ఆంధ్ర పత్రికలకు అవమానం, నమస్తే తెలంగాణకు ఆదరణ


Down fall of Andhra Media and the rise of Namasthe Telangana

Big-Daily-read-GrandeJourna

ఇండియన్ రీడర్‌షిప్ సర్వే-2013 ఫలితాలను ఇటీవల ప్రకటించారు. గత ఏడాది కాలంలో పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచుకున్న ఏకైక పత్రిక నమస్తే తెలంగాణ అని, ఈనాడుతో సహా మిగిలిన పత్రికల పాఠకుల సంఖ్య అసాధారణ రీతిలో తగ్గిపోయిందని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఈనాడు దినపత్రిక తమ పాఠకుల సంఖ్య అందరికంటే ఎక్కువ అని మొదటి పేజీలో ప్రకటించుకుంది. అందరికంటే ఎక్కువన్నది వాస్తవమే అయినా ఆ పత్రిక ప్రతిష్ఠ నానాటికీ ఎలా దిగజారుతున్నదన్నది మాత్రం ఆ పత్రిక ప్రకటించుకోలేదు.
IRS-2005-13 Final

ఆ పత్రిక సంచిక సగటు పాఠకుల సంఖ్య 2005లో 87.7 లక్షలు ఉండగా 2013 నాటికి అది 53.10 లక్షలకు పడిపోయింది. అంటే ఆ పత్రిక పాఠకుల సంఖ్య 34.6 లక్షలు క్షీణించింది. అంతదూరం కూడా అక్కర లేదు-2012లో ఆ పత్రిక సగటు పాఠకుల సంఖ్య 59.57 లక్షలు కాగా గత ఒక్క ఏడాది కాలంలోనే 6.47 లక్షలు తగ్గి 53.10 లక్షలకు చేరింది. ఒక పత్రిక సగటు పాఠకుల సంఖ్య ఒకే ఏడాది ఇంత గణనీయంగా పడిపోవడం ఒక రికార్డు. ఇది ఆ పత్రికకు పాఠకుల్లో తగ్గుతున్న విశ్వసనీయతను తెలియజేస్తున్నది.

అలాగే సాక్షి, ఆంధ్రజ్యోతి సగటు పాఠకుల సంఖ్య కూడా అసాధారణరీతిలో తగ్గింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈ పత్రికలు అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణి కూడా ఈ పత్రికల పాఠకుల సంఖ్య తగ్గడానికి దోహదం చేసి ఉంటుంది. గత ఏడాది కాలంలో ఒక్క నమస్తే తెలంగాణ పత్రిక సగటు పాఠకుల సంఖ్య మాత్రమే పెరిగింది. గత ఏడాది కాలంలో నమస్తే సగటు పాఠకుల సంఖ్య 52 వేలు పెరిగి, తెలంగాణలో సగటు పాఠకుల సంఖ్య 5.8 లక్షలకు చేరింది. నిరంతరాయంగా ఎదుగుతున్న పత్రిక ఒక్క నమస్తే తెలంగాణ మాత్రమే. ఆంధ్ర పత్రికల నుంచి విముఖులైన పాఠకుల్లో అత్యధికులు న్యూస్ చానెళ్లకు మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “ఆంధ్ర పత్రికలకు అవమానం, నమస్తే తెలంగాణకు ఆదరణ”

  1. కొత్త వింత పాత రోత తెలిసిందే కదా. వచ్చిన కొత్తలో ఈనాడు కూడా ఈ విధంగానే జబ్బలు చరుచుకునేది. పత్రికా పాఠకులు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ఇదంతా సర్వసాధారణం.మనం అప్పుడే గొప్పలు పోవద్దు.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s