అద్వానీ ఎందుకు భయపడుతున్నారు?


ఒక నాయకుడు, ఒక ‘హిట్లరు’

advani8380

గాంధీనగర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఎన్నికవుతూ వస్తున్న బిజెపి అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ ఈ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? నరేంద్రమోడిని నమ్ముకుని ఎన్నికలలో దిగలేకనా లేక మరేదైనా కారణం ఉందా? భోపాల్ తనకు సురక్షిత స్థానమని అద్వానీ ఎందుకనుకుంటున్నారు? ప్రధాని పదవికి పోటీ లేకుండా చేయడం కోసం మోడీ తనను ఎక్కడ ఇబ్బంది పెడతాడేమోనన్న భయంతోనే అద్వానీ భోపాల్‌కు మారే యోచన చేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ అద్వానీకి సన్నిహితుడు. అక్కడి నుంచి సురక్షితంగా గెలిచి ఢిల్లీ చేరవచ్చునని అద్వానీ భావిస్తున్నారు. మోడీ తనకు ప్రత్యర్థులనుకునేవారి విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారని, అద్వానీ విషయంలో కూడా ఆయన అలాగే వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాపం అద్వానీ…ఒకప్పుడు బిజెపిని తన చుట్టూ తిప్పుకున్న నాయకుడు ఇప్పుడు తన సీటుకోసం నానా పాట్లూ పడాల్సి వస్తోంది. ఒక్క అద్వానీయే కాదు మురళీమనోహర్ జోషీ కూడావారణాసి సీటు మోడీకోసం ఖాళీ చేయాల్సి వచ్చింది. నాయకుడుగా ఆయన దీక్షాదక్షతలకు వీటిని నిదర్శనంగా చెప్పేవారు ఉన్నారు. ఆయనలో ఒక హిట్లరు కనిపిస్తున్నాడని విమర్శించేవారూ ఉన్నారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “అద్వానీ ఎందుకు భయపడుతున్నారు?”

  1. i think advaani`s era is coming to an end,or we can say it is a closed chapter.he has to accept this harsh truth.he opposed several issues,but within no time,he compromised.he is no more a commander,now the time has come to keep himself away from the politics.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s