ఎవరు దొరలు? ఎవరు దొంగలు? ఎవరు వారసులు?


తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న కేసీఆర్‌పై అన్నివైపుల నుంచి దాడిచేయడానికి సీమాంధ్ర పార్టీలు, సీమాంధ్ర మీడియా చావుతెలివిని ప్రదర్శిస్తున్నాయి. కేసీఆర్ ఉద్యమాన్ని అడ్డుపెట్టి సంపాదించుకున్నారని, కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని సీమాంధ్ర మౌత్ పీసెస్ దాడిచేస్తున్నాయి. విడ్డూరం ఏమంటే ఇలా దాడి చేస్తున్న పార్టీలు, పత్రికలు అన్నీ ఏదో ఒక కుటుంబాన్ని మోస్తున్నవే, సమర్థిస్తున్నవే. కాంగ్రెస్‌కు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే అర్హతే లేదు. గాంధీల కుటుంబం మొదలు రాజశేఖర్‌రెడ్డి కుటుంబం వరకు…వారంతా సకుటుంబ సపరివారంగా రాజకీయాలు చేశారు. తెలుగుదేశం ఫక్తు కుటుంబ పార్టీగానే వచ్చింది. ఎన్‌టిఆర్, ఆయన బంధువులు అనేక మంది ఆయనతోనే రాజకీయాల్లోకి వచ్చారు. దగ్గుబాటి కుటుంబం, ఆ తర్వాత నారావారి కుటుంబం పార్టీని అల్లుకుపోయాయి. కుటుంబ బలంతోనే చంద్రబాబు ఎన్‌టిఆర్‌ను వెన్నుపోటు పొడిచి, అధికారాన్ని, ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి కొత్తకాదు. ప్రధానుల వారసులు ప్రధానులు కావడం, ఎంపీల పిల్లలు ఎంపీలు కావడం, ఎమ్మెల్యేల పిల్లలు, భార్యలు ఎమ్మెల్యేలు కావడం చూస్తూనే ఉన్నాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్లు ఇచ్చి గెలిపించడం అందరికీ తెలిసిన విషయమే. భూస్వామ్య సంస్కృతికి కొనసాగింపుగానే దేశంలో వారసత్వ రాజకీయాలు మనుగడ సాగిస్తున్నాయి. తప్పొప్పులను సమీక్షించడంలో తప్పు లేదు. జరుగుతున్నదంతా మంచే అని కూడా చెప్పబోవడం లేదు.

కానీ ఒక్క కేసీఆర్ విషయంలోనే ఈ రూళ్లకర్రను ఎందుకు ఉపయోగిస్తున్నారన్నదే ప్రశ్న. ఒక్క కేసీఆర్ విషయంలోనే దొరతనం ఎందుకు గుర్తుకు వస్తోంది? ఒక్క కేసీఆర్ విషయంలోనే వారసత్వం ఎందుకు అడ్డంపడుతోంది? ఒక్క కేసీఆర్ విషయంలోనే అవినీతి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఆరవైఏళ్లు తెలంగాణను ఎండబెట్టి పండబెట్టి దోచుకున్న సీమాంధ్ర దొరలకు, కమ్మ, రెడ్డి భూస్వాములకు, పెట్టుబడిదార్లకు సేవచేయడానికి లేని అభ్యంతరం కేసీఆర్‌కు చేయడానికి ఎందుకు అడ్డం వస్తున్నది? చంద్రబాబు, కిరణ్, జగన్‌ల దర్బారుల్లో పడిగాపులు కాయడానికి లేని అభ్యంతరం కేసీఆర్‌తో కలసి పనిచేయడానికి ఎందుకు అడ్డం వస్తున్నది? అంటే వీరికి దొరతనమో, అవినీతో, కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకకపోవడమో…. ఇవేవీ అడ్డంకాదు, అభ్యంతరం కాదు. వేరే లక్ష్యం ఉంది – అదే తెలంగాణవాదాన్ని దెబ్బతీయడం. కేసీఆర్‌ను బలహీనపర్చి సీమాంధ్ర నాయకులను బలపర్చడం. అరవైఏళ్లుగా సీమాంధ్ర నాయకత్వం పూసుకున్న బురదను కొంత కేసీఆర్‌పై పూసి తెలంగాణ ఉద్యమ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం. తెలంగాణ నాయకులను ఇంతకాలం ఇలా ఆగంపట్టించే  ఎందుకూ కొరగాకుండా చేశారు. ఇప్పుడు కూడా వీరిని ప్రతిఘటించకపోతే తెలంగాణకు విముక్తి లేదు.

కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు కూడా ఇటువంటివే. ఆయన పుష్కరకాలంలో ఏనాడూ అధికారంలో లేరు. కొద్దికాలం మంత్రిగా ఉన్నా పోర్టుఫోలియో లేని మంత్రిగానే ఉన్నారు. ఈ పన్నెండేళ్లూ ఉద్యమాలూ, ఊరేగింపులూ, సభలు, దీక్షలు, సమ్మెలతోనే జీవితం గడచిపోయింది. తెలంగాణ ఉద్యమంలోకాకుండా ఆయన ఏ అధికార పార్టీ శరణు జొచ్చినా ఆయన ఆర్థికంగా బలపడే అవకాశాలు వందరెట్లు ఎక్కువ. కానీ ఆయన తెలంగాణ సాధనకోసమే రాజీపడకుండా కొట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో నిలబడి పోరాడుతున్న అనేకమంది నాయకులు అప్పులపాలయ్యారు. కానీ సీమాంధ్ర పార్టీలు ఇక్కడ కూడా బురదజల్లే అస్త్రాన్నే ఉపయోగిస్తున్నాయి. ‘మనం ఎట్లాగూ పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో ఉన్నాం. అదే బురదను కేసీఆర్‌కూ అంటిస్తే సరిపోతుంది కదా’ అన్నది వారి ఎత్తుగడ. సీమాంధ్ర నేతల అవినీతి ముందు తెలంగాణ నేతలు ఎవరయినా నిలబడగలరా? ఒకప్పుడు ఇల్లు అమ్ముకోజూసిన రాజశేఖర్‌రెడ్డి అమాంతంగా ఒక పారిశ్రామిక సామ్రాజ్యాన్ని నిర్మించవచ్చు, ఇరవై ఏళ్లనాడు నేను నా వార్షికాదాయం 0వేల రూపాయలని చెప్పుకున్న చంద్రబాబు హటాత్తుగా హెరిటేజ్ డైరీలు, హెరిటేజ్ ఫ్రెష్‌లు, వందల ఎకరాల భూములు సంపాదించుకోవచ్చు. చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకోవచ్చు. తాతలు తాతల తాతల నుంచి ఇప్పటిదాకా రాజ్యాలేలవచ్చు. కుటుంబాలు కుటుంబాలు రాష్ట్రాన్ని దున్నుకోవచ్చు. ఈ మీడియాకు, తెలంగాణలోనే ఉన్న వారి చెంచాలకు వారి కుటుంబాల గురించి పట్టదు. వారి అక్రమ సంపాదనల గురించి మాట్లాడరు.

కేసీఆర్ కుటుంబం ఉద్యమాల్లో ఉంది. కేసీఆర్ మూలన ఉన్నవాళ్లను తీసుకొచ్చి పదవులు కట్టబెట్ట లేదు. హరీశ్‌రావు తెలంగాణ ఉద్యమం పునాదుల నుంచీ నిర్మాణంలో ఉన్నారు. కేటీఆర్ ఉద్యమాల్లో పాల్గొంటూ ఎదిగారు. కవిత తెలంగాణ సాంస్కృతిక వేదికలను నిర్మిస్తూ రాజకీయాల్లోకి వచ్చారు. వారు సాధనతో నాయకులయ్యారు. సీమాంధ్ర పార్టీలు, వారి చెంచాలు, వారి మీడియా లక్ష్యం కేసీఆర్ కాదు. కేసీఆర్‌ను దెబ్బ తీస్తే తెలంగాణను దెబ్బతీసినట్టేనని భావిస్తున్నారు. కేసీఆర్‌ను ఓడిస్తే తెలంగాణను ఓడించినట్టేనని అనుకుంటున్నారు. అందుకే ఆయనను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది ఈ దాడి మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో ఇప్పటి పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే సీమాంధ్ర నాయకుల కుటుంబ రాజకీయాలను గురించి తెలుసుకోవాలి. వారి అవినీతి అక్రమాల చరిత్రను తెలుసుకోవాలి-

సీమాంధ్ర కుటుంబాలు-వారసత్వాలు

స్వర్గీయ ఎన్‌టిఆర్
నారా చంద్రబాబునాయుడు
లోకేష్ నాయుడు
బాలకృష్ణ
హరికృష్ణ
ఎన్‌టిఆర్
నారా రామ్మూర్తి నాయుడు
దగ్గుబాటి పురంధేశ్వరి
దగ్గుబాటి వెంకటేశ్వర్‌రావు
బోళ్ల బుల్లి రామయ్య

స్వర్గీయ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్ విజయమ్మ
వైఎస్ షర్మిల
వైఎస్ వివేకానందరెడ్డి
వైవి సుబ్బారెడ్డి-విజయమ్మ మరిది
రవీంద్రనాథరెడ్డి-కడప మాజీ మేయర్-విజయమ్మ తమ్ముడు
వైఎస్ సుధీర్‌రెడ్డి
మరో అర డజను మంది

బొత్స సత్యనారాయణ
బొత్స ఝాన్సీ లక్ష్మి-భార్య
బొత్స అప్పలనాయుడు-ఎమ్మెల్యే-తమ్ముడు
బి.అప్పలనాయుడు-నెల్లిమర్ల ఎమ్మెల్యే- బొత్స మేనల్లుడు

ధర్మాన ప్రసాదరావు
ధర్మాన కృష్ణదాసు-సోదరుడు
ధర్మాన పద్మప్రియ-కృష్ణదాసు భార్య
ధర్మాన రామదాసు-సోదరుడు
ధర్మాన రాంమనోహర్‌నాయుడుపసాదరావు తనయుడు

రాయపాటి సాంబశివరావు
రాయపాటి శ్రీనివాసరావు
రాయపాటి సాయికృష్ణ-శ్రీనివాసరావు కుమారుడు-గుంటూరు మాజీ మేయరు

కన్నా లక్ష్మీనారాయణ
కన్నా నాగరాజు-తనయుడు-గుంటూరు మాజీ మేయరు
కన్నా ఫణీంద్ర-తనయుడు

కావూరి సాంబశివరావు
కావూరి శ్రీనాగి-కూతురు
ముళ్లపూడి రాజీవ్(మనవడు)

స్వర్గీయ కింజారపు ఎర్రంనాయుడు
అచ్చెన్నాయుడు
రామ్మోహనరావునాయుడు

డి.శ్రీనివాస్
డి.సంజయ్

ఆర్ దామోదర్‌రెడ్డి
ఆర్ రాంరెడ్డి
ఆర్ సర్వోత్తమ్‌రెడ్డి

స్వర్గీయ డికె సత్యారెడ్డి
డికె సమరసింహారెడ్డి
డికె భరత సింహారెడ్డి
డికె అరుణ

జి
జి.వినోద్
జి.వివేక్

ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
కల్వకుంట్ల మదన్‌మోహన్‌రావు(ఎర్రబెల్లి మేనల్లుడు)

విచిత్రం ఏమంటే…

అవిశ్వాస తీర్మానం ద్వారా అర్థమయింది ఏమంటే కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని!  కిరణ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంఐఎం దూరమయింది. చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. మంత్రుల మధ్య సఖ్యత లేదు. విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రంలో జగన్ పార్టీ, కేసీఆర్ పార్టీలు లేకుండా ఒక్క కాంగ్రెస్, టీడీపీలే పోటాపోటీగా ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించండి. టీడీపీ ఈ ప్రభుత్వాన్ని నడవనిచ్చేది కాదు. సీమాంధ్ర మీడియా కిరణ్‌కుమార్‌రెడ్డికి కునుకు లేకుండా చేసేది. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తిందని గగ్గోలు పెట్టేవి. కిరణ్‌కు ముఖ్యమంత్రి పీఠంలో కొనసాగే నైతిక హక్కులేదని రొదపెట్టేవి. కానీ అటు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, ఇటు టీడీపీని మోస్తున్న మీడియా కిక్కురుమనకుండా పడిఉంది. తేలుకుట్టిన దొంగలా ఏమీ జరగనట్టు, ఏమీ ఎరగనట్టు టీడీపీ మీడియావ్యవహరిస్తున్నాయి. పైగా వీరు కిరణ్‌కుమార్‌రెడ్డిలో అటు జగన్‌ను, ఇటు కేసీఆర్‌ను ఎదుర్కోగల ‘హీరో’ను చూస్తున్నారు.  కిరణ్ దూకుడుగా, సమర్థంగా అందరినీ ఎదుర్కొంటున్నారని కీర్తిస్తున్నది. వీలైనంత పొగడడానికి ప్రయత్నిస్తున్నది. అందరి తొర్రలను వెదికి వెదికి పట్టుకునే టీడీపీ మీడియా కిరణ్‌ను చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నది.

జగన్ బయటికి వస్తారా?

జగన్‌ను బయటికి తీసుకురావడానికి సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు కొందరు లాబీయింగ్ చేస్తున్నారని ఒక ఢిల్లీ మిత్రుడు చెప్పారు. ఎందుకు, ఎలా అని ప్రశ్నిస్తే అతను చెప్పిన వాదన ఆశ్చర్యం కలిగించింది. ‘‘జగన్ బయటికి రాకుండా తెలంగాణలో టీఆరెస్‌కు అడ్డుకట్ట వేయడం కష్టం. ఆంధ్రాలో ఎలాగూ జగన్ ప్రభావాన్ని కట్టడి చేయలేకపోతున్నాం. మనం పోతే పోతాం. జగన్‌ను బయటికి తీసుకువచ్చి వచ్చే ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టాలి. సమైక్యాంధ్రను కాపాడడానికి ఇదొక్కటే మార్గంగా కనిపిస్తున్నది’ అని కోస్తా జిల్లాల్లో సమైక్యవాదానికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకుడొకరు చెప్పారని ఆయన వివరించారు. రాజకీయ అస్తిత్వం కంటే కూడా సీమాంధ్ర నాయకులకు తెలంగాణవాదాన్ని దెబ్బకొట్టడమే ప్రధాన ఎజెండాగా ఉందని ఆయన మాటలు విన్న తర్వాత అర్థమయింది. తాము మునిగినా పర్వాలేదు, తెలంగాణవాదం మాత్రం ఓడిపోవాలి. తెలంగాణలో వైఎస్సార్సీపీలో చేరిన నాయకులు కూడా సరిగ్గా ఇదే విషయంపై మథనపడుతున్నారు. ‘జగన్ బయటికి రాకుంటే మనం గెలవలేం. ఇప్పుడున్న బలం చాలదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు’ అని ఆ పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న నాయకుడొకరు వాపోయారు.

అంతర్యుద్ధాలు ముమ్మరం

‘చంద్రబాబు, కిరణ్‌బాబు, జగన్‌బాబు…అంతా ఆంధ్రాబాబులే. తెలంగాణలో వారి కీలుబొమ్మలు లేకుండా చేయాలి. ఆ పార్టీలను తెలంగాణలో ఫినిష్ చేయకపోతే తెలంగాణను ఎప్పటికీ సాధించుకోలేం’ అని టీఆరెస్ అధిష్ఠానం ఆలోచిస్తుంటే, ఎన్నికలలోపు టీఆరెస్‌ను ఆగం పట్టించాలని టీడీపీ, వైఎస్సార్సీపీలు ప్రయత్నిస్తున్నాయి. ఆకర్ష్‌కు విరుగుడుగా వికర్ష్‌ను అమలు చేయాలని ఈ రెండు పార్టీలు పథకాలు రచిస్తున్నాయి. ‘ఎంత ఖర్చయినా పర్వాలేదు. టీఆరెస్‌ను దెబ్బతీయడమంటే కేసీఆర్‌ను దెబ్బకొట్టడం కాదు. తెలంగాణవాదాన్నే దెబ్బకొట్టడం. వచ్చే ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని ఓడించాలి’ అని టీడీపీ యోచిస్తున్నది. 2009 సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబు పార్టీ నాయకులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడాఇదే వ్యూహాన్ని అమలు చేశారు. ఒకవైపు టీఆరెస్‌తో పొత్తు పెట్టుకుని, మరోవైపు ఆ పార్టీని దెబ్బతీయడానికి చేయాల్సినదంతా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇటువంటి యుద్ధాలు ఇంకా తీవ్రస్థాయిలో ఉంటాయి. పరకాల ప్రభాకర్ వంటి కోవర్టులను ఉపయోగించుకుని పీఆర్‌పీని ఎన్నికల ముందు ఎలా  బద్నాం చేశారో, ఇప్పుడు టీఆరెస్‌ను కూడా అలా పలుచన చేయాలని ఈ రెండు పార్టీలు యోచిస్తున్నాయి. రాజకీయాల్లో నెగ్గడంకోసం సీమాంధ్ర నాయకత్వం ఎంతదూరమయినా వెళుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. తెలంగాణవాదులు అప్రమత్తంగా ఉండకపోతే మరోమారు భంగపడాల్సి వస్తుంది.

Advertisements

Author: kattashekar

Editor, Namasthe Telangana Daily, Hyderabad

8 thoughts on “ఎవరు దొరలు? ఎవరు దొంగలు? ఎవరు వారసులు?”

 1. mee anaylsis chal baga vuntundhi … seemandhralo jajan antha adharana ravadniki karanam not only symathy chala mandhi seemandhra prajalu jagan ayeethe ne telanagana movement nu addukogalarani bavisthunaru ….. idi kevalam congress peddala abiprayam kadu majoriy seemandhra prajala abhiprayam …..

 2. Namasthe Katta Shekhar Reddy Garu,

  Three things to understand.
  1. The above story sounds that when seemandhra leaders can build business empires through corrupted means, why should not KCR be allowed??

  2. When seemandhra leaders can encourage their family members to get into politics and run dynasty politics, why should not KCR be allowed??
  3. Fighting against KCR is fighting against telangana irrespective of the issue concerned to Telangana movement or not.

  How funny. Whats the difference then between Telanganites and seemandhra leaders??

  1.Do you mean to say only KCR son,daughter and harish are working for TG movement in TRS?? there are many youth who lost their careers and properties for the movement sake, are they given right opportunity??
  2.What made KCR give the siricilla ticket to KTR instead of KK Mahender who was the protagonist of the agitation in that constituency??
  3.Was it right, getting a minister position to Harish when he was not even an MLA??Do you SAY other leaders who were MLAs then are all useless??
  4.Is it not the fact that only Kavitha is highlighted in the name of Jagruthi and no other office bearer of that organisation is known to the world as much as kavitha??

  6.while I agree any one can try their best in politics, such leaders are forced on to the public in the name of family,agitation etc. Dynasty politics are not good for the country,you see any scam, it is linked to the heirs of politicians..Please encourage fresh thoughts, young talented dynamic leaders irrespective of their back grounds.

  FOR GODS SAKE DO NOT SHIELD KCR OR FOR THAT MATTER ANY LEADER OF ANY PARTY IN THE GUISE OF TELANGANA AGITATION FROM THE MISTAKES THEY COMMIT.

  DONT TRY BRANDING THE PEOPLE WHO RAISE VOICE ON ANY LACUNA IN OUR MOVEMENT AS “telangana drohi” ,JUST BECAUSE YOU TOO HAVE A TV AND PAPER

 3. sridhar reddy amyakthvaniki emanalo artham kavadam ledu shekar garu chepindhi tdp dhani karapatharalu (pathirikalu ) chesthunna vadana entha dolla tho kudukunadhi chepparu dhani aa context lo chudali …. ika pothe TRS meegitha e party la ku beenna maindhi di kadu ipppdunaa samaja chithanaya lo oka rajkiya party ela vunayo alage adhi vuntundhi …. TRS nu chudalisindhi telanagana vishaymulo dhani karyacharananu beriju vesukoni adhi kuda telanagan nu neejayethi koru kunnavaru kani …… telangana pachi vathirekinche varu kadu

 4. Sridhar Reddy garu,

  Katta Sekhar Reddy garu raasindi Seemaandhra patrikalu chestunna vishaprachaaram meeda. meeru asalu article chadivindraa ledaa? aayana raasina context vadili ee arguments enduku sir?

 5. A very positive balanced expression of the present political situation. This black & white expressive explanation against the forces of anti-Telangaana should reach the nook and corner of the state
  ..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s