ఢిల్లీలో చెల్లనిది హైదరాబాద్‌లో చెల్లుతుందా?


371(హెచ్) వృథాప్రయాస

తెలంగాణ వ్యతిరేక కుట్రలకు 371(హెచ్) మరో ఉదాహరణ. హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను కట్టడి చేయడానికి ఇటువంటి ఏర్పాటు అవసరమట. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇటువంటి ఏర్పాటే ఉందట. కానీ అక్కడ ఏం జరిగింది? పది కిలోమీటర్ల మేరకు చైనా సైన్యాలు చొచ్చుకొచ్చినా మనవాళ్లు నిద్రపోతూ ఉండడం గురించి చదువుకోలేదా? ఢిల్లీలో అంతకంటే గొప్ప ఏర్పాటే ఉంది. దేశ రాజధాని కాబట్టి అక్కడ శాంతి భద్రతలు, భూ వ్యవహారాలు… ఇంకా చాలా అంశాలు కేంద్రం తన పరిధిలోనే ఉంచుకుంది. ఢిల్లీలో పేలుళ్లు ఆగాయా? ఉగ్రవాద శక్తుల ఉన్మాదం ఆగిందా? అత్యాచారాలు ఆగాయా?

అంతదూరం ఎందుకు, హైదరాబాద్‌లో మక్కామసీదు పేలుళ్లు జరిగాయి. గోకుల్ చాట్, లుంబిని పార్క్‌లు రక్తసిక్తమయ్యాయి. దిల్‌సుఖ్ నగర్‌లో ఉగ్రవాదుల దాడులకు 16 మంది బలైపోయారు. ఇవన్నీ సమైక్య సర్కారు ఉండగానే, ఇంత బందోబస్తు ఉండగానే జరిగాయి. 371(హెచ్) తెచ్చి జీహెచ్‌ఎంసీలో భద్రత కల్పిస్తారు సరే తెలంగాణ జిల్లాల్లో స్థిరపడిన ఆంధ్రప్రాంత ప్రజల సంగతి ఏమిటి? ఉన్మాదులు ఎవరయినా హైదరాబాద్‌లో దాడులకు పాల్పడి తెలంగాణలో చొరబడితే ఎవరు ఎవరిని నిందించాలి?

ఆచరణ సాధ్యం కాని, వాస్తవిక దృష్టిలేని ఇటువంటి ఆలోచనలన్నీ చివరికి విషఫలితాలనే ఇస్తాయి. శాంతిభద్రతలను తెలంగాణ చేతుల్లోంచి లాక్కోవడం అంటే తెలంగాణను అవమానించడమే కదా? తెలంగాణ వాళ్లు బాధ్యతగా వ్యవహరించలేరు అని చెప్పడం కాదా? కేంద్రం ఇటువంట ఆలోచనలు మానుకోవాలి. సంపూర్ణ తెలంగాణ ఏర్పాటు చేయాలి.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s