కేసీఆర్ ఏం చేశారు?


What is that KCR done to Telangana?

కట్టా మీఠా

సమైక్యవాదులు లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు
అనునిత్యం కేసీఆర్‌ను ఆడిపోసుకుంటుంటారు.
టిజి వెంక సాకే శైలజానాథ్‌లూ కేసీఆర్‌నే దుయ్యబడుతుంటారు.
దేవినేని ఉమ, పయ్యావుల కేశవ్‌లూ కేసీఆర్‌నే విమర్శిస్తుంటారు.
తెలంగాణ బిడ్డలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి కూడా కేసీఆర్‌పైనే
ఒంటికాలుమీద లేస్తుంటారు.
తెలంగాణకోసం ఉద్యమాలు చేస్తున్నామని చెప్పే కొన్ని సంఘాలవాళ్లూ
కేసీఆర్‌పైనే దాడి చేస్తుంటారు.
తెలంగాణకు హక్కుదారులుగా చెప్పుకునే డికె అరుణ, రేణుకాచౌదరి
వంటి వాళ్లూ కేసీఆర్‌పైనే విసుర్లు ఎక్కుపెడుతుంటారు.
ఎందుకిలా జరుగుతోంది? వేర్వేరు పార్టీలు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన అంద రి ఉమ్మడి లక్ష్యం కేసీఆర్ ఒక్కరే కావడంలోని అంతరార్థం ఏమిటి? ఇంతమందికి కేసీఆర్ శత్రువు ఎందుకయ్యారు? కేసీఆర్ నిజంగా ఇటువంటి విమర్శలకు పాత్రుడేనా? ఇంతమంది దీవెనలతో కేసీఆర్ బలపడుతున్నారా? బలహీనపడుతున్నారా? తెలంగాణ ఆకాంక్షలకు కేంద్రబిందువు కావడమే ఆయనను విమర్శలకు కేంద్రబిందువును చేసిందా? ఇటీవల జరిగిన ఒక మిత్రగోష్టిలో సీమాంధ్ర ప్రాంతానికి చెంది న సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ కేసీఆర్‌పై చేసిన విశ్లేషణ ఈ సందర్భంగా గుర్తు చేయదల్చుకున్నాను. ఆయన రాష్ట్ర రాజకీయాలను గురించి, వివిధ పార్టీల అగ్రనేతలను గురించి వర్ణిస్తూ, ఇంతమంది విమర్శలకు కేసీఆర్ ఎందుకు కేంద్రబిందువు అయ్యాడో వివరించాడు.
‘‘కేసీఆర్ ఏం చేశాడని పదే పదే మాట్లాడతారు టీడీపీ వాళ్లు. కేసీఆర్ తెలంగాణ కు పది తరాలకు సరిపోను నాయకులను తయారు చేశారు. తెలంగాణ సమాజాన్ని ఒక అస్తిత్వ కేతనంగా తీర్చిదిద్దారు. మా(సీమాంధ్ర) నాయకులూ ఉన్నారు. ఒక్కడు అరగంట కూడా సరిగా…

View original post 747 more words

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s