రేవంత్‌రెడ్డికి ఏమైంది?


Dogs tail cannot be mended!

కట్టా మీఠా

తెలంగాణ తెలుగుదేశం నాయకులు రోజూ పొద్దున్నే కడుపులో విషం, పుక్కిట విద్వేషం నింపుకుని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లకు వస్తున్నారు. సమయం సందర్భం ఏదీ అక్కరలేకుండా ఎవరిమీద పడితే వారి మీద ఇంత చిమ్మేసి, కుమ్మేసి, టీవీ కెమెరాల ముందు వికటాట్టహాసం చేసి వెళ్లిపోతుంటారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన చరిత్ర ఉన్న రేవంత్‌రెడ్డి కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయారు. తెలంగాణ ఉద్యమకారులపై చంద్రబాబు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఆయన రోజింత బురదజల్లుతున్నారు. తెలుగుదేశంలో చేరాక తెలంగాణకోసం కొట్లాడింది లేదు. మాట్లాడింది లేదు. ఒక్క రోజు వీధుల్లోకి వచ్చింది లేదు. కనీసం నోరుమూసుకు కూర్చున్నా మర్యాదగా ఉండేది. కానీ చంద్రబాబు మెప్పు పొందడంకోసం చేయకూడని విమర్శలన్నీ చేస్తున్నారు. ఇట్లా అడ్డగోలుగా మాట్లాడినోళ్లంతా చరిత్రలో చంద్రబాబులాగా మిగిలిపోతారని మన అనుభవమే చెబుతున్నది. బ్లఫ్ కెనాట్ విన్ ఎ మ్యాన్. చంద్రబాబును ఎన్‌టిఆర్‌ను బ్లఫ్ చేసిన పాపమే ఇంకా వదలలేదు. ఇప్పుడు తెలంగాణను కూడా అలాగే బ్లఫ్ చేయాలని చూస్తున్నాడు. రేవంత్‌రెడ్డి వంటి యువ నాయకులు సైతం చంద్రబాబు తరహా రాజకీయాల్లో కొట్టుకుపోతున్నారు. శుక్రవారం టిజేఏసీ నాయకుడు కోదండరామ్‌పై ఆయన చేసిన విమర్శలు విస్మయం కలిగిస్తున్నాయి. కోదండరామ్ రాజకీయ నాయకుడు కాదు. ఉద్యమశక్తులకు నాయకునిగా ఆయన అన్ని పార్టీల నేతలనూ కలుస్తున్నారు. కాంగ్రెస్ నేతలనూ కలుస్తారు. అందులో తప్పేమిటో. ఉద్యమాన్ని తాకట్టు పెడుతున్నారట. విందుల్లో తేలియాడుతున్నారట.

ఎవరు చేసిన ఉద్యమం తాకట్టుపెట్టారు?
మీరెప్పుడైనా ఉద్యమాలు చేశారా? కనీసం ఉద్యమాల్లో…

View original post 23 more words

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “రేవంత్‌రెడ్డికి ఏమైంది?”

  1. revanth reddy along with several t.tdp leaders are using abusive language,in criticising kcr.it shows their frustration and heiplessness.they are jealous of kcr.as a political rival anyone can comment on any party,mr naidu is the captain of defeated battle,he is encouraging these puppets to demoralise and unpopular kcrs stature.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s