కొత్త రాజకీయాలకు శ్రీకారం


24ss1

దేశంలో, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సుఖాంతమయ్యాయి. అన్ని చోట్లా అందరికీ మెజారిటీ ఇచ్చి ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చారు. ఎవరిపై ఎవరూ ఆధారపడకుండా కేంద్రంలో ఎన్‌డీఏకు, తెలంగాణలో టీఆరెస్‌కు, ఆంధ్రలో టీడీపీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. నరేంద్ర మోడి, కేసీఆర్, చంద్రబాబు తమ పరిపాలనలో మంచి చెడులకు తమే బాధ్యత వహించవలసిన పరిస్థితిని ప్రజలు కల్పించారు.

నరేంద్ర మోడిపై ఎవరికి ఎన్ని విమర్శలు, అభ్యంతరాలు ఉన్నా ప్రజలిచ్చిన తీర్పును గౌరవించడం ప్రజాస్వామిక ధర్మం. దేశానికి ప్రత్యామ్నాయ నాయకుడిగా తనను తాను ప్రతిష్ఠించుకున్న తీరు, ప్రజలను మెప్పించిన తీరు అసాధారణం. అభినందనీయం. బిజెపికి ఒంటరిగానే సాధారణ మెజారిటీ కంటే ఎక్కువగా-25 సీట్లు రావడం అంటే అది ముమ్మాటికి మోడీ విజయమే. ఉత్తరభారతం అంతా మోడీనామాతో ఊగిపోయినట్టు ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. కుల, మత, ప్రాంతీయ రాజకీయాల సుడిగుండంలో చిద్రుపలైన ఉత్తరప్రదేశ్ ఒకే ఒక్క పార్టీకి 73 స్థానాలను కట్టబెట్టడం చాలా దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం.

బిఎస్‌పీ ఒక్కస్థానాన్ని కూడా గెల్చుకోలేకపోవడం, ఎస్‌పి అతి తక్కువ స్థానాలకు పరిమితం కావడం ఉత్తర ప్రదేశ్ ప్రజలు మార్పుకోసం పడిన తాపత్రయానికి నిదర్శనం. కాంగ్రెస్ పదేళ్ల పాలనపై ప్రజలు ఎంతగా రోసిపోయి ఉన్నారో ఆ పార్టీ ఘోర పరాజయం తెలియజేస్తున్నది. దేశాన్ని ఒక్కటి చేయగలిగిన, ఒక్కటిగా నడిపించగలిగిన ఒక నాయకుడు కావాలని జనం కోరుకున్నట్టు ఓటింగ్ సరళిని బట్టి అర్థమవుతున్నది. మోడీకి ఇప్పుడు ఎదురు లేదు. ఎవరూ బ్లాక్‌మెయిల్ చేసే అవకాశాలు లేవు. అయన సర్వస్వతంత్రుడుగా పరిపాలించవచ్చు. అయితే ఇటువంటి పరిస్థితుల్లోనే గతంలో నియంతలు పుట్టినట్టు చరిత్ర పాఠాలు చెబుతున్నాయి. మోడీ అందుకు మినహాయింపు అయితే సంతోషం. కొనసాగింపు అయితే చరిత్ర పునరావృత్తం అవుతుంది.

కేసీఆర్ ముందు చూపు

kcr--621x414
కేసీఆర్ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఉంటే తెలంగాణలో మార్పు కాదు కదా మహాదారుణం జరిగి ఉండేదని ఒక రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌పై ఉండే వ్యతిరేకత బిజేపీ-టీడీపీలకు బాగా ఉపయోగపడి ఉండేదని, తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలను పాదుకొల్పే అవకాశాన్ని కోల్పోయి ఉండే వారని ఆయన అన్నారు. మోడీ ప్రభావం చూసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్య ఇది. టీఆరెస్ ఒంటరిగా నిలబడి పోరాడింది కాబట్టి ఇవ్వాళ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. సుమారు 50 మంది కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. పాత నాయకత్వం పక్కకు వెళ్లిపోయింది. కేసీఆర్‌కు ఎవరిపైనా ఆధారపడవలసిన అవసరం లేకుండా పోయింది. బంగారు తెలంగాణ నిర్మాణంకోసం తాను రూపొందించి పెట్టుకున్న ఎజెండాను అమలు చేయడానికి ఆయనకు మార్గం సుగమం అయింది.

ఆంధ్రప్రజల విజ్ఞత
naidu-animal647x450
ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారాన్ని అప్పగించడం ద్వారా రాజకీయ పరిణతిని ప్రదర్శించారు. పరిణతిలేని జగన్‌మోహన్‌రెడ్డి కంటే పాలనానుభవం ఉన్న చంద్రబాబునాయుడు ఉత్తమం అని ప్రజలు భావించారు. అభివృద్ధికి ఓటేశారు. సెంటిమెంట్‌లను, షార్ట్‌కట్‌లను అంగీకరించలేదు. చంద్రబాబునాయుడు కూడా ఈ ఎన్నికల సందర్భంగా చాలా వేగంగా పావులు కదిపారు. బీజేపీతో కలవకపోయినా, పవన్ కల్యాణ్ వంటివారిని చేరదీసి ప్రచారంలో దింపకపోయినా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో భంగపడి ఉండేవారు.

రెండు రాష్ట్రాల మధ్య పోటీ మంచిది

తెలంగాణలో టీఆరెస్ అధికారంలోకి రాకపోతే బాగుండునని తెలుగుదేశం, సమైక్యవాదులు భావించారు. ఆంధ్రలో తెలుగుదేశం అధికారంలోకి రాకపోతే బాగుండునని టీఆరెస్, తెలంగాణవాదులు భావించారు. కానీ ప్రజలు తెలంగాణవాదుల ఆకాంక్షలకు విరుద్ధంగా అక్కడ టీడీపీని, సమైక్యవాదుల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇక్కడ టీఆరెస్‌ను గెలిపించారు. రెండు రాష్ట్రాల నాయకత్వాలు పోటీ తత్వం పనిచేస్తే అక్కడా ఇక్కడా ప్రజలకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. సంఘర్షణ పూరిత రాజకీయాలను వదిలి సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పేందుకు రెండు రాష్ట్రాల నాయకత్వం కృషి చేయాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “కొత్త రాజకీయాలకు శ్రీకారం”

  1. i do believe that we are passing through some glorious time for telangana under KCR’ rule, such a fresh air for which people have been waiting for. i sometimes wonder “can it be true!” Similar expectations from Mr.Modi’s rule at the center, a change for better governanance, fight against corruption and equal justice to all sections of indians .off course, our brethren in andhra made right decision by electing TDP, .I do think CNB is the right person to take them forwards. but TDP should stop dreaming about coming to power in Telangana. Please leave us alone, and as KCR said, “ma tala raaata mammalne rasukoniyyandi” Jai Hind, Jai Telangana

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s