బిల్లుకు వ్యతిరేకంగా బిజెపి-టీడీపీ కుట్ర?


‘టీడీపీ, బిజేపీ ఉమ్మడిగా ఈ నాటకం నడిపించినట్టుగా కనిపిస్తున్నది. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు బిజెపితో, టీడీపీతో మాట్లాడుకుని తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి కావాలని ఇవ్వాల సభలో ఈ దుర్మార్గానికి దిగారు. లేకపోతే సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు పరువు తీయడం ఏమిటి? వారికి మద్దతుగా బిజెపి అగ్రనాయకత్వం మాట్లాడడం ఏమిటి?’ అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రశ్నించారు.

image
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ప్రతిపాదించారు.
స్పీకర్ చెప్పారు. హోంమంత్రి షిండే బిల్లును చేశారు.
సీమాంధ్ర ఎంపీలు ఉభయసభల్లో అలజడి సృష్టిస్తారు.
సభ వాయిదా పడుతుంది.
పార్లమెంటు పరువుపోయిందని అన్ని పార్టీల అగ్రనేతలూ వాపోతారు.
అల్లరికి దిగిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తారు.
కానీ విచిత్రంగా అదే నేతలు అల్లరికి దిగిన సభ్యులకు మద్దతుగా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రకటనలుచేస్తారు.
సభ ముగిసిన వెంటనే, సుష్మాస్వరాజ్ బిల్లును అసలు సభలో ప్రవేశపెట్టనే లేదని అన్నారు. ఆ తర్వాత మాటమార్చి బిల్లును ప్రవేశపెట్టే పద్ధతి ఇది కాదని వాదిస్తారు.
లాల్‌కృష్ణ అద్వానీ ఓట్ ఆన్ అకౌంట్ బిల్లు తప్ప ఏ బిల్లూ ఈ సభ చేపట్టలేదని చెబుతారు.
రాజ్‌నాథ్ ఇటువంటి వాతావరణంలో బిల్లు ఎలా తెస్తారని ప్రశ్నిస్తారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన, సీమాంధ్ర ఎంపీలు ఇలా బిల్లు ఎలా పెడతారని నిలదీస్తారు.
చంద్రబాబునాయుడు ఢిల్లీలోనే ఉంటారు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో ఉంటారు.
‘టీడీపీ, బిజేపీ ఉమ్మడిగా ఈ నాటకం నడిపించినట్టుగా కనిపిస్తున్నది. సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు బిజెపితో, టీడీపీతో మాట్లాడుకుని తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి కావాలని ఇవ్వాల సభలో ఈ దుర్మార్గానికి దిగారు. లేకపోతే సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటు పరువు తీయడం ఏమిటి? వారికి మద్దతుగా బిజెపి అగ్రనాయకత్వం మాట్లాడడం ఏమిటి?’ అని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఒకరు ప్రశ్నించారు.
బిజెపి అగ్రనాయకత్వం, సీమాంధ్ర టీడీపీ ఎంపీలు, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అంతా కూడబలుక్కున్నట్టు మాట్లాడుతున్నారని గురువారం పార్లమెంటు లోపల, బయట జరిగిన పరిణామాలను గమనిస్తే ఎవరికయినా అనిపిస్తుంది.
జిహాదీలు పార్లమెంటుపై బయటి నుంచి దాడి చేస్తే, సీమాంధ్ర ఎంపీలు పార్లమెంటులోపలే దాడులకు దిగారు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “బిల్లుకు వ్యతిరేకంగా బిజెపి-టీడీపీ కుట్ర?”

  1. manushula raktham thagi rajkeeyalu chese BJP inthaa kanna goppaga behave chesthadani ankovadam pedda thappu

  2. Dear shekar, I’m completely in agreement with the message in your blog. It is a terrible situation. I am terribly disturbed. What do we do now? Let’s all think of a solution now in the context of today’s reality.

  3. Babu firmly believes that everyone has a price & we can buy if we pay the cost. A rumour is doing rounds that Seemandhra politicians & businessmen have collectively bought BJP for 2000crores.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s