ఆమె అమృతమూర్తి


My daughter with Attamma
My daughter with Attamma

ఆమె అమృతమూర్తి. భూదేవంత సహనం. ఎముకలేని చెయ్యి. మామయ్య,జగదీశ్, ఇతర కుటుంబ సభ్యులు అందరూ అటువంటివారే. ఇల్లు ఎప్పుడూ సత్రంలాగా ఉండేది. పండుగ పబ్బాలు వచ్చాయంటే చాలు తరతమ భేదాలు లేకుండా అందరినీ పిలిచి పిలిచి భోజనాలు పెట్టేవారు. ఆమెది స్వచ్ఛమైన మనసు. కడుపులో ఏదీ దాచుకోకుండా మాట్లాడేవారు. అలా మాట్లాడడం వల్ల అప్పుడప్పుడూ సమస్యలు వచ్చినా అవన్నీ దూదిపింజల్లా తేలిపోయేవి. చుట్టాలు, పక్కాలను మనసారా పలక రించేవారు.

ఆమె అంత్యక్రియలకు వచ్చిన జనాన్ని చూస్తేనే ఆమె సంపాదించుకున్న దేమిటో అర్థమవుతుంది. అత్తామామల పెళ్లి వందూళ్లలో చెప్పుకునేట్టు జరిగిందట. పెద్దమామ తెలంగాణ రైతాంగ సాయుధపోరాట నాయకుడు. రాజకీయ కుటుంబం. అందుకే అత్తమామల పెళ్లి ఊరేగింపు భారీ సన్నాయిమేళం, వందడప్పులు, వందలాది మంది బంధువుల సమక్షంలో జరిగిందట. మే 29 వారి పెళ్లి రోజు. ఆ రోజే ఆమె కన్నుమూశారు. ఆమె అంతిమయాత్రా అంతేఘనంగా జరిగింది. ఆమె నన్ను అల్లుడిగా చూడలేదు. కొడుకుగానే చూశారు. మాకుటుంబంలో ఆమె మరణం వల్ల ఏర్పడిన లోటు పూడ్చలేనిది. ఆమెకు మనసా శిరసా నివాళి.

photo(8)

Scenes at Funeral
Scenes at Funeral

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “ఆమె అమృతమూర్తి”

  1. Dear Shekar, This blog is very apt and moving. I used to tell your late mother-in-law often that three of us – late Dayakar, Jagadeesh and I inherited her father’s (naa mena mama) sharp intellectual and funny side of his character.  I always remember her with fond  memories as an illustrious cousin. May her soul rest in peace!  mamayya with love.   Dr. K. Indrasena Reddy Prof. of English Mo# +91-9849730925

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s