౌరవ మర్యాదలున్నవారు. అయితే.. నేను ఈ వ్యాసంతో ఆయనకున్న జ్ఞానాన్నీ, వృత్తినిబద్ధతను సవాలు చేయడం లేదు. కానీ రెండు ఇరుగు పొరుగు రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రవూపదేశ్ రాష్ట్రాలు, వాటి సంబంధాల విషయంలో తలెత్తుతున్న సమస్యలు, కొన్ని విషయాలను ఆయన దృష్టికి తేదల్చుకున్నాను. అయితే ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. నేను కేసీఆర్‌నో, తెలంగాణనో వెనకేసుకొస్తున్నాననుకోవద్దు. సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలంగాణ ప్రజలు, వారి తరఫున కేసీఆర్ కోరుతున్న లేదా అంటున్న విషయాలను విపులీకరించదల్చుకున్నాను.

ఇక్కడే మరో విషయం కూడా స్పష్టం చేయాలి. సహజంగానే తరతరాల చరిత్రను పరిశీలించినా.. తెలంగాణ ప్రజలు ప్రేమగల వారు. ద్వేషమన్నదే ఎరుగని వారు. అలాగే కేసీఆర్ కూడా ద్వేషంతో ఏనాడూ ఏమీ చేయలేదు. ఏ మాటా మాట్లాడలేదు. ఆయన అన్నదల్లా సహజ న్యాయసూత్రాల ఆధారంగా తెలగాణ ప్రజలకు న్యాయం దక్కాలె. వివక్ష, అణచివేతలు అంతంకావాలె. వలసపీడనల పీడ విరగడ కావాలె.

తెలంగాణ ప్రజలే కాదు, కేసీఆర్ కూడా పరద్వేషం ఎరుగని వారు. తెలియని వారు. అంతే కాదు, పరద్వేషం వినాశకారి అని నమ్మే వాళ్లం. అయినా.. సీమాంధ్ర పాలకుల ఆధిపత్యాన్ని, దోపిడీ పీడనలను వ్యతిరేకిస్తూ తెలంగాణ జాతి విముక్తి కావాలని కోరుకుంటున్నాం. సీమాంధ్ర నేతలు ఈ విషయాలను చూడనిరికరిస్తూ మాట్లాడటం వారికే చెల్లింది. లేదా వారి సహజ దోపిడీ ఆధిపత్య స్వభావాన్ని చెప్పకనే చెబుతున్నది. అలాగే ‘స్థానికత’ (లోకల్), ఎవరు స్థానికులు అన్న విషయాన్ని సీమాంధ్ర నేతలు చేస్తున్న వాదనలు జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉన్నది.
స్థానికత ఆధారంగానే విద్యా, ఉద్యోగాల్లో ప్రవేశం ఉండటమే కాదు, విద్యార్థులకు అందించే ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్‌లు) ఇవ్వడం సహజం. దీనికోసం ప్రతి రాష్ట్రం తనదైన విధి విధానాలను రూపొందించుకుంటుంది. ఇది దేశంలోని అన్నిరాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానమే. తెలంగాణ కూడా ఈ విధానాన్నే అనుసరిస్తుంది. తెలంగాణకు కూడా స్థానికత గురించి విధానాలు రూపొందించుకునే హక్కు ఉన్నది.

అయితే అన్ని రాష్ట్రాల్లో స్థానికతను నిర్ధారించే విషయంలో ఒకే విధమైన విధివిధానాలు లేవు. స్థానిక ధృవీకరణ పత్రాన్ని పొందడానికి కావలసిన అవసరమైన రుజువులు, పత్రాలు ఒకే విధంగా లేవు. ఉదాహరణకు.. హిమాచల్ ప్రదేశ్‌లో స్థానికుడు అవ్వాలంటే.. అతనికి ఆ రాష్ట్రంలో శాశ్వతమైన(పర్మనెంట్) ఇల్లు ఉండాలి. అలాగే కనీసం 15 ఏళ్లకు తగ్గకుండా ఆ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి.అలా ఉన్నప్పుడే ఎవరికైనా, ఏ ఉద్యోగికైనా స్థానికత సర్టిఫికేట్ ఇస్తారు. దీనికి సంబంధించి అవసరమైన రుజుసూత్రాలను పొందుపరిచినప్పుడే లోకల్ సర్టిఫికేట్ ఇస్తారు. అలాగే రాజస్థాన్‌లో.. కనీసం పది ఏళ్లు రాజస్థాన్‌లో నివసిస్తున్నట్లయితేనే లోకల్ సర్టిఫికేట్ ఇస్తారు. త్రిపురలో కూడా స్థానిక సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆ రాష్ట్రంలో స్థిరమైన ఇల్లు ఉండాలి. కనీసం పదేళ్లకు తగ్గకుండా త్రిపురలోనే నివసిస్తూ ఉండాలి. ఉత్తరాఖండ్‌లో కూడా స్థానికుడు అవ్వాలంటే.. 15 ఏళ్లుగా అక్కడ నివాసం ఉండాలి. లేదా పర్మినెంట్ స్థిరనివాస గృహం కలిగి ఉండాలి. పర్మనెంట్ అంటే తరతరాలుగా వారసత్వంగా వచ్చిన ఇల్లు అని అర్థం. దీన్ని బట్టి .. వివిధ రాష్ట్రాల్లో స్థానికతకు సంబంధించి వివిధ విధివిధానాలను రూపొందించుకున్నట్లు అర్థమవుతున్నది. ఈ స్థానికత ఆధారంగానే స్థానికులకు ఆయా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలకు అర్హులుగా ప్రకటిస్తారు. అందజేస్తారు. సరిగ్గా ఇలాగే తెలంగాణ ప్రభుత్వానికి కూడా స్థానికతను నిర్ధారించేందుకు తనవైన విధివిధానాలను (ముల్కీ రూల్స్) రూపొందించుకునే హక్కు ఉన్నది.
ఇక్కడే ‘ముల్కీ రూల్’ గురించి మనం ఎలా నిర్వచించుకున్నామో తెలుసుకోవాల్సి ఉన్నది. ‘ముల్కీ అంటే ఎవరైతే హైదరాబాద్ స్టేట్‌లో పుట్టారో వారంతా ముల్కీ(స్థానికు)లే. అలాగే హైదరాబాద్ స్టేట్‌లో అవిచ్ఛిన్నంగా పదిహేనేళ్లు నివాసముండాలె.అలాగే తాను స్థానికుడే అనేందుకు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలె. ఇక్కడ గమనించాల్సిందేమంటే.. పదిహేనేళ్లు అవిచ్ఛిన్నంగా నివాసముండాలి. తాను పుట్టిన స్థానాన్ని త్యాగం చేస్తానని అఫిడవిట్ సమర్పించాలి. సుప్రీంకోర్టు తప్ప మరేదీ ఈ ముల్కీ రూల్‌ను ప్రశ్నించడానికి వీలులేదు. ఆంధ్రాలో హైదరాబాద్ రాష్ట్రం 1956లో విలీనం అయిన తర్వాత కూడా ఈ ముల్కీ రూల్స్ అమలులో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో చూస్తే.. ఇవ్వాళ.. కేసీఆర్ అంటున్నది కొత్తదేమీ కాదు. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు న్యాయసూత్రాలku అనుగుణంగా తెలంగాణలో ముల్కీ రూల్స్‌ను అమలు చేయాలంటున్నారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న హక్కు, ధర్మం కూడా. కేసీఆర్ ఒకవేళ అలా చేయక పోతే.. తెలంగాణ ప్రజలను మోసం చేసినవారవుతారు. ఈ సందర్భంలోనే చెప్పుకోవాలంటే.. తెలంగాణ ప్రజలు గత 60 ఏళ్లుగా ఈ ముల్కీ రూల్స్ అమలు కోసం, పెద్దమనుషుల ఒప్పందం అమలుకోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ముల్కీ రూల్స్‌ను మరిచిపోవడమంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలో అర్థం లేదు. మన రాష్ట్రంలో మన పాలనలో ముల్కీ రూల్స్‌ను పాటించడంలోనే మన విముక్తి ఉన్నది.

ఇక్కడే ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం గురించి కూడా చెప్పుకోవాలి. ఇది విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం కింద ప్రభుత్వం అందిస్తున్న సాయం. ఆర్థికంగా వెనకబడి ఉన్న వారికీ,వర్గాలకూ ఫీజు రీయింబర్స్ మెంటు పథకం వర్తింపచేస్తున్నారు. దాదాపు 6 లక్షల మంది వృత్తివిద్యాకోర్సులు చదువుతున్న వారికి ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఇందులో లక్షా 50 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులుంటారు. 2013-14 విద్యా సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్ మెంటుకు ఆధార్ కార్డ్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రభుత్వ హయాంలో 2005లో ఈ ఫీజు రీయింబర్స్ మెంటు పథకాన్ని ప్రవేశపెట్టి రెండువేల కోట్ల రూపాయలను విడుదల చేశారు. అది 2012-13నాటికి అయిదు వేల కోట్లకు చేరింది. ఈ పథకం కింద వృత్తి విద్యా కోర్స్‌లైన ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ తదితర కోర్సులకు ఏడాదికి 52వేల రూపాయలు అందిస్తారు. అయితే.. ఈ పథకం ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 39 వేల మంది ఆంధ్రా విద్యార్థులకు కూడా సాయం అందించాల్సి వస్తున్నది.

నిజానికి ఈ ఆంధ్రా విద్యార్థులకు సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారి తల్లిదంవూడులు వారి ఫీజులను చెల్లించాలి. లేదా వారినుంచి పన్నులు వసూలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లించాలి. ఈ సహజ న్యాయ సూత్రాన్ని మరిచి చంద్రబాబునాయుడు ఫీజు రీయింబర్స్ గురించి అరిచి అల్లరి చేయడం దేనికోసం? వీరికోసం ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఏకోశానా లేదు. తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ పథకం కింద సాయపడటం తెలంగాణ ప్రభుత్వ నైతిక బాధ్యత. సీమాంధ్ర నేతలు అదే పనిగా తెలంగాణ ప్రభుత్వంపై ఏడ్చితే ఉపయోగం లేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను తిట్టడం, ఆడిపోసుకోవడంతో ఉపయోగం లేదు. వారు ఆంధ్రా ప్రభుత్వ పాలకుడు చంద్రబాబుపై వత్తిడి తెచ్చి వారి పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని వత్తిడి చేయాలి. ఏ ప్రాంత, ఏ దేశ ప్రజల హక్కులు అయినా వారి దేశంలోనే ఉంటాయి. పరాయి ప్రాంతంలో ఆ హక్కులు వర్తించవు. అమెరికాపౌరుల హక్కులు వారి దేశంలోనే ఉంటాయి. పరాయి దేశంలో కాదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

5 thoughts on “స్థానికత-హక్కు, అవసరం”

 1. Reblogged this on Words of Venkat G and commented:
  తెలుగువారు తెలంగాణ
  స్థానికత-హక్కు, అవసరం
  చదివి అర్థం చేసుకుని ధర్మం చెప్పండి

 2. మీరు చెప్పిన ఉదాహరణల్లో 10-15 సంవత్సరాలు మించి లేవు. కానీ ఇక్కడ 60 సంవత్సరాలు అనే కొలమానం ఎలా సమర్థనీయం ? బద్రాచలం లో స్థానికత ఎలా నిర్దేశిస్తారు ?

 3. This is a well written article, clarifying the legal issues in the matter. Seemandhra lobbies are out to enjoy every kind of benefit in Telangana, and still blame us that we are not fair. Hats off to KCR for the bold and reasonable stand he has taken in respect of fee reimbursement of ‘T’ students only and sticking to the cut off date of 1956 for the same.
  Prof. Kancherla

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s