పోలవరంపై కేంద్రం చట్టం చెల్లదు


image
ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో 211 గ్రామాలను ఆంధ్రలో కలుపుతూ శుక్రవారం పార్లమెంటు చేసిన చట్టంపై సుదీర్ఘ న్యాయపోరాటం జరిగే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడప్పుడే గట్టున పడే అవకాశం లేదు. ప్రధానంగా కేంద్రం రెండు తప్పులు చేసింది.

మొదటిది రాజ్యాంగ ఉల్లంఘన:

పార్లమెంటు చేసిన చట్టం ద్వారా 2014 జూన్ రెండున రెండు రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. రెండు రాష్ట్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ఆ చట్టానికి తిరిగి ఏవైనా సవరణలు చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తిరిగి రాష్ట్ర శాసనసభలను సంప్రదించాల్సి ఉంటుంది. ఆ పద్ధతి ఏదీ కేంద్రం పాటించలేదు. సరిహద్దులు మార్చే ప్రతిసందర్భంలోనూ సంబంధిత రాష్ట్రాల శాసనసభలకు ఆ సవరణల బిల్లును నివేదించి అభిప్రాయం కోరాలి. రాష్ట్రాలు ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినా కేంద్రం తన నిర్ణయం తాను తీసుకోవచ్చు. కానీ ప్రాథమికమైన రాజ్యాంగ నియమాన్నే కేంద్రం అనుసరించలేదు. తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది.

పౌరుల ప్రాథమిక హక్కుల ఉ్లంఘన:

Rehabilitation and resettlement చట్టం-2013 ప్రకారం ఏదైన ఒక ప్రాంతంలో భూసేకరణ చేయాలంటే అక్కడి మెజారిటీ ప్రజల ఆమోదం తప్పనిసరి.
వేదాంత కేసులో సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. నియాంగిరి కొండ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, ఆ గ్రామ సభల ఆమోదం పొందకుండా వేదాంతకోసం భూములు స్వాధీనం చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే షెడ్యూల్డు ఏరియాలో భూములు స్వాధీనం చేసుకోవాలంటే ఈ విధానాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. అరుదైన గిరిజన తెగల ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడడం కూడా రాజ్యాంగం బాధ్యత. కేంద్రం ఇవేవీ ఆలోచించకుండా ఆంధ్ర లాబీయింగ్‌కు తలొగ్గి సుమారు రెండు లక్షల మంది గిరిజన ప్రజలను నిరాశ్రయులను చేసే నిర్ణయాన్ని చేయడం అభ్యంతరకరం.
See the link below:
https://kattashekar.wordpress.com/2014/07/11/court-directs-gram-sabhas-to-take-a-call-on-vedantas-mining-project/

image

image

image

image

image

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s