సాగు నీరే సంపదల సృష్టికర్త


వాన జోరు, ప్రవాహ ఝరి, అలల హోరు గొప్ప అనుభూతినిస్తాయి.
గలగలా పారేటి కాలువ నా స్వప్నం.
ఆ స్వప్నం నిజమైతే…

నీళ్లు చూడగానే నేను చిన్న పిల్లవాడినై పోయాను. నీళ్లలో దిగి ఆడకుండా ఉండలేకపోయాను. శుభాలన్నీ కట్టకట్టుకుని మా ఊరికి వచ్చిన ఆనందం.‘ఊరు కళకళలాడుతోంది. వచ్చి చూసిపోండి బాబాయ్’ అన్న మా శ్రవణ్ పిలుపు ఊరికి రావడానికి ప్రేరణ. ఎన్నో ఏళ్లు గా వాన చినుకుల కోసం నోళ్లు తెరుచుకున్న బీడు భూములు ఇప్పుడు జలరాశులతో కళకళలాడుతున్నాయి. ఎటుచూసినా పచ్చని పంట పొలాలు. పొలాల్లో పనులు చేస్తూ రైతులూ, కూలీలూ లీనమైపోయారు. అక్కడక్కడా నాట్ల పాటలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్లుగా పాడుబడిపోయిన పొలాల ను ఇప్పుడు సాగులోకి తెచ్చేందుకు ట్రాక్టర్లతో దున్నుతున్నారు కొందరు రైతులు. ఊరెళితే విధిగా నన్ను కలిసే మిత్రులు కూడా హలో చెప్పి, పొలా ల్లో జరుగుతున్న పనులు గుర్తు చేసి పరుగులు తీస్తున్నారు. వీధుల్లో ఏ పనులూ చేయడం చేతకాని వయోవృద్ధులు తప్ప ఎవరూ కనిపించలేదు. భారీ వర్షాలు వచ్చి రెండు చెరువులూ నిండి అలుగులు పోస్తున్నాయి. అం త కంటే ఆనందం కలిగించే విషయం మా ఊరికి స్వాతంత్య్రం వచ్చిన ఆరున్నర దశాబ్దాల తర్వాత సాగర్ కాలువ నీళ్లొచ్చాయి. మా ఊరి చెరువులు భారీ వర్షాలకు నిండడం పదమూడేళ్ల తర్వాత తిరిగి ఇదే. మా చెరువులు నిండడమే కాదు, మా చెరువుల అలుగుల ప్రవాహ ధాటి కి కుక్కడం చెరువు కూడా నిండి కట్ట తెగిపోయింది. గత పదమూడేళ్లలో తిప్పర్తి మండలం చాలా సంవత్సరాలు కరువు మండలాల జాబితాలో ఉంటూ వచ్చింది. తాగడానికి నీళ్లుకూడా దొరికేవి కాదు. ఉదయ సముద్రం నుంచి పైపు లైను వేసిన తర్వాత తాగునీటి సమస్య తీరిపోయింది. కానీ బావులన్నీ బావురు మంటున్నాయి. ఒకప్పుడు నిండుకుండల్లా ఉన్న బావులు, మేమంతా ఈతలు కొట్టిన బావులు కూలి శిథిలమై పోయాయి. బోర్లు ఎండిపోయా యి. కొందరి రైతుల బత్తాయి తోటలు నీళ్లందక ఎండిపోయాయి. కొందరు రైతులు ఇక నీళ్లు రావని నిరాశ దుఃఖంతో తోటలు నరికేసుకున్నారు.

image

image

ఇటువంటి తరుణంలో మా ఊరికి సాగర్ కాలువ వచ్చింది. కాలు వ ఇంకా పూర్తి కాలేదు. కానీ రైలు కట్ట, నార్కెట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారులను దాటించి మా ఊరికి చెరువులోకి తీసుకురావాలి. ఈ రెండు అవాంతరాలను దాటిస్తే నల్లగుంట చెరువు, పెద్దడ్డి చెరువులతో పాటు మరో 13 చెరువులు నిండుతాయి. పదహారు గ్రామాలు జలకళతో కళకళలాడుతాయి. ఆ రెండు చోట్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. మన వాళ్లకు నీటివిలువ ఇప్పటి కీ తెలియడం లేదు. సాగునీరు లేక ఎంత నష్టపోయామో, ఒక్కొక్క సీజను ఆలస్యమయ్యే కొద్దీ ఎంత నష్టపోతున్నామో అటు పెద్ద నాయకులు గానీ, ఇటు గ్రామాల నాయకులూగానీ గుర్తించడం లేదు. కాంట్రాక్టర్లకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆలస్యమయ్యే కొద్దీ ఎస్కలేషన్ రేట్లు పెంచుకునే అవకాశం వారికి ఉంది. కానీ రైతులకే నష్టపోయిన జీవితం మళ్లీ వచ్చే అవకాశం లేదు. రైలు కట్ట, జాతీ య రహదారు ల్లో పనులు పూర్తి కాలేదు కాబట్టి తాత్కాలికంగా రైలు కట్ట వెంట కాలువ తీసి, పాత కల్వర్టుల ద్వారా మళ్లించి మాడ్గులపల్లి చెరువునింపి, అటునుంచి తెగిపోయి పునరుద్ధరించబడిన కుక్కడం చెరువులోకి నీరు మళ్లించారు. జాతీయ రహదారి పాత కల్వర్టు ద్వారా కుక్కడం చెరువులోకి ప్రవహించే చోట ఆ కాలువ ప్రవాహధ్వని నన్ను ముగ్ధుణ్ని చేసింది. ఆ ప్రవాహం చూస్తూ అక్కడే కూర్చుండి పోవాలనిపించింది. చుట్టూ పొలాల్లో రైతులు దీక్షగా పనిచేసుకుంటున్నారు. పనులు చేసుకుంటూనే పలుకరించి, తిరిగి పనుల్లో మునిగిపోతున్నారు.

ఇంతకీ ఈ కాలువ ఎక్కడిది? దీని పేరేమిటి? ఎక్కడి నుంచి నీరు తెస్తున్నారు? ఇది సాగర్ వరద కాలువ. సాగర్ డ్యాము నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో రిజర్వాయరు వెనుక వైపు నుంచి ఈ కాలువను తవ్వా రు. దీనికి పేరు పెట్టలేదు. కానీ తెలంగాణకు జరిగిన అన్యాయానికి ప్రతీకగా దీనికి ‘నందికొండ కాలువ’ అని పేరు పెట్టుకుంటే బాగుంటుందేమో-జిల్లా నేతలు ఆలోచించాలి. ఈ కాలువ నీళ్లు చూసిన తర్వాత కోమటిడ్డి వెంకట్‌డ్డి, గుత్తా సుఖేందర్‌డ్డిల మీద నాకున్న అసంతృప్తి తొలగిపో యింది. చాలా సందర్భాల్లో ఈ కాలువను పట్టించుకున్నదీ వాళ్లే. అప్పుడప్పుడూ నిర్లక్ష్యం చేసిందీ వాళ్లే. నదీ జలాలకు సంబంధించి సోయి ఉన్న నాయకులు వారు. కానీ పంతంగా పనులు నడిపించే వేగమే లేదు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి వరద కాలువ ద్వారా ఈ నీటిని మళ్లిస్తున్నారు. సాగర్‌లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉంటే గ్రావిటీ ద్వారా నీరు వస్తుంది. అంతకంటే కిందికి పడిపోతే లిఫ్ట్ చేయడానికి మోటార్లు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఈ కాలువ పూర్తయితే కనీసం లక్ష ఎకరా ల భూమి సాగులోకి వస్తుంది. లక్ష ఎకరాలు సాగులోకి రావడం అంటే ఏటా 800 కోట్ల రూపాయాల (ఎకరాకు ఏడాదికి 80 వేల చొప్పున) రాబడి. పెట్టుబడులు పోను కనీసం 400 కోట్ల రూపాయల ఆదాయం. వందకు పైగా గ్రామాల్లో జీవన ప్రమాణాలు మారిపోతాయి. సాగునీటి విలువ ఇప్పటికీ మనవాళ్లకు తగినంతగా తెలియడం లేదనిపిస్తోంది.

మాధవడ్డి ప్రాజెక్టు పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. ఇంజనీరు శ్యామసుందర్‌డ్డి దీక్షగా చేశారు కాబట్టి ఈ మాత్రమయినా అయింది. కానీ ఇంకా చాలా డిస్ట్రిబ్యూటరీలు పూర్తి కాలేదు. సూక్ష్మ సేద్యం పేరుతో వైఎస్ రాజశేఖర్‌డ్డి మధ్యలో కొన్నింటిని ఆపేశారు. నీరు అందాల్సిన గ్రామాలన్నింటికీ ఇంకా చేరనేలేదు. మాధవడ్డి కాలువను మూసీ నదికి కూడా అనుసంధానం చేసి, దాని కింద ఆయకట్టును కూడా స్థిరీకరించాల్సి ఉంది. మాధవడ్డి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చుకుంటే మరో లక్షా యాభైవేల ఎకరాలు సాగుచేసుకోవచ్చు. విద్యుత్ వినియోగం, బోరు బావుల ఖర్చు లేకుండా వ్యవసాయం చేయగలిగే అవకాశం ఉంటే ఆ రైతు కు అంతకంటే వరం ఏముంటుంది? సృష్టికి, నాగరికతకు, అభివృద్ధికి, సకల సంపదలకు మూలధనంనీరే. ఆ నీటి విలువను గుర్తించిన వాళ్లు ఎదిగారు. నిర్లక్ష్యం చేసినవాళ్లు నష్టపోయారు. ఆంధ్రకు, తెలంగాణకు అంతరాలు పెరగడానికి ప్రధాన కారణం ఇదే. మన నేతలకు ఎందుకో మొదటి నుంచి ప్రాజెక్టులపై, సాగునీటి అవసరాలపై అవగాహన తక్కువ. తెలంగా ణ ఉద్యమం వచ్చిన తర్వాతనే ప్రాజెక్టులపై అవగాహన పెరిగింది. తెలంగాణ ఉద్యమ తీవ్రతను తట్టుకోవడానికే అనేక ప్రాజెక్టుల పనులను ప్రారంభించారు. ఎస్సాస్పీ కాలువలు తవ్వారు తప్ప నీరు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు రాదో తెలియదు. కంతనపల్లి ప్రాజెక్టు పూర్తయితే తప్ప ఆ కాలువకు సాగునీటి గ్యారెంటీ ఉండదని నీటిపారుదల ఇంజనీర్లు చెబుతున్నారు.

ఈ ఆలోచనలన్నీ వెంటాడుతున్న వేళ.. ఊరి చావడి వద్ద కూర్చున్న పెద్దాయన అసలు విషయం చెప్పాడు. ‘మనకు నలభై ఏళ్ల క్రితమే ఈ కాలు వ రావలసిందిరా. నందికొండ వద్ద ప్రాజెక్టు కడితే మనకు నీళ్లు ఎప్పుడో వచ్చేవి. ఏవేవో కారణాలు చెప్పి ప్రాజెక్టును కిందికి తీసుకుపోయారు. మన కు నీళ్లు రాకుండాపోయాయి’ అని ఆయన గొణిగారు. ఈ వాదన చాలాకాలంగా ఉన్నదే. అది వాస్తవం కూడా.ఇప్పుడు నాగార్జుసాగర్ రిజర్వాయర్‌లో మునిగిపోయిన నందికొండ గ్రామం వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే అక్కంపల్లి ప్రాంతం నుంచే గ్రావిటీ ద్వారా సగం నల్లగొండ జిల్లాకు నీళ్లు వచ్చేవ ని పెదవూర మిత్రుడు విజయభాస్కర్ చెప్పారు. నందికొండ గ్రామం వద్ద రిజర్వాయర్ కడితే పూర్తి రిజర్వాయర్ నీటి మట్టం సుమారు మరో 60 నుంచి 100 అడుగులు ఎక్కువగా ఉండేదని మాజీ ఇంజనీర్లు చెబుతున్నా రు. ఇప్పుడు సాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి మట్టం 590 అడుగులు. డెడ్ స్టోరేజీ లెవల్ 510 అడుగులు. ప్రాజెక్టు నందికొండ వద్ద కట్టి ఉంటే ఈ లెక్కలు మారిపోయేవి. డెడ్ స్టోరేజీ ఏ 600 అడుగులో ఉండి, 680 అడుగుల మట్టం వరకు నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు 575 అడుగుల మట్టం నుంచి వరద కాలువద్వారా నీళ్లు తీసుకునే బదులు అప్పుడు 100 అడుగుల నీళ్లు మనకు అందుబాటులో ఉండేవి. కానీ అక్కడ ప్రాజెక్టు కడితే నిలువదని, ఎక్కువ నీళ్లు నిలువ ఉంచలేమని చెప్పి ప్రాజెక్టును ఇప్పుడున్న చోటుకు మార్చారు. ఎడమ కాలువ కింద పది లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యాన్ని కాస్తా 6.9 లక్షలకు కుదించారు. ఆ కారణంగా నల్లగొండ జిల్లా తీవ్రంగా నష్టపోయింది. ఆ ఒక్క ప్రాజెక్టు తప్పి పోయిన కారణంగా ఇప్పుడు వరదకాలువ, మాధవడ్డి ప్రాజెక్టు అవసరం అయ్యాయి. అవి కూడా పూర్తి అవసరాలను తీర్చడం లేదు.

వీటన్నింటికంటే ముఖ్యమయినది శ్రీశైలం ఎడమ కాలువ. 1985 నాటి ఆలోచన అది. శ్రీశైలం కుడికాలువను, ఎడమకాలువను ఏక కాలంలో ప్రారంభించి, పూర్తి చేయాలని ఎన్‌టిఆర్ ఆరోజు చెప్పారు. కానీ కుడికాలువ, తెలుగుగంగ కాలువ, కేసీ కెనాల్ లింకు కాలువ ఎప్పుడో పూర్తయి రాయలసీమకు నీళ్లందిస్తున్నాయి. పోతిడ్డిపాడు రెగ్యులేటర్‌ను రెండోసారి కూడా వెడల్పు చేసి నీళ్లు తీసుకుంటున్నారు. కానీ ఎడమ కాలువ మాత్రం ఈ రోజుకు కూడా ముందుకు సాగడం లేదు. తొలుత సొరంగం తవ్వడం కుదరదు, పుట్టంగండి వద్ద ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తే సరిపోతుందని వాదించింది సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్. ఆ తర్వాత ఎత్తిపోతల పథకం కూడా దండగమారి పథకం, అది ఆచరణ సాధ్యం కాదని చంద్రబాబు మంత్రివర్గంలో నీటిపారుదల మంత్రిగా ఉన్న గుం టూరు నేత కోదాడలో ప్రకటించారు. ఆ రోజు హోంమంవూతిగా ఉన్న మాధవడ్డి ఆగ్రహోదక్షిగుడై ఆ మంత్రిని నీటిపారుదల శాఖ నుంచి తొలగించి, ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని, లేకపోతే తన రాజీనామా తీసుకోండని చంద్రబాబు ముఖం మీద చెప్పారని ఆయన సన్నిహితులు చెబుతారు. చంద్రబాబు ఆయనను సముదాయించి, ఆ తర్వాత జరిగిన మంత్రి వర్గ విస్తరణలో గుంటూరు మంత్రిని వేరే శాఖకు మార్చి తుమ్మల నాగేశ్వర్‌రావును నీటిపారుదల శాఖకు తెచ్చారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి దురదృష్టవశాత్తు మాధవడ్డి మందుపాతర పేలుడులో మరణించారు. ఆయన సేవకు గుర్తింపుగా ఆ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. శ్రీశైలం ఎడమ కాలువ మాత్రం కుంటి నడక నడుస్తున్నది. ఎడమ కాలువ నీటి ప్రవాహ సామర్థ్యాన్ని బాగా తగ్గించి ఆదిలోనే దాని ఉసురు తీశారు. అయి నా అది పూర్తయితే చాలు. ఫ్లోరైడు బాధితుల కడగండ్లు తీరేందుకు అదొక మహదవకాశం. తెలంగాణ రాజకీయ నాయకత్వం సాగునీటిని ప్రథమ ప్రాధాన్య అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉన్నది.

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

3 thoughts on “సాగు నీరే సంపదల సృష్టికర్త”

  1. Well said Reddy Garu …I like it……our leaders are not having sufficient knowledge or interest on irregation usage of water resources…….So many village water tanks are filled with matti/pudika…..Telangana ministers/MLA are not having any interest to allocate the funds for clean/remove the pudika……What will be the impact if we do/remove pudika in all village water tanks at regular intervals will have great advantage for irregation and will increase water table in the area…….Kindly bring awareness on this water saving and usage of our water share from river basins,completion of dams/canals and how seemandra people are managing and completing the irregation works……..If any political leader is not performing in safeguarding the interest of Farmers /general public will not be given any 2 nd chance further…..J Raji reddy

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s