ఆయన పార్టీ గురించి విన్నవీ కన్నవీ


images

‘ఆయన మునుపు అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. వయసులో పెద్దవారిని అన్నా…అన్నా అని సంబోధించేవారు. ఇప్పుడు మిస్టర్..మిస్టర్ అని మాట్లాడుతున్నాడు’.

‘ఆయన తన పక్కన ఎవరయినా కూర్చోవడాన్ని సహించలేకపోతున్నారు… సీనియారిటీ గీనియారిటీ ఏమీ లేదు… అందరూ ఒక్కటే అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు. చివరికి చెల్లెను సైతం దూరం పెట్టారు. తన కంటే ఎత్తున్న నాయకులను తన పక్కన నిలబెట్టుకోవడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదు…’

‘గతంలో ఆయన స్థాయీభేదం లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించేవాడు. ఇప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ స్థాయోల్లయితేనే దగ్గరకు తీసి మాట్లాడుతున్నారు. అది కూడా వారి ఆర్థిక నేపథ్యం చూసి మాట్లాడుతున్నారు. కిందిస్థాయిలో పనిచేసే మాలాంటి వారిని పట్టించుకోవడం లేదు. రేపు ఓట్లేయించేదెవరు?’.

‘పెద్దాయనమీద ప్రేమ, ఆ కుటుంబం మీద అభిమానంతో పార్టీలో చేరి మొదటి నుంచి పనిచేస్తున్నవారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. డబ్బు సంచులు తీసుకుని వచ్చేవారికి రాచబాట వేస్తున్నారు. అడ్డదారిలో దొడ్డిదారిలో సంపాదించినవారు వైసీపీలోకి వచ్చి ఎంతయినా ఖర్చుపెట్టడానికి సిద్ధపడుతున్నారు. అంకితభావంతో పనిచేసిన మాలాంటివారిని పక్కన బెడుతున్నారు’.

‘‘ఎన్నికల్లో పోటీచేయాలని ఆశించి వెళితే ముందుగా ‘ఎంతఖర్చు పెడతావు?’ అని ప్రశ్నిస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి వచ్చేవాడు కోట్లు సంపాదించకుండా ఎలా ఉంటాడు? ఆయనలాగా అందరమూ సంపాదించుకోలేము కదా. ఆయన రాజకీయ పార్టీని నడిపిస్తున్నట్టు లేదు, కంపెనీని నడిపిస్తున్నట్టుగా ఉంది.’’

‘గతంలో ఆయనకు బాగా సన్నిహితంగా ఉన్న ఒక సీనియర్ నాయకుడు, అనేక రాజకీయ యుద్ధాలను చూసిన తలపండిన నేత ఒక సభలో ఆయనను ఆప్యాయంగా పేరు పెట్టి పిలిచారు. ఆయన ఆగ్రహించి ‘కాల్ మి సర్’ అని అంత పెద్దమనిషిని గద్దించాడు’.

‘ఎన్‌టిఆర్ చాలా మంది కొత్త తరం నాయకులను, బీదబిక్కీ జనాన్ని రాజకీయాలకు పరిచయం చేశారు. ఈయన ధనవంతులను, అగ్రకులాలవారిని, ఇప్పటికే పేరుమోసిన వారిని నెత్తికెక్కించుకుంటున్నారు. బీదబిక్కి జనం ఆయన ఛాయల్లోకి వెళ్లే అవకాశమే లేదు. సంఘసేవా కార్యకర్తలకు, ఆదర్శవాదులకు అక్కడ స్థానం లేదు’.

‘ఆయనను ఎవరూ నాశనం చేయనక్కరలేదు. ఆయనను ఆయనే నాశనం చేసుకోగలరు. ఆయనకు రకరకాల కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అంతులేని అహంభావం ఉంది. భయాలూ ఉన్నాయి. ఆయన ఎవరితోనూ ఎక్కువ కాలం కలసి పనిచేయలేరు. నమ్మినవాళ్లను నడిమధ్యలో వదిలేయడం ఆయనకు అలవాటుగా మారింది. చాలా మంది నమ్మకమైనవాళ్లు ఇప్పటికే దూరమవుతున్నారు. పెద్దాయనకు ఈయనకు పోలికే లేదు.’

Advertisements

About kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad
This entry was posted in Political Commentary. Bookmark the permalink.

2 Responses to ఆయన పార్టీ గురించి విన్నవీ కన్నవీ

 1. Reblogged this on Words of Venkat G and commented:
  Last time Chiranjeevi Ran his Company and Sold it Post Election
  Now Jailed Jagan on Bail is Running another Company 2 b on Sales Post Elections

  Like

 2. Janaiah Boddupally says:

  Sir, This is Excellent about Jagan Babu What I think about Jagan and Co..I have been listening about Jagan from 2004 reflects your article.

  Janaiah Boddupally
  Asst. Professor
  M.V.S.R.Engg College
  State EC Member, TLF

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s