కాంట్రక్టు క్రమబద్దీకరణకు ప్రజల ఓటు


logo
కాంట్రక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తం అని టీఅరెస్ ఎన్నికల మానిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రజలు ఆ మానిఫెస్టోను నమ్మే ఓట్లు వేసి అధికారం అప్పగించారు. కాంగ్రెస్, భాజపా, తెదేపా అనుకూల విద్యార్థి సంఘాలు కావాలనే ఇప్పుడు అల్లరి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. టీఅరెస్ కొత్తగా ఈ నిర్ణయం చేయలేదు. కాంట్రక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ పూర్తిగా సమంజసం.

పరిశోధన చేసి, వయస్సు మీదపడి, పెళ్ళిళ్ళు చేసుకుని, పది, పదిహేనేళ్ళుగా తక్కువ జీతాలతో పాఠాలు చెబుతున్నవారిపై ఇప్పుడు దాడి జరుగుతున్నతీరు ఎంత మాత్రం మానవీయం కాదు. ఇది కొందరు పేచీ కోరు మనస్తత్వంతో రేపుతున్న సమస్య. మాకు ఉద్యోగాలు కావాలని అడగడం న్యాయం. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వొద్దుఅని డిమాండు చేయడం కుల్లుమోతు తనం.

ప్రభుత్వం వచ్చి రెండు మాసాలు కాలేదు… ఉద్యోగుల కేటాయింపుజరగలేదు. ఐఎఎస్ ల కేటాయింపు జరగలేదు. టీపీఎస్సీ ఏర్పడలేదు. ఆఫీసులు ఇంకా కుదురుకోలేదు. వేలాది ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది. నిజమైన నిరుద్యోగులు రాజకీయ నిరుద్యోగుల వలలో చిక్కుకుని రాష్ట్రంలో వాతావరణాన్ని పాడు చేయవద్దు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

9 thoughts on “కాంట్రక్టు క్రమబద్దీకరణకు ప్రజల ఓటు”

 1. Dear shekar, I fully endorse your views on the issue of “regularizing Contractual staff. But many Telangana universities are flooded with all kinds of teaching staff. Some of them do not deserve to be university faculty.  Some bright guys are outside the universities. These two categories need to be balanced in recruitment. Yes, in politics, everything is possible. The government of Telangana needs to be extra careful in some of these things.  Regards,     Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

 2. Dear Sir,
  Well said. BJP is behind all this. It is instigating ABVP against KCR. Telangana people fail to understand, why BJP is going in
  a self destructive mode! What happened to its people’s friendly image and agenda? Why it is functioning as a proxy to TDP? If it does not correct its ways to function as a responsible political party, its own political relevence and existence is questionable!

 3. ఇంకా నయ్యం ఆంద్ర పెట్టుబడి దారులు డబ్బులు ఇచ్చి చేయిస్తున్నారు అని చెప్పలేదు!
  మేనిఫెస్టోలో వుంది కాబట్టి ప్రజల ఆమోదం ఉన్నట్టా? ఇది ఏమి లెక్క? మానిఫెస్టోలో 40 అంశాలు వున్నాయి.. ఆ 40 అంశాల మీదా
  ఒక్కొక్కరికి ఒక్కో అబిప్రాయం వుంటది.
  ఎన్నికల మేనిఫెస్టో లో వుంది కాబట్టి, మెజారిటీ ప్రజలు మీకు వోటు వేసారు కాబట్టి, ఏదైనా విషయం సమాజంలో మైనారిటీ గా వున్నా ప్రజల న్యాయమైన డిమాండ్ అనచివేయచ్చు అని కొత్త భాష్యం చెప్పుతున్నారా?
  మా మేనిఫెస్టో లో వుంది కాబట్టి న్యాయ అన్యాయాలు చూడకుండా అమలు పరుస్తామని…
  రేపు BJP కూడా తన మేనిఫెస్టో ని అమలుపరుస్తా అని అయోధ్య లో రామయలయం కడతా, కాశ్మీర్ లో 370 act review చేస్తా అంటే మీరు ఒప్పుకుంటారా ?

  తెలంగాణా వస్తే ఉద్యోగాలు వస్తాయని నడివయసు మీదికి వచ్చిన, పెళ్ళిళ్ళు
  చేసుకోకుండా…అటు రాళ్ళూ విసిరి, లాటి దెబ్బలు తిని పోరాటం చేస్తూనే ఇటు
  పుస్తకాలతో కుస్తీ పడుతున్న నిరుద్యోగుల ఆశలను ఒక్కసారిగా కాంట్రాక్టు
  ఎంప్లాయిస్ రేగ్యులరైజేషణ్ తో నీరు గర్చారు. కుటుంబాలు కేవలం కాంటాక్ట్ ఎంప్లాయిస్ కె వుండవు.. బయట ఉన్న
  నిరుద్యోగులకు కూడా వుంటాయి, వాళ్ళకి కూడా ఒక జీవితం వుంటుంది, వాళ్ళకు కూడా
  కలలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి.

  అర్హతలు లేకుండా కేవలం recomendations తో సాదిన్చుకున్న ఉద్యోగాలు అవి !
  ఎటువంటి నియమాలు లేకుండా recruitement చేసుకున్నా.. వాళ్ళు recurite అయినప్పుడు
  ఇది పెర్మనెంట్ చేయరు అని చెప్పి మరీ recruite చేసిండ్రు.
  5, 6 యేండ్ల గా పుస్తకాలే లోకంగా బతుకుతున్న నిరుద్యోగుల
  బాధ మీకు అర్థంకాకపోవచ్చు.. మీకు కుళ్ళు బోతు తనంగానే కనిపించచ్చు.
  ఆంధ్రోల్లతో ఉన్న కృష్ణ వాటర్ విషయంలో ఇలాంటి వాదననే ఎందుకో
  చేయలేదు? తెలంగాణా వాళ్ళకు నీళ్ళు రావాలె అంటే ఆంధ్రాకు రాయలసీమకు
  నీళ్ళు అపాల్సిందే కదా…. యే! రాయలసీమ బతుకులు చాలా గొప్పగా ఏమీ లేవు కదా..
  అప్పుడేమో రూల్స్ మాట్లాడి, రూల్ ప్రకారం మనకే నీళ్ళు రావాలని
  గొడవ చేసాం. వాళ్ళకు నీళ్ళు పోవద్దు అనుకోవడం అప్పుడు మన కుళ్ళు వల్లనేనా?

 4. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవాటన్నింటికీ ప్రజామోదం ఉండాలని లేదు కాబట్టి, రైతు రుణమాఫీని విస్మరిస్తే మీరు ఒప్పుకునేవారా మిత్రమా?
  తెలంగాణ ఉద్యమాన్ని క్రమబద్దీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని ఒకేగాట కట్టే మేధావులు ఉన్నారంటే విచారం కలుగుతోంది. క్రమబద్దీకరణలో ఉద్యోగాలు పొందినవారు తెలంగాణ బిడ్డలే అన్న విషయాన్ని విస్మరించి, క్రమబద్దీకరణ వ్యతిరేకతను తెలంగాణ ఉద్యమంలో లేవనెత్తిన అంశాలతో ముడిపెట్టి చూడడం విచిత్రం. తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ తక్షణం నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండు చేయడం న్యాయం. ప్రభుత్వం కూడా నిరుద్యోగుల భయాలను తొలగించచడానికి పూనుకోవడం అవసరం. కానీ ఇంకా ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఏర్పడలేదనే విషయం గమనించాలి. ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు ఇప్పుడే జరుగుతున్నది. ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా వెంటనే వీధిపోరాటాలకు దిగడం రాజకీయ శక్తుల ప్రేరేపణతో కాదని ఎలా అనుకోవడం?

 5. అది ఏ అంశం అయీన సరే దాని న్యాయ అన్యాయాల తో పని లేకుండా కేవలం manifesto లో ఉండడమే ప్రామాణికం కాకూడదు అది రుణ మాఫీ అయీన contract employees regulazation అయీన , 370 act అయీన
  తెలంగాణా ఉద్యమ మైన కాంట్రాక్టు regulization ఉద్యమ మైన ఎవ్వరికి అర్హతా వున్నా వాళ్ళ కె న్యాయం జరగాలి అనీ జరుగుతుంది …..కానీ విచిత్రంగా అప్పుడు ఇప్పుడు ఒకే విదంగా దాన్ని మీద దాడి చేస్తున్నారు అప్పుడు మనమంతా తెలుగు బిడ్డలమే …ఇప్పడు మనమంతా తెలంగాణా బిడ్డలమే అని ..
  కొన్ని రంగాలలో contract employeee regularize చేస్తే ఇంకా సమీప బావిష్యతు లో వుదోయ్గాలు పడవు ,,, ఇద్దరికీ అమొదాయొగ్యమినా సొల్యూషన్ కోసం యెన్ధూ ప్ర్యతన్మ చేయకూడదు కాదు నేను మాట ఇట్చాను కాబట్టి ఇలాగె చేస్తా అని మొండి గా పోవడం ఎందుకు .
  ఎందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చ లు జరపకూడదు .. వాళ్ళ ను తెలంగాణా ద్రోహులుగా చిత్రించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు

 6. మాకు కావాలి అని అడగడం న్యాయం, ధర్మం. పక్క వాడికి వద్దు అనడం అన్యాయం, అధర్మం! ఈ విషయంలో ఇంతకుమించిన వాదనలు అనవసరం.

 7. కాంట్రాక్టు ఉద్యోగులపై రాజకీయం చేసేవారికి విఘ్నప్తి….
  ఖాళీగా వున్న 1 లక్ష 80 వేల పైగా ఉద్యోగాలు బర్తీచేయలని అడగండి….
  మీకు ఉద్యోగాలు కావాలని అడగండి, న్యాయంగా వుంటుంది…
  దాని గురించి మాట్లాడకుండా….40 వేల కాంట్రాక్టు ఉద్యోగుల వారి కుటుంబాల నోటికాడి కూడు చెడగొట్టాలని చూస్తున్నారు…తప్పు కదా….

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s