తెలంగాణాలో గులాబీ ప్రభంజనం రాబోతోందా?


images

ఈ ఒక్కసారికి తెలంగాణా పార్టీకి అవకాశం ఇవ్వాలన్న భావన పల్లెల్లో బలంగా ఉంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మద్దతు లభిస్తోంది. తెదేపా, వైసీపీలు సోదిలోనే లేవు. కాంగ్రేస్ పార్టీపై వ్యతిరేకత ఉంది. ఈ పది రోజులు కీలకం. ప్రచారంలో, ప్రజలను కలవడంలో మిగిలిన పార్తీలకంటే ముందుండాలి.

కొన్ని గ్రామాల్లో స్పందన చూస్తె 1983లో ఎన్టీఆర్కు లభించిన ఆదరణ ఈ సారి కెసిఆర్ కు లభించ బోతున్నాదా అన్న అభిప్రాయం కలుగుతున్నది. అయితే ప్రత్యర్థులు ముదుర్లు. ధన సంపన్నులు. చివరి రోజుల్లో తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయడానికి సర్వ శక్తులూ ఒడ్డుతారు. వారిని తెలంగాణా వాదులే ఎదుర్కోవాలి. నల్లగొండలో ఈ సారి ఆశ్చర్యకరమైన ఫలితాలు చూడ బోతున్నారని జిల్లాలో సర్వే నిర్వహిస్తున్న ఒక విశ్లేషకుడు చెప్పారు.

పదే పదే పార్టీలు మార్చిన ఒక నాయకుడు ఇండిపెండెంట్ గా పోటీకి దిగి ఒక గ్రామానికి వెళ్ళాడు. పదిమందిని పోగేసి కొత్త కండువా కప్పబోయాడు. ‘ఎన్ని కండువాలు మర్చుతావు నాయనా? మొన్ననే వై సీ పీది కప్పితివి. నాలుగు రోజులకిండా భాజపా కండువా కప్పితివి. ఇప్పుడేమో ఇంకేదో కండువా దెస్తివి. ఎందుకు మా పనులు చెడ గొడతావ్’ అని ఓ పెద్ద మనిషి ముఖం మీద కడిగేసిండు.

ప్రజలు సామాన్యులే కానీ అమాయకులు మాత్రం కాదని వారితో మాట్లాడితే అర్థం అవుతోంది. ‘అయిదేళ్లకోసారి వచ్చి అప్పటికప్పుడు సంతూర్ సబ్బు కొనుక్కుని స్నానం చేసి పోయేవాడు మాకెన్దుకయ్యా?’ అని ఒక రైతు ప్రశ్నించాడు. వారంతా గతంలో ఆయా అభ్యర్థులకు, ఆయా పార్టీలకు ఓటు వేసినవారే.

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

One Response to తెలంగాణాలో గులాబీ ప్రభంజనం రాబోతోందా?

  1. uttam says:

    Meersnnadi nutiki nurupalla nijam but konni places lo sarigga trs shrenulu campaign cheyyatledu ante vere party lu house to house campaign chestunnaru adi cheste baguntadi malkajgiri baga conc cheyyali for m.p

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s