తెలంగాణకు మోడీ శాపం


image

దీవించమంటే విధవలాగా వెయ్యేళ్లు బతకమన్నట్టుంది బిజెపి నేత నరేంద్రమోడీ ప్రసంగం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఒక్క మంచి మాట కూడా పలకని ఉత్కృష్ట నాయకుడు మోడీ. ఏడుపును తప్ప, సంతోషం వ్యక్త పర్చని మహానాయకుడు. ఆంధ్రమీద సానుభూతి తప్ప, తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్న ఊరట ఆయన మాటల్లో ఏరోజూ కనిపించలేదు. తల్లిని చంపి, పిల్లను బతికించారట. ఎవరు తల్లి? ఎవరు పిల్ల? అంటే తెలంగాణను ఇచ్చి ఆంధ్రను చంపారని మోడీ భావిస్తున్నారా? ‘నేను ఢిల్లీలో ఉంటా. మీకు కరెంటు కావాలె. తీగలు ఎక్కడి నుంచి వస్తాయి?’ అని బెదిరించడానికి కూడా ఆయన వెనుకాడలేదు. అసలాయన ఇది తెలంగాణ అనుకుని మాట్లాడాడా ఆంధ్రా అనుకుని మాట్లాడాడా అన్న అనుమానం వస్తోంది. ఇద్దరు తెలంగాణ ద్రోహులను పక్కనపెట్టుకుని, తెలంగాణ ఏర్పాటును ఒక తద్దినంగా ప్రకటించి, తెలంగాణలో బిజెపిని బతికిద్దామనే! పవన్ కల్యాణ్ ఆయనకు స్ఫూర్తి అట. ఏ విషయంలో స్ఫూర్తి? నరేంద్రమోడీ రాజకీయ అవగాహనకు, పవన్ కల్యాణ్ అవగాహనకు పెద్దగా తేడా లేదని అనిపిస్తున్నది. ఇదీ ఒకందుకు మంచిదే. బిజెపిపై తెలంగాణ ప్రజలకు ఏమైనా భ్రమలు ఉంటే దీనితో తొలగిపోవాలి. బిజెపి తెలంగాణ పార్టీ కాదని ఈ ప్రసంగాలు రుజువు చేశాయి.

చిరంజీవి కుటుంబ రాజకీయాలకు ఓకే
సకుటుంబ సపరివార సినిమా దందాకు ఓకే
చంద్రబాబు కుటుంబపాలనకు ఓకే

పవన్ కల్యాణ్ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడారు. తెలంగాణను కుటుంబ రాజకీయాలకు అప్పగించొద్దని పిలుపునిచ్చారు. గురివిందకు తన నలుపు తెలియదు. సకుటుంబ సపరివార సమేతంగా సినిమా ప్రపంచాన్ని శాసించవచ్చు. పక్కోడు, బక్కోడు ఎవడన్నా ఉదయిస్తే తొక్కిపారేయవచ్చు. కుటుంబమంతా కలసి కంపెనీలాగా ఒక పార్టీని ఏర్పాటు చేయవచ్చు, టిక్కెట్లు అమ్ముకోవచ్చు. ఎన్నికయిన ఎమ్మెల్యేలను వేరేపార్టీలో కలిపేసి, పదవులు దండుకోవచ్చు. తెలంగాణపై నాలిక తిప్పేసి పిల్లిమొగ్గు వేయవచ్చు. చివరకు అన్న ఒక పార్టీలో, తమ్ముడు మరోపార్టీలో సేవలు అందిస్తూ చర్మ రక్షణ చేసుకోవచ్చు. అది కుటుంబ రాజకీయం కాదు. చంద్రబాబు సకుటుంబ సపరివారసమేతంగా రాజకీయాలు నడుపవచ్చు. పవన్ కల్యాణ్ వారి సేవలో తరించవచ్చు. కేసీఆర్ మాత్రమే కుటుంబ రాజకీయాలు చేయవద్దు. ఎవడ్రా మీరు? ఏదేశంలో ఉన్నారు? ఎవరికి నీతులు చెబుతున్నారు?

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s