ప్రచారసమరంలో టీఆరెస్ పైచేయి


image

తెలంగాణలో ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల ప్రచారంలో టీఆరెస్ పైచేయి సాధించింది. కేసీఆర్ స్టార్ కాంపెయినర్‌గా 80కి పైగా సభల్లో ప్రసంగించారు. ఈ సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చాలాచోట్ల స్వచ్ఛందంగా కూడా జనం పాల్గొన్నారు. కేసీఆర్ ప్రసంగాలుకు వచ్చిన స్పందన మిగిలిన ఏ పార్టీ నాయకుడికీ లభించలేదు. అత్యధిక నియోజకవర్గాలలో పర్యటించిన నాయకుడు ఆయన ఒక్కరే.

టీడీపీ-బీజేపీల కూటమి తొలిరోజుల్లో మంచి ఊపును కనబర్చింది. కానీ నరేంద్రమోడి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు కలిసి ప్రసంగాలు చేయడం, అవన్నీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సాగడం ఆ కూటమి ఉత్సాహాన్ని చంపేశాయి. నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటిస్తున్నారో ఆంధ్రలో పర్యటిస్తున్నారో తెలియకుండా మాట్లాడడం అందరినీ విస్మయానికి గురిచేసింది. తెలంగాణ ప్రజలు ఎవరి పీడ వదిలించుకోవడంకోసం పోరాడారో వారినే వెంటబెట్టుకుని మోడీ సభలు జరుపడం బీజేపీకి తీరని నష్టం కలిగించింది. మోడీ కేసీఆర్‌ను టార్గెట్ చేయడం కూడా బీజేపీకి కలిసిరాలేదు.

కాంగ్రెస్ వైపు నుంచి సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, మరో అరడజను మంది హేమాహేమీలు వచ్చి ప్రచారం చేశారు కానీ రావలసిన ఊపు రాలేదు. కాంగ్రెస్ నాయకత్వం అస్తమానం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడి ఆయన విలువను ఇంకా పెంచారు. తెలంగాణను ఇంత రచ్చచేసి, ఇంత సాగదీసి ఇవ్వడం, పదేళ్లుగా అధికారంలో ఉండి యాంటీ ఇన్‌కంబెన్సీని ఎదుర్కోవడం కాంగ్రెస్‌కు తెలంగాణ ఇచ్చిన ఫలితాన్ని దక్కనివ్వలేదు. చాలా మంది సీనియర్ మంత్రులు కూడా ఇప్పుడు ఎదురీదుతున్నారు. పదిహేను నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో పోటీ కాంగ్రెస్‌కు, టీఆరెస్‌కు మధ్యనే ఉన్నది.

ఎన్‌డీటీవీ తాజా సర్వే ప్రకారం టీడీపీ-బీజేపీ కూటమి గత పది రోజుల వ్యవధిలో బాగా బలహీనపడింది. టీఆరెస్ పరిస్థితి మెరుగుపడింది. టీఆరెస్ 8, కాంగ్రెస్ 7, టీడీపీ-బీజేపీలు 1, ఎంఐఎం ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే టీఆరెస్‌కు 32 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు వస్తాయని, టీడీపీ-బీజేపీలకు 23 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించింది. లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే ఈ సర్వే పరిమితమయిందని, శాసనసభ ఎన్నికలకు వచ్చే సరికి ఈ ఓట్ల శాతం మారే అవకాశం ఉందని ఎన్‌డీటీవీ అధినేత ప్రణయ్‌రాయ్ చెప్పారు.

ఏరకంగా చూసినా టీఆరెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s