ప్రజాస్వామ్యానికి ప్రతినిధి కేసీఆరా? రాధాకృష్ణా?


By ధరణి కులకర్ణి

రాధాకృష్ణ చంద్రబాబు షాడో
ప్రజాస్వామ్యానికి ప్రతీఘాతశక్తి

ఒక్కసారి లైసెన్సు తీసుకుని, జీవితాంతం ఇష్టం వచ్చింది వాగుడు, ఇష్టం వచ్చింది రాసుడు, ఇష్టమొచ్చినోన్ని తిట్టుడు, నచ్చనోళ్లను టార్గెట్ చేసుడు, డబ్బులియ్యనోళ్లను బ్లాక్‌మెయిల్ చేసుడు…ఇదేనా ప్రజస్వామ్యం?
రాజకీయ నాయకులు ఎవరయినా ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లి ఆమోదం పొందాల్సి ఉంటుంది. కేసీఆర్ అయినా చంద్రబాబు అయినా మరెవరయినా?

వీళ్లలో ఎవరు గొప్ప? ఎవరు ప్రజాస్వామ్యానికి ప్రతినిధి? ఎవరికి ప్రజల ఆమోదం ఉంది?

రాధాకృష్ణ ఒక పత్రికను పునరుద్ధరించి చాలా మందికి ఉపాధి కల్పించాడని ఒకప్పుడు అందరికీ గౌరవం ఉండేది. చాలా మంది మంచి జర్నలిస్టులను పోగేసి పత్రికను ఈనాడుకు ప్రత్యామ్నాయంగా తెచ్చాడు. స్పాట్‌న్యూస్ ఉద్యోగులను మోసం చేసినా, ఏపీఎల్ ఉద్యోగులకు బకాయిలు ఎగవేసినా, కోర్టుకేసులను తుంగలో తొక్కినా ఆయన చేసిన మంచి ముందు అవి పెద్దగా ప్రచారం కాలేదు. కానీ రాధాకృష్ణకు కొమ్ములు పెరిగే కొద్దీ మంచి మంచి జర్నలిస్టులంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీనియర్లు, పెద్దవాళ్లు వెళ్లిపోయాక ఒకటి రెండు కాదు తలనిండా కొమ్ములు మొలిచాయి. టీవీ వచ్చాక ఇక ఆయనకు పట్టపగ్గాల్లేకుండా పోయింది. ఆయన ఆడింది ఆట, పాడింది పాట, రాసింది రాత. ఏసు ప్రభువు పునర్జన్మ ఎత్తి మళ్లీ రాధాకృష్ణ అవతారంలో ఎత్తినంత బిల్డప్. ఆయన నాయకులు మొదలు స్వామీజీల వరకు ఎవరికీ సుద్ధులు చెప్పకుండా వదలడు. చిన్నంతరం పెద్దంతరం ఉండదు. వరుసవాయీ ఉండవు. ఉచితానుచితాలుండవు. మోనార్క్ అంటే ఎలా ఉంటాడో ఆయన ప్రోగ్రామ్‌లు చూస్తే తెలుస్తుంది. అట్లాంటి రాధాకృష్ణ ఇప్పుడు మరోసారి ప్రజాస్వామ్యానికి ఏదో జరిగిపోయినట్టుగా వాపోతున్నాడు. తెలంగాణ అంతా ఆయనకోసం అతలాకుతలం అవుతున్నట్టుగా భ్రమింపజూస్తున్నారు. పొట్టకూటికోసం పనిచేసే జర్నలిస్టులను అడ్డంపెట్టుకుని ఊరేగింపులు చేయిస్తున్నాడు. కొత్త రాష్ట్రం తెలంగాణకు కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రిపై అవాకులు చెవాకులు పేలుతున్నాడు. నోటికి వచ్చిన తీర్పులు ఇస్తున్నాడు.

ఆయన ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో రాసిన రాత చూడండి….

1. ‘ఊహించిందే జరుగుతోంది. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంత త్వరగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటారని మాత్రం అనుకోలేదు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కూడా చేయకముందే నమస్తే తెలంగాణ అనే పత్రికను కబళించడానికి ప్రయత్నించిన కేసీఆర్ బారి నుంచి ఆ పత్రిక ఎలాగోలా తప్పించుకుంది’.

రాధాకృష్ణ ప్రాంతీయ దురహంకారానికి, తెలంగాణ నేతల పట్ల ఉన్న చులనకన భావనకు ఈ వ్యాఖ్యలు తార్కాణం. చంద్రశేఖర్‌రావు ఇలా వ్యవహరిస్తారని ఈయన ముందే ఊహించారట. కేసీఆర్ నిజస్వరూపం ఏదో ఈయనకు ముందే తెలిసినట్టు, అది ఇప్పుడు బయటపడినట్టు బుకాయింపు. నమస్తే తెలంగాణను కబళించడానికి కేసీఆర్ ప్రయత్నించడం ఏమిటి? నమస్తే తెలంగాణ అని పత్రికకు పేరు పెటింది, ఆ పత్రికను వ్యవస్థాపన చేసిందే కేసీఆర్. ఇప్పటికీ నమస్తే తెలంగాణలో కేసీఆర్ 26 శాతం వాటాదారు. రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో వ్యవస్థాపనలో చేసిన మోసాలను గురించి, ఆయన ఎవరెవరిని ఎలా కబళించారో తర్వాత మాట్లాడుకుందాం. నమస్తే తెలంగాణ పత్రికను తిరిగి తీసుకోవాలనుకువచ్చు. రాజంగారి వాటాను అమ్మాల్సిందిగా కోరి ఉండవచ్చు. బేరం కుదరకపోయి ఉండవచ్చు. అక్కడ ఆగిపోయింది. కానీ రాధాకృష్ణ చాలా తెలివిగా ఈ సందర్భాన్ని ఉపయోగించుకుందామనుకున్నాడు. తన చరిత్ర ఎవరికీ తెలియదనుకున్నాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక పెట్టుకోవడానికి ప్రేరణ ఇచ్చి, డబ్బులు ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి సాధన సంపత్తి ఇచ్చిన మిడ్‌వెస్ట్ గ్రానైట్ రాఘవరెడ్డిని పత్రిక రాగానే మెడలు పట్టుకుని దూరంగా గెంటేసిన అతిగొప్ప స్నేహితుడు రాధాకృష్ణ. రాధాకృష్ణకు ఐ వెంకట్రావు గురువు, మార్గదర్శి. ఆంధ్రజ్యోతి తీసుకోవడంలో ఆయనే మధ్యవర్తి. పాత యజమాని హరీశ్‌ప్రసాద్‌తో మాట్లాడి ఒప్పించి పత్రిక తిరిగి ప్రారంభం కావడానికి ఎంతో తపన పడ్డారు. రాధాకృష్ణ ఎదుగుదల తన ఎదుగుదలగా భావించాడు. కానీ ఆయనకు రాధాకృష్ణ ఎంత నమ్మకద్రోహం చేశాడో జర్నలిస్టుల్లో ఎవరిని అడిగినా చెబుతారు. పాత యజమాని హరీశ్ ప్రసాద్‌ను కూడా ఎంతోకాలం తిప్పుకుని చివరికి అవమానించి రాకుండా చేశాడు. ఐదుకోట్లు పెట్టబడి పెట్టి, ఆంధ్రజ్యోతి ప్రారంభానికి తన భుజాన్ని అడ్డుపెట్టిన నూజివీడు సీడ్స్ అధినేత ప్రభాకర్‌రావుకు జరిగిన అన్యాయం అయితే ఇక చెప్పనలవి కాదు. ఆయనను ఆఫీసుకే రాకుండా చేశాడు. పన్నెండేళ్లు అవుతున్నా ఆయన డబ్బులు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు. ఆంధ్రజ్యోతి చైర్మన్‌గా పరిచయం అయిన జయరమేశ్ ఆ తర్వాత సైలెంట్‌గా తెరమరుగయ్యారు. యూజ్ అండ్ త్రో పాలసీలో రాధాకృష్ణకు చంద్రబాబు ఆదర్శం. ఒక దశలో చంద్రబాబు తనను లెక్క చేయలేదనే ఈయన ఆంధ్రజ్యోతి తీసుకున్నాడంటారు. ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలతో నిర్మించుకున్న పత్రిక పీఠం మీద కూర్చుని కేసీఆర్‌ను ఎన్నెన్ని మాటలన్నాడో చూడండి రాధాకృష్ణ. రాధాకృష్ణది డొల్లతనం, కుళ్లుబోతు తనం. తనకు పత్రిక, చానెల్ ఉన్నాయి కాబట్టి నాయకులంతా తనకు వంగి వంగి సలామ్‌లు చేయాలని రాధాకృష్ణకు మహాకోరిక. తనతో మాట్లాడకపోతే, తన మాట వినకపోతే టార్గెట్ చేయడం రాధాకృష్ణకు అలవాటు. కేసీఆర్‌మీద రాధాకృష్ణకు ఇంతకు మించిన దుగ్ధ లేదు. ఈ దుగ్ధకు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ అందమైన కలర్ ఇచ్చుకోవడం ఈ వదరుబోతులకు బాగా అలవాటయింది.

2. ‘ప్రజాస్వామిక లక్షణాలు ఏమాత్రం లేని’ కేసీఆర్‌కు అరాచకంగా, నిరంకుశంగా వ్యవహరించడం ప్రస్తుతానికి ఆనందాన్ని ఇవ్వవచ్చు….’ ‘కేసీఆర్‌లోని నియంతృత్వ పోకడలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ వచ్చాం… ప్రజాస్వామ్యం పొడగిట్టని కేసీఆర్‌కు తప్పులు ఎత్తిచూపడం సహజంగానే రుచించదు’…

ప్రజాస్వామ్యం రాధాకృష్ణకు జన్మనిచ్చిందో, రాధాకృష్ణే ప్రజాస్వామ్యానికి జన్మనిచ్చారోగానీ…. ఆయనకు ప్రజాస్వామ్యంపై ఏమాత్రం గౌరవం లేదని మాత్రం అర్థం అవుతుంది. కేసీఆర్‌ను ఇలా క్యారెక్టరైజ్ చేసినందుకు ఆ పత్రికను, చానెల్‌ను నిషేధించాలని ఎవరయినా డిమాండు చేయవచ్చు. ఇలా ఇష్టం వచ్చినట్టు నాయకులను కించపర్చడానికి, అవమానించడానికి ఈయనకు ఉన్న అర్హత ఏమిటి? అసలు తెలంగాణకు ఈయనకు సంబంధం ఏమిటి? కేసీఆర్‌కు ప్రజామోదం ఉంది. రాధాకృష్ణకు ఏముంది టీవీ లైసెన్సు తప్ప. కేసీఆర్ నిన్నగాక మొన్న ప్రజల తీర్పుతో ముఖ్యమంత్రి అయినవారు. 75 లక్షల మంది తెలంగాణ ప్రజల ఆమోదంతో ఆయన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. శుభం పలకకపోతే పోయింది…. ఎన్ని అబద్ధాలు, ఎన్ని ఆరోపణలు చేశాడో చూడండి. కేసీఆర్‌కు ప్రజాస్వామిక లక్షణాలు లేవని ఈయన తీర్పునిస్తారు. అంటే కేసీఆరే మా నాయకుడు అని నిన్నగాక మొన్న తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు వెర్రిబాగులోళ్ళు. కేసీఆర్‌కు అధికారం వచ్చిందెప్పుడో, ఆయన నియంతృత్వపోకడలు ప్రదర్శించింది ఎప్పుడో ఈయన గారు ఎత్తి చూపింది ఎప్పుడో…. ఇవి పిచ్చివాడి ప్రేలాపనలు తప్ప మరొకటి కావు. పోనీ ఈయన పత్రిక, చానెల్‌లు తెలంగాణలో కోట్లాది మంది ప్రజల మన్నన పొందినవా అంటే అదీ లేదు. ఈయనగారి పత్రిక తెలంగాణలో కొంటున్నవాళ్లు రెండు లక్షల లోపే. నమస్తే తెలంగాణ కంటే తక్కువే. ఆ పత్రికను చదువుతున్నవారి సంఖ్య 5.9 లక్షల మంది. ఈ పత్రిక పాఠకుల సంఖ్య ఒకప్పుడు తెలంగాణలో 20 లక్షలు ఉండె. ఇప్పుడు ఈ దుస్థితికి చేరుకుంది. తెలంగాణ జనాభాలో చూస్తే 1.67 శాతం మంది. ఇప్పుడు చెప్పండి తెలంగాణ ప్రజల ప్రతినిధి కేసీఆరా లేక అసందర్భ ప్రేలాపనలతో వీరంగం వేస్తున్న రాధాకృష్ణా?

3. ‘ఆయన తెలంగాణకు ఏకైక మోనార్క్ కాదు. కాలేరు. తాజా ఎన్నికలలో కూడా ప్రజలు ఆయనకు బొటాబొటి మెజారిటీ సమకూర్చారు. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర సమితికి లభించిన ఓట్ల శాతం 38.5 శాతం మాత్రమే. మిగిలిన మెజారిటీ ప్రజల మనోభావాలకు అద్దంపట్టాల్సిన బాధ్యత మీడియా సంస్థలపై ఉండదా?’

రాధాకృష్ణ మొదటి పేజీ రాతలు చూసిన తర్వాత మోనార్క్ ఎవరో, ప్రజానాయకుడెవరో అర్థమవుతుంది. ప్రజలు, ప్రభుత్వం, పార్టీలు, వ్యవస్థలు వేటినీ లెక్క చేయకుండా, ఎవరి అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా ఇష్టం వచ్చినట్టు కూసేవాడు, రాసేవాడు, చెలరేగేవాడు మోనార్క్. రాధాకృష్ణ అతితెలివి ఎలా ఏడిచిందీ అంటే తెలంగాణలో 38.5 శాతం మందికే కేసీఆర్ నాయకుడట. ముఖ్యమంత్రి అట. మిగిలిన మెజారిటీ ప్రజలకు ముఖ్యమంత్రి, నాయకుడు తానే అనుకుంటున్నాడేమో రాధాకృష్ణ. మరి ఇదే సూత్రం ఆంధ్రలో ఎందుకు వర్తింపజేయలేదు రాధాకృష్ణా? అక్కడ కూడా అరవైశాతం మంది చంద్రబాబుకు ఓటు వేయలేదు కదా. అక్కడ మెజారిటీ ప్రజల తరపున చంద్రబావుపై ఇలా ఎందుకు మాట్లాడడం లేదు. చంద్రబాబులో నియంతృత్వం ఎందుకు కనిపించలేదు. నీ పత్రికకు పెట్టుబడి పెడుతున్నందుకా? నీతో రోజూ మాట్లాడుతున్నందుకా? నీవు ఆంధ్ర రాజధానికి చందాలు వసూలు చేయడానికి పిలుపు నిచ్చావు కానీ మా తెలంగాణ పిల్లలు చనిపోతుంటే వారికి ఆర్థిక సాయం అందించడానికి ఎందుకు ముందుకు రాలేదు? ఇంత వంకరగా ఆలోచించే నిన్ను ఆంధ్రోడు అంటే తప్పేముంది? కొత్త రాష్ట్రం, కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం, కొట్లాటకు నాయకత్వం వహించిన కేసీఆర్, తొలి ముఖ్యమంత్రి, కొంతకాలం ఆగి విమర్శలు చేద్దామన్న కనీస ఇంగితం లేని మనిషిని ఆంధ్రోడు అనకుండా ఏమనాలి?

4. ‘అంతటితో ఆగకుండా హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఏబీఎన్, టీవీ 9 ప్రసారాలను బంద్ చేయాలని ఎంఎస్‌ఓలకు హకుం జారీ చేశారు…. ఈ విషయంలో ఎంఎస్‌ఓలను నిందించి ప్రయోజనం లేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి స్వయంగా కల్పించుకుని ఫోను చేసి హెచ్చరించిన తర్వాత ఎంతమంది ఎదిరించి నిలదొక్కుకోగలరు?’

అబద్ధం ముందు పుట్టి ఆంధ్ర పత్రికలు తర్వాత పుట్టాయి. కేసీఆర్ బెదిరించి కేబుల్ కనెక్షన్‌లు తీయించారని రాధాకృష్ణ ఒక పెద్ద అబద్ధాన్ని ఆలవోకగా రాసిపారేశాడు. మధ్యలో ఎంఎస్‌ఓలపై ఏదో పెద్ద గౌరవం ఉన్నట్టు బిల్డప్. రాధాకృష్ణా తెలంగాణలో నీ నాయకత్వంలోని 61.5 శాతం మందిలో ఒక్క ఎంఎస్‌ఓ కూడా లేడా? ఒక్క ఎంఎస్‌ఓతో నయినా ముఖ్యమంత్రి బెదిరించాడని చెప్పించు.

5. ‘ఈ పోరాటంలో విజయానికి లేదా వీర మరణానికి…దేనికైనా రెడీ!’

దోమకు కూడా తొండం ఉంటది. అంతమాత్రాన అది ఏనుగు కాలేదు. దోమలతో ఏనుగులు పోరాటం చేయవు. వీధిలో పొట్టకూటికోసం కొరడాతో కొట్టుకునే గారడీ మనిషికి రక్తం కారుతుంది. కానీ అతడు వీరయోధుడు కాలేడు. ఎంత ఊపినా గొర్రె తోకకు సుడిగాలి పుట్టదు. నీతో పోరాటానికి కేసీఆర్ అక్కరలేదు. నీకు అంత సీను లేదు. ఎక్కువ ఊహించుకుని నిద్ర పాడు చేసుకోకు. తెలంగాణలో ప్రతి ఊరిలో పదిమంది కేసీఆర్‌లు ఉన్నరు నీతో తలపడడానికి. ఎక్కువ ఎగురకుండా బుద్ధిగా పత్రిక నడుపుకుంటే మంచిది. పత్రికా స్వేచ్ఛ పరిమితులు తెలుసుకుని, వళ్లు దగ్గరపెట్టుకుని రాసినా కూసినా పర్వాలేదు. కానీ పాత బుద్ధి, అధిపత్య బుద్ధి, వంకరతనం వదిలిపెట్టకుంటే నీ పత్రికను ప్రజలే నిషేధించే సమయం వస్తుంది.

6. ‘ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్‌రెడ్డి కూడా చేయని దుస్సాహసానికి కేసీఆర్ ఇప్పుడు ఒడిగట్టారు.’

ఎందుకు తెలియదు. నీ బట్టలు, మీ పెద్దన్న ఈనాడు బట్టలు విప్పి బజార్లో పెడితే నానా తంటాలు పడికదా మీరు నిలబడ్డది. రాజశేఖర్‌రెడ్డికి కేసీఆర్‌కు పోలికే లేదు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతినిధి. మీ వెర్రి మొర్రి వేషాలకు భయపడే రకం కాదు. పారిపోయే రకం కాదు. దమ్మున్ననాయకుడు. పద్నాలుగేళ్లు కొట్లాడి తెలంగాణ సాధించిన నాయకుడు. మీలాంటోళ్లను అనేక మందిని చూసిన నాయకుడు.

7. మాటిమాటికి తెలంగాణ ఉద్యమానికి నువ్వే పురుడుపోసినట్టు చెప్పుకుంటున్నావు. నీకన్నా ముందు ప్రజాతంత్ర, వార్త పత్రికలు తెలంగాణ పతాకాన్ని ఎత్తుకున్నాయి. 2001 పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి ఒక్క ఊపు ఊపిన తర్వాత నీ పత్రిక పుట్టింది. నీ పత్రికలోకి వచ్చిన వాళ్లంతా తెలంగాణవాదులే కాబట్టి గత్యంతరం లేక రాయనిచ్చావు. అదేదో పెద్ద మెహర్బానీ చేసినట్టు పోజు పెడతావు. 2009 డిసెంబరు నిర్ణయం వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమాన్ని రెచ్చగొట్టడంలో తమరు నిర్వర్తించిన పాత్ర తెలంగాణ ప్రజలకందరికీ తెలుసు. మీ రాతలు, మీ చానెళ్ల కూతల వల్లనే చాలా మంది తెలంగాణ పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నరు. అందుకే ఎక్కువ డంబాచారాలకు పోకుండా నీ పని నీవు చేసుకో. అనవసరంగా తెలంగాణవాదులను రెచ్చగొట్టకు.

Reposted from Face Book wall of Dharani Kulakarni

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

13 Responses to ప్రజాస్వామ్యానికి ప్రతినిధి కేసీఆరా? రాధాకృష్ణా?

 1. laxminarsimha says:

  దుమ్ము దులిపేశారు.. దెబ్బకు ముసుగు తొలగిపోయింది….

  Liked by 1 person

 2. madhukar.v says:

  chala baga chepparu

  Like

 3. Venugopal says:

  Thanks.. We need to condemn this kind of Andhra crusaders … Need to throw them out of Telangana …

  Like

 4. ponugoti ravinder says:

  super sir

  Like

 5. raghu yadav says:

  supar anna masthu cheppinav ….

  Like

 6. Somanath says:

  I support Radha Krishna Garu..

  Like

 7. VEERESH says:

  ME LANTI VALLAA ANSWER LEKANE RK ATLA RECHIPOTUNNADU

  Like

 8. M.Nageswarrao. says:

  Telangana pai visham chimme vyakkhyalu khandinchalsinde. Vastavalu andariki telapalsinde. Telangana prajalantha mee vente vunnaru. Sir, proceed, till he stops such non-sence.

  Like

 9. Narsimha reddy Alammagaari. says:

  Saakera petti vuthakatamante idaa ! understood.

  Like

 10. Narender Reddy says:

  counter ante ela vundalo cheppe article…..nice one

  Like

 11. kattashekar says:

  Reblogged this on కట్టా మీఠా and commented:

  Dharani’s Counter to RK

  Like

 12. satyavema jayathe says:

  true..rk is a broker with no values !!

  Like

 13. iammadhava says:

  రాధా కృష్ణ చెత్త పలుకులు

  ఇరోజు ఆంధ్ర జ్యోతి రాధా కృష్ణ కొత్త పలుకు రాతలు చూస్తుంటే నిజంగా రోత పుట్టించే లాగున్నాయి, ఎందకంటే కొత్తపలుకు ముసుగుగులో చెత్త రాతలు రాసుడు ఆంధ్ర అహంబావం ప్రతి అక్షరం లో కన్పిస్తుంది దానికి తోడు , అసలు నోటితో మాట్లాడలలేని హెడ్డింగులు పెట్టి రాతలు రాయడం ఇ మనిషికే చెల్లింది ఇక ఇ పేపర్లో ఎంత బూతు రాతలు ఉండాలో అంత ఉంటుంది , కానీ ఇది ఇప్పటిది కాదు , తెలంగాణా బిడ్డలు పిట్టల్ల రాలిపోతూ ఉంటె , పబ్బం గడుపు కున్నది ఇ మనిషే , కెసిఆర్ మీద అక్కసుతో మొత్తం తెలంగాణాను . ఆబాసు పాలు చేయడం ఇ మనిషికే చెల్లింది , ఇక ఇక్కడ జరిగే ఏ సమస్య అయిన అది కెసిఆర్ వల్లే జరగి నట్లు . అది ఎక్కడ ఇలాంటి సంగటనలు జరగనట్లు బుతద్డంలో చూపెట్టడం , బ్రాహ్మ్మండం బద్దలై పోయింది , ఇక ఏదో జరుగబోతోంది, తను రాసిందే కరెక్ట్ అని డబ్బా కొట్టుకోవడం మనకు కొత్తేం కాదు
  ఇక అసలు విషయం ఏమంటే ఇ విషపు రాతలు రాసే మనిషి మాటలు తెలంగాణా ప్రజలు నమ్మే స్తితి ఏనాడో పోయింది ,
  మరి అరి పోయే దీపం వేలుతురేక్కువ అన్నట్లు
  తెలంగాణాలో ABN TV ఏనాడో పోయింది ఇక ఈ పేపర్ దరిద్రం మరియు తన దుకాణం తెలంగాణాలో ముసుకొనే రోజు దగ్గరలో ఉన్నదని ఆశిద్దాం , మరియు తన పరిస్తితిఎం బాగా లేదని త్వరలో తెలంగాణాలో దుకాణం మూసే రోజు దగ్గర పడ్డట్లు చూచాయగా తెలుస్తున్నది

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s