ఇక్కడ మిశ్రమం, అక్కడ తెదేపా


Telangana-seemandhra-map-e1395162279484

మున్సి‘పల్స్’ దేనికి సంకేతం?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అనేక సంకేతాలను ఇచ్చాయి. తెలంగాణలో ఫలితాలు ఊహించిన విధంగానే ఉన్నాయి. సీమాంధ్రలో అందరి ఊహలను తలకిందులు చేస్తూ తెలుగుదేశం పైచేయి సాధించింది. జడ్‌పీటీసీ ఎన్నికల్లో కూడ ఫలితాలు ఇలాగే వస్తే శాసనసభ ఎన్నికల్లో కూడా సీమాంధ్రలో తెలుగుదేశం ఆధిక్యత సాధించే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో మాత్రం వైసీపీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. తెలుగుదేశం అక్కడక్కడా కొన్ని వార్డులను గెల్చుకోగలిగింది.

తెలంగాణలోని మొత్తం 1399 వార్డుల్లో కాంగ్రెస్ 36 శాతం, టీఆరెస్ 22 శాతం, టీడీపీ 11 శాతం, ఇతరులు 25 శాతం వార్డులను గెల్చుకున్నారు. టీఆరెస్‌కు మున్సిపాలిటీల్లో ఇటువంటి స్థానం దక్కడం ఈ పద్నాలుగేళ్లలో ఇదే ప్రథమం. మూడు కార్పొరేషన్లలోని 150 డివిజన్లలో కాంగ్రెస్, టీఆరెస్‌లకు 27 శాతం చొప్పున ఇతరులకు మిగిలిన డివిజన్లు దక్కాయి. బిజెపి, వామపక్షాలు, ఇండిపెండెంట్లు ఇతరుల్లో ఉన్నారు.

జడ్‌పీటీసీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని సంకేతాలను వెల్లడించే అవకాశం ఉంది. మున్సిపల్, జడ్‌పీటీసీ ఎన్నికల నాటికి ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభించలేదు. కేసీఆర్ అప్పటికే ఎక్కడా పర్యటించలేదు. ఏప్రిల్ మొదటివారంలో ఈ రెండు ఎన్నికలు పూర్తయిన తర్వాతనే కేసీఆర్ తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటించారు. తమ ఎన్నికల ఎజెండాను బలంగా ప్రజల వద్దకు తీసుకెళ్లారు. ఆ ఎన్నికల తర్వాతనే నరేంద్రమోడీ, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రచారం మొదలు పెట్టారు. ఈ అంశాలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల పునరేకీకరణకు దారితీసింది. అందువల్ల అసెంబ్లీ ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

టీఆరెస్ గత పద్నాలుగేళ్లలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాకపోవడం వల్ల పార్టీగా ఒక యంత్రాంగాన్ని నిర్మించుకోలేకపోయింది. మొదటిసారిగా టీఆరెస్‌కు తెలంగాణలో అటువంటి పరిస్థితి ఇప్పుడు ముందున్నది. సీమాంధ్రలో కూడా టీడీపీ విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంత ఓటర్లు టీడీపీ-బీజేపీకి అనుకూలంగా ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుందని వైసీపీ వర్గాలు వాదిస్తున్నా సీమాంధ్రలో ప్రధానంగా పట్టణప్రాంత ప్రభావం కలిగిన నియోజకవర్గాలే ఎక్కువ. అది టీడీపీ కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏ పార్టీ అయినా స్వల్ప ఆధిక్యతతోనే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ గెలిస్తే రాజధానిని సీమాంధ్రకు రానివ్వడన్న ప్రచారం, భయం ప్రకాశం నుంచి గోదావరి జిల్లాల వరకు బాగా నెలకొందని, అది కూడా టీడీపీ-బీజేపీలకు ఉపయోగపడిందని ఒక జర్నలిస్టు చెప్పారు.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s