‘రాని పదవి బీసీలకు, వచ్చే పదవి నాకు’


గాలికి పోయే పేల పిండి కృష్ణార్పణం

naidu-animal647x450

ఆయన కొనసాగితే ఆంధ్ర పెత్తనం కొనసాగినట్టే. ఆయనకు ఓటేస్తే ఆంధ్ర పెత్తనానికి ఓటేసినట్టే. ఆయన పార్టీలో ఉంటే ఆంధ్ర పెత్తనానికి బానిసత్వం చేస్తున్నట్టే.

‘తెలంగాణలో ఇంకా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వెంట ఉన్నవారిని చూస్తుంటే తెలంగాణ పోరాటం ఇంకా కొనసాగాల్సిన అవసరం కనిపిస్తున్నది. టీఆరెస్ మరింత బలపడాల్సిన అవసరం కూడా కనిపిస్తున్నది’ అని ఒక పత్రిక సంపాదకుడు చేసిన వ్యాఖ్య ఇది. రాష్ట్ర విభజన జరిగినా చంద్రబాబునాయుడు హైదరాబాద్‌ను వదిలేట్టు లేడు. హైదరాబాద్‌ను ఆయనే అభివృద్ధి చేశాడట. దానిని ఎవరూ దోచుకోనివ్వడట. హైదరాబాద్‌ను దోచుకోడం మొదలు పెట్టిందే చంద్రబాబునాయుడు.

హైదరాబాద్‌లో ఉన్న 17 ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి, వాటి భూములను అమ్మేసి, వచ్చినడబ్బంతా బొక్కేసింది చంద్రబాబు కాలంలోనే. హైదరాబాద్‌ను సీమాంధ్ర కాలనీగా మార్చిన మహానుభావుడు చంద్రబాబే. 610 జీవో అమలు కాకుండా చూసిందీ ఆయనే. తెలంగాణను ఎండబెట్టిందీ, వేలాది మంది రైతుల ఆత్మహత్యలు జరుగుతుంటే వ్యవసాయాన్ని గాలికి వదిలేసి, ప్రపంచబ్యాంకు స్క్రిప్టును అమలు చేసిందీ ఈ పుణ్యాత్ముడే.

‘వ్యవసాయంమీద సంవత్సరానికి 36 వేల రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నట్టు’ ప్రకటించినంచే రైతుబిడ్డ 1997 కల్లా హెరిటేజ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకుందీ ఆకాలంలోనే. ‘తెలంగాణలో రాని ముఖ్యమంత్రి పదవిని బీసీలకు ఇస్తాడట. సీమాంధ్రలో వచ్చే అవకాశం ఉన్న పదవిని మాత్రం ఆయన ఉంచుకుంటాడట. గాలికి పోయే పేల పిండిని కృష్ణుడికి అర్పించినట్టు, ఈయనగారు ముఖ్యమంత్రి పదవిని బీసీలకు సమర్పిస్తాడట. చంద్రబాబు మాయల మరాఠీ. ఎవరు నమ్ముతారు?’ అని రాజకీయ విశ్లేషకుడొకరు అన్నారు.

‘బీసీ ముఖ్యమంత్రి పదవి ఆశచూపి తెలంగాణలో తన ఆనవాళ్లు కాపాడుకోవాలని చంద్రబాబు చూస్తున్నడు. ఆయన కొనసాగితే ఆంధ్ర పెత్తనం కొనసాగినట్టే. ఆయనకు ఓటేస్తే ఆంధ్ర పెత్తనానికి ఓటేసినట్టే. ఆయన పార్టీలో ఉంటే ఆంధ్ర పెత్తనానికి బానిసత్వం చేస్తున్నట్టే’ అని సీనియర్ జర్నలిస్టు ఒక టీవీ చానెల్‌లో బాహాటంగానే చెప్పాడు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s