పెద్ద పార్టీల బహుపాత్రాభినయo


వస్తే జై తెలంగాణ, రాకపోతే క్విట్ తెలంగాణ!

ప్రధాని తెలంగాణ బిల్లు ఆమోదించి తీరతామంటాడు. చిదంబరం బిల్లులు ఆమోదం పొందడం అనుమానమే అంటాడు. అడ్డంగా మాట్లాడే కిరణ్ నిశ్చింతగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఢిల్లీలోనే దీక్షకు దిగుతాడు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీపై దండయాత్ర చేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు లేస్తే మనుషులం కాదంటారు.
image
తెలంగాణకు మద్దతు ఇచ్చే విషయంలో తేడా లేదని పదేపదే చెబుతున్న సుష్మాస్వరాజ్, ఓట్ ఆన్ అకౌంట్ తప్ప ఇన్ని బిల్లులు ఈ సభలో ఎలా ప్రతిపాదిస్తారని సభా సలహా సంఘం సమావేశంలో కమల్‌నాథ్‌ను ప్రశ్నిస్తారు. వెంకయ్యనాయుడు రాజ్యసభలో అకారణంగా, అసందర్భంగా ఉపాధ్యక్షునిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బిల్లును ఇంకా సభ ముందుకు తేకముందే, మత హింస బిల్లుకు వ్యతిరేకంగా బిజెపి ఎంపీలు నినాదాలు చేస్తుంటారు.

చంద్రబాబునాయుడు బిల్లును అడ్డుకోవడానికి ఎక్కని గడప దిగని గడప లేదు. సీమాంధ్ర టీడీపీ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ నేతల కాళ్లకు వేళ్లకు అడ్డం పడతారు. తెలంగాణ టీడీపీ ఎంపీలు ఇరుప్రాంతాల వారిని కూర్చో బెట్టి మాట్లాడించాలంటారు. తెలంగాణ వెంటనే ఇచ్చేయాలంటారు.

అన్ని పార్టీల రంగులు తేటతెల్లమయ్యే కాలం సమీపించింది. అందరి నిజాయితీ పరీక్షకు నిలబడే సమయం వచ్చేసింది.

ప్రజాస్వామ్యమా, మెజారిటీ మూక స్వామ్యమా తేలవలసి ఉంది.

వస్తే జై తెలంగాణ, రాకపోతే క్విట్ తెలంగాణ!

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

2 thoughts on “పెద్ద పార్టీల బహుపాత్రాభినయo”

  1. Dear sir
    BJP’s basic principle is “equality before law & no differentiation among indian citizens. Then why are they advocating special rights for seemandhra people in hyderabad. Are they mad or they in “vipareetha” budhi as the “vinaasha” kaalam is approaching them?
    Dr. M. V. .Rajendra

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s