రాయల తెలంగాణ కాదు రెడ్ల తెలంగాణ?


కాంగ్రెస్ మెడకు రాయల ఉరి

రాయల తెలంగాణ దేనికోసం? ఎవరి ఆధిపత్యాన్ని కాపాడడంకోసం? ఎవరిని బుజ్జగించడంకోసం? ఈ ప్రశ్నలకు ఎటునుంచి సమాధానం వెదకినా రెడ్లకోసమనే సమాధానం వస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక వర్గం, రాయలసీమ కాంగ్రెస్‌లోని ఒక వర్గం పథకం ప్రకారమే రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చాయని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు.

రాయల తెలంగాణ ఆలోచన ఇప్పటికిప్పుడు పుట్టింది కాదని చాలా కాలం ముందు నుంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇప్పుడు అర్థం అవుతున్నది. గ్రామ పంచాయతీలతో తీర్మానాలు చేయించడం, ఎమ్మెల్యేల సంతకాలు సేకరించడం, వీటిని కేంద్రానికి సమర్పించడం అంతా ఈ పథకంలో భాగమేనంటున్నారు. జగన్, చంద్రబాబు, కేసీఆర్‌లను కట్టడి చయాలంటే రాయల తెలంగాణ ఉత్తమమని దానిని సమర్థిస్తున్నవారు కేంద్రానికి నూరిపోశారట.

image

కానీ కాంగ్రెస్ తన మెడకు తానే ఉరి బిగించుకుంటున్నదన్న సంగతి గుర్తించలేదు. కేసీఆర్ రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది అదనుగా ఆయన తెలంగాణలో మరింత బలపడడానికి, రాజకీయ శక్తులను సమీకరించుకోవడానికి ప్రయత్నిస్తారు. జేయేసీలు కూడా కేసీఆర్‌తోపాటే ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. బిజెపి లేక వామపక్షాలతో పొత్తుపెట్టుకోవడానికి కేసీఆర్‌కు మార్గం సుగమమవుతుంది.

సీమాంధ్ర పెత్తనం నామరూపాలు లేకుండా పోవాలంటే టీఆరెస్‌నే గెలిపించాలని ఆయన తెలంగాణ అంతటా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి అవకాశం చిక్కుతుంది. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చి కూడా దోషిగా నిలబడవలసి ఉంటుంది. రాయల తెలంగాణను సమర్థించుకోగల కారణాలు కానీ, సమర్థ నాయకత్వం గానీ కాంగ్రెస్‌లో లేదు.

మరోవైపు టీడీపీ, వైఎస్సార్‌సీపీలు మనుగడ కొనసాగించడానికి రాయల జిల్లాలు దోహదం చేస్తాయి. రాయల జిల్లాల్లో ఆ పార్టీల బలాన్ని ఆసరాగా చేసుకుని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ దాకా పోరాడవచ్చునని తెలంగాణ జిల్లాల్లోని వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు కూడా ఆశలు పెంచుకునే అవకాశం ఉంది. బహుముఖ పోటీలో 119 స్థానాలు ఉన్న తెలంగాణలో ఎవరికి మేలు జరుగుతుందో సులువుగానే ఊహించవచ్చు. అతి తెలివి కాంగ్రెస్‌కు, రెడ్లకు ఇద్దరికీ మేలు చేయదు.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

One thought on “రాయల తెలంగాణ కాదు రెడ్ల తెలంగాణ?”

 1. 100 % కతం కాంగ్రేస్ !

  కాంగ్రేస్ ” అతిఆశ కొంపకు చేటు ”
  ఎవరి పాపం వారినే వెంటాడుతుంది ..
  తాను తీసుకున్న బొందలో తనేపడుడు అంటే దీనే అంటారు !
  పాపం రెండు జిల్లాలలోని రాయల సామాన్య ప్రజలు ..
  మరో పాలస్తీనా వాసులుగా gurtimpu kaaboatunnaaru .. .
  =========================================================
  @@@ తస్మాత్ రాయల ప్రజలారా ..

  మీ ఉనికికే ప్రమాదం పొంచిఉంది ..
  పాపం ! రాయల ప్రజల జీవితాలతో ఈ పాపపు పాలకులు నాటకాలు ఆడుతున్నారు ..
  ఈ పాపపు రాజకీయాలకు రాయల ప్రజలు భలి పశువులు కాబోతున్నారు ..
  ఈ పార్టీల కుట్రలకు అమయక రాయల ప్రజలను తెలంగాణ వారికి శతృవులను చేస్తున్నారు ..
  తెలంగాణ పదిజిల్లాల ప్రజలతో రాయల ప్రజలు ఇక శాశ్వత శతృవులుగా మారిపోతారు ..
  ఆంధ్ర నాయకులు మన మధ్యన తగువు పెట్టి తమాష చూడబోబోతున్నారు ..
  ఇక తెలంగాణ ప్రజలు రాయల ప్రజలను తెలంగాణలో మైనార్టీలుగానే బావిస్తారు ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s