ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు?


image

ఆంధ్రలో పొలీంగ్ ముగిసింది. ఓటింగ్ శాతం పెరిగింది. పోటీ హోరాహోరీ జరిగింది. అక్కడ జరిగిన గొడవలు, ఘర్షణలు, కాల్పులు అందుకు నిదర్శనం. తెదేప-భాజపాలు ఒకవైపు, వైసీపీ మరోవైపు జీవన్మరణ సమస్యగా పోరాడాయి. చంద్రబాబు విజయ ప్రకటనలో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. మొత్తం మీడియా దూరం పెట్టి అనుకూల మీడియాతో మాత్రమే తను చెప్పదల్చుకున్నది చెప్పి ముగించారు. జగన్ మాత్రం కాస్త ఎక్కువ ధీమా కనబరిచారు.

ఇక అంచనాలు ఎవరివి వారివే. 120 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్ సభ స్థానాలు గెలుస్తామని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. 100 అసెంబ్లీ స్థానాలు, 15 లోక్ స్థానాలు గెలుస్తామని తెదేపా వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీటీవీ వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్ నిర్వహించాయి.

ఇంటలిజెన్స్ వర్గాలు మాత్రంవైసీపీ అతికష్టం మీద మేజిక్ మార్క్ దాటుతుందని అంచనాకు వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఒక ఎన్నికల నిపుణుని అంచనా ప్రకారం వైసీపీ 95 అసెంబ్లీ స్థానాలను, మెజారిటీ లోక్ సభ స్థానాలను గెలుస్తుంది. ఈ నెల 12 సాయంత్రం జాతీయ ఛానళ్ళు ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేస్తాయి.

పోలింగ్ శాతం పెరగడం ఎవరికీ లాభం?

సాధారణంగా పోలింగ్ పెరగడం ప్రభుత్వ వ్యతిరేకతకు సూచనగా భావిస్తారు. మార్పు రావాలన్న బలమైన కోరిక కూడా ఓటింగ్ పెరగడానికి కారణం. ఆంధ్రాలో రెండూ ప్రతిపక్షాలే. కానీ తెదేపా పాత ఎస్టాబ్లిష్మెంట్. వైసీపీ సాపేక్షంగా కొత్త ఎస్టాబ్లిష్మెంట్. నరేంద్ర మోడీ, జగన్ లు ఓటింగ్ పెరగడానికి కారణమై ఉంటారని ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. పట్టణాలలో కంటే గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ బాగా పెరగడం గమనార్హం.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

One Response to ఆంధ్రాలో ఎవరు గెలుస్తారు?

  1. My Take
    YCP Crosses 90 and TJP 50 in Assembly 35 are Close Contest
    YCP Crosses 12 and TJP (TDP+BJP) 6 in MP about 7 seats Close Contest

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s