కాంగ్రెస్ పతనమే తెలంగాణకు సోపానం

తెలంగాణ ప్రజలు మనవాళ్లెవరో, కానివాళ్లెవరో గుర్తించాల్సిన సమయం వచ్చింది. మాటిమాటికి మాటలు మార్చిందెవరో, నిక్కచ్చిగా నిలబడి కొట్లాడిందెవరో తేల్చాల్సిన తరుణం వచ్చింది. తెలంగాణకు శత్రువులెవరో, తెలంగాణ పుత్రులెవరో నిర్ణయించుకోవలసిన సందర్భం వచ్చింది. తెలుగుదేశం తెలంగాణ పార్టీకాదు. దాని ప్రాంతమూ, సామాజిక పునాది రెండూ తెలంగాణకు సంబంధించినవి కాదు. అది తెలంగాణ సమస్యను ఎజెండాలోకి తెచ్చిన పార్టీ కూడా కాదు. ‘వేరే కారణాల వల్ల తెలంగాణ’ అనవలసి వచ్చిందని ఆ పార్టీ అధినేతే చెప్పుకున్నారు. ఎన్నికల అవసరాల వల్ల తెలంగాణ అనవలసి వచ్చిందని చెప్పలేడు కాబట్టి అలా చెప్పాడు. ఆ పార్టీ ఎప్పటికీ మనసుతో తెలంగాణను కోరుకోదు. తెలంగాణ ఇవ్వాలని కొట్లాడదు. ఆ పార్టీ ఇప్పుడు క్షీణిస్తున్న పార్టీ. ఆ పార్టీ చేసిన తప్పిదాలు దానిని పతనం వైపు నడిపిస్తున్నాయి. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకత్వం వహిస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గం. తెలంగాణ సమస్యను ఎజెండాలోకి తెచ్చింది, పదేపదే హామీలు ఇచ్చింది, ఇస్తున్నట్టు ప్రకటించింది, మాటతప్పింది, పదేపదే మాటమార్చింది, తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకున్నది, వెయ్యిమంది యువకుల బలిదానాలకు కారణమైంది, ఆంధ్రప్రదేశ్‌ను సంక్షోభంలోకి నెట్టింది, నాలుగుకోట్ల మంది ఆకాంక్షను దోశ, కేకు…లతో పోల్చి తెలంగాణ ప్రజలను అదేపనిగా అవమానించింది కాంగ్రెస్ పార్టీ, దానిని మోస్తున్న సామాజిక వర్గ నాయకత్వమే. కేంద్రంలో, రాష్ట్రంలో తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉండీ, అన్ని అవకాశాలూ ఉండీ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదల్చుకుంటే టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్‌లు అడ్డం కాదు. మాటతప్పినందుకు, మాట మార్చినందుకు ఆ పార్టీలను కూడాతెలంగాణ ప్రజలు శిక్షించవలసిందే. కానీ మొదటి నిందితుడిని నిర్ణయించుకోవలసి వస్తే మాత్రం అది కాంగ్రెస్ పార్టీయే. దేశంలోని ప్రధాన పార్టీలను తోసిరాజని, పార్లమెంటులో ఓడిపోవడానికి, మైనారిటీలో పడిపోవడానికి సిద్ధపడి కూడా అనేక వివాదాస్పద బిల్లులను ఆమోదింపజేసుకున్న ఘనత కాంగ్రెస్‌ది, యూపీఏ ప్రభుత్వానిది. అందువల్ల తెలంగాణ రాకపోవడానికి, ఇవ్వకపోవడానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దే.

ఆడిన మాటలు దప్పిన
గాడిద కొడుకంటు దిట్టగా విని యయ్యో!
వీడా నాకొక కొడుకని
గాడిద యేడ్చెంగదన్న ఘన సంపన్నా!

ఆడినమాట తప్పినవారిని నిందించడంకోసం ఒక శతకకారుని వ్యంగ్యం ఇది. కాంగ్రెస్‌ను గాడిదతో పోల్చడం కూడా అన్యాయమే. గాడిద చాకిరీ చేస్తుంది, మోసం చేయదు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ ఎంత మోసపూరితంగా వ్యవహరించింది? ఎన్ని వేషాలు, ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, ఎన్ని చర్చలు, ఎంత సాగదీత? తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించింది? ఎంతగా క్షోభకు గురిచేసింది? కాంగ్రెస్ ఎక్కడ మొదలై ఎక్కడదాకా వచ్చింది? 1999లో వరుసగా రెండవసారి అధికారం కోల్పోయిన తర్వాత, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఉన్నకాలంలో 2000 సంవత్సరంలో 41 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ డిమాండుతో ఢిల్లీకి వెళ్లిన నాటి నుంచి తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల వరకు ఎన్ని మాటలు, ఎన్ని హామీలు, ఎన్ని చర్చలు ఆవిరైపోయాయి! కానీ తెలంగాణ రాలేదు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్…మూడు పార్టీలూ తెలంగాణను ఒక అవసరంగా వాడుకున్నాయే తప్ప, చిత్తశుద్ధితో దానిని సాధించే లక్ష్యంతో పనిచేయలేదు. ఎన్నికల్లో గెలిచే సోపానంగా పరిగణించాయే తప్ప ప్రజల ఆకాంక్షను తీర్చే ఉద్దేశంతో పనిచేయలేదు. అందుకే తెలంగాణ సమస్య పరిష్కారం కాలేదు. తెలంగాణకు సంబంధించిన 100 మంది ఎమ్మెల్యేలు, 15 ఎంపీలు వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినా, అసెంబ్లీ, పార్లమెంటులను స్తంభింప జేసినా, ఈ సమస్య ఇంతదూరం వచ్చేది కాదు. కానీ ఈ వంద మంది, 15 మంది ఒక్క జట్టుగా లేకపోవడమే తెలంగాణకు శాపమైంది. వీరిలో అత్యధికులు సీమాంధ్ర నాయకత్వాల్లోని పార్టీల్లో ఉండడమే తెలంగాణకు పాపమైంది. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు సీమాంధ్ర నేతల నాదస్వరానికి డూడూ బసవన్నలుగా ఆడారు తప్ప ఎదిరించిపోరాడే తెగువను చూపలేదు. తమ ఫార్చూన్‌లను చూసుకున్నారు తప్ప, తెలంగాణ ఫార్చూన్‌ను చూడలేదు. తెలంగాణలో కాంగ్రెస్‌లో చక్రం తిప్పుతున్న ఒక ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నాయకత్వం చేష్టలుడిగి, చేవచచ్చి, పదవులచుట్టూ, పదవులకోసం పొర్లు దండాలు పెడుతున్నది. తెలంగాణ సాధనకోసం తెగించి పోరాడే ఒక చారిత్రక అవకాశాన్ని వారు కోల్పోయారు. తెలంగాణకు ద్రోహం చేసిన ముద్ర వీళ్లను జీవితకాలం వెంటాడుతుందన్నది గతానుభవమే. మర్రి చెన్నారెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగారు తప్ప తెలంగాణకు ద్రోహం చేసిన చరిత్రను మాత్రం కడిగేసుకోలేకపోయారు.

టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇందుకు కొంత భిన్నం. వీరు డూడూ బసవన్నలుగానే కాదు, సీమాంధ్ర నేతల వేట కుక్కలుగా కూడా పనిచేస్తున్నారు. సీమాంధ్రలో చంద్రబాబు వస్తున్నా మీకోసం యాత్ర జరిగినన్ని రోజులు తెలంగాణ మాట ఎత్తవద్దని ఆదేశిస్తే అందరూ నోరుమూసుకుని కూర్చున్నారు. యాత్ర అయిపోతూనే తెలంగాణ ఉద్యమ నేతలపైకి వారిని పెంపుడు కుక్కల్లా ఎగదోశారు. ఒక అబద్ధాన్ని వందసార్లు ప్రచారం చేసి నిజం చేయాలన్న గోబెల్ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు. ఆయన నిజాయితీనీ, కష్టాన్నీ కాకుండా కుట్రలను, కుతంత్రాలను నమ్ముతున్నారు. ఆయన ప్రజలను కాకుండా, ప్రచారాన్ని నమ్ముతున్నారు. ప్రజలను తన విధానాలతో మార్చడానికి ప్రయత్నించకుండా, ‘ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అప్పటికా మాటలాడి’ ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో నిజాయితీలేని కష్టం వృధా అవుతుంది. ఈ పార్టీలలోని తెలంగాణ నేతలు మనుషులే ఇక్కడ. రిమోట్ సీమాంధ్ర నేతల చేతుల్లోనే. వీళ్ల జెండా, ఎజెండారెండూ తెలంగాణ కాదు. ఈ పార్టీలకు తెలంగాణలో పునాదులు ఉన్నంతకాలం తెలంగాణ ఒక బలమైన రాజకీయ శక్తిగా నిలబడి కొట్లాడలేదు. ‘తెలంగాణలో ఒక్క టీఆరెస్సే ఉండాలా?’ అని ఒక విశ్లేషకుడు ప్రశ్నించాడు. తెలంగాణలో వెయ్యి పార్టీలు ఉండనీ. బలపడనీ. అవి తెలంగాణ పార్టీలే అయి ఉండాలి. వాటి నాయకత్వం తెలంగాణ నాయకుల చేతుల్లోనే ఉండాలి. మన ఓట్లతో గెలిచి, మంది పాటపాడేవాళ్లను మాత్రం తెలంగాణ ప్రజలు సహించకూడదన్నదే తెలంగాణవాదుల ఆకాంక్ష. తెలంగాణ చేత, తెలంగాణ కొరకు పనిచేసే తెలంగాణ పార్టీలు కావాలన్నదే వారి ఆశ, ఆశయం. తెలంగాణలో బిజెపి, సిపిఐ, న్యూడెమాక్రసీలు ఉన్నాయి. ఆ పార్టీలూ బలపడుతున్నాయి. కొత్తగా శక్తులను కూడదీసుకుంటున్నాయి. సరికొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. నాగం జనార్దనరెడ్డి బిజెపికి కొత్త బలం. ఆ పార్టీలనెవరూ ప్రశ్నించడం లేదు. నాయకత్వాలు ఎక్కడివాళ్లయినా తెలంగాణకోసమే మాట్లాడుతున్నారు. సిపిఐ కార్యదర్శి నారాయణ మాదిరిగా కరీంనగర్‌లో, తిరుపతిలో ఒకే నినాదం ఇవ్వగల దమ్ము ఏ పార్టీ నాయకులకు ఉంది?

‘ఎన్నికలకు నాలుగు మాసాల ముందు తెలంగాణపై ఏదో ఒక తీర్మానం చేస్తుంది. మళ్లీ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నిస్తుంది.. అప్పుడు మీరేం చేస్తారు?’ అని అమెరికా భారతీయ మిత్రుడొకరు ప్రశ్నించారు. ఒక అంశంపై ఒకసారి మోసం చేయవచ్చు. పదేపదే మోసం చేయడం, పదమూడేళ్లుగా మోసం చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు తెలంగాణ ఆ దశలన్నింటినీ దాటిపోయింది. కేవలం తీర్మానాలు, ఇస్తామన్న హామీలు తెలంగాణ ప్రజలను శాంతింప జేయలేవు. ఒక వేళ ఎన్నికలకు నాలుగు మాసాల ముందు కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసినా దానికి ఏ విలువా ఉండదు. పార్లమెంటులో విభజన తీర్మానం ఆమోదం పొందడం తప్ప మరేదీ తెలంగాణ ప్రజలకు సమ్మతం కాదు, ఉత్త పార్టీ తీర్మానాలు, మంత్రివర్గ తీర్మానాలు మరోసారి మోసం చేయడానికి ఉపయోగపడతాయి తప్ప తెలంగాణ ఏర్పాటుకు దోహదపడవు. పదేళ్లూ అధికారం అనుభవించి, పార్లమెంటులో విభజన తీర్మానం పెట్టడానికి అన్ని అవకాశాలు ఉండి, అదేదీ చేయకుండా, మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేని ఆఖరు క్షణాల్లో కంటి తుడుపు తీర్మానాలు చేస్తే ఎవరు నమ్ముతారు? ‘కాంగ్రెస్ ఎందుకిలా చేస్తున్నది?’ అని ఆయనే మరో ప్రశ్న వేశారు. గతులు తప్పినప్పుడు ప్రాప్తకాలజ్ఞత నశిస్తుంది. తెలంగాణపై ఇప్పుడు నిర్ణయం చేసి, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విభజన ప్రక్రియ పూర్తి చేసినా కాంగ్రెస్‌కు కనీసం తెలంగాణ మిగులుతుంది. ఇది తప్ప కాంగ్రెస్‌ను రక్షించగల మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదు. బహుశా ఆంధ్రప్రదేశ్‌ను ఇక వదిలేసుకోక తప్పదని కాంగ్రెస్ ఒక అంచనాకు వచ్చి ఉంటుంది. మరో ఐదేళ్ల తర్వాత చూసుకుందామని భావిస్తూ ఉండవచ్చు. కానీ ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇలా కొనసాగే అవకాశమే లేదు. కర్ణాటక మాదిరిగా ఇక్కడ తిరిగి కాంగ్రెస్‌ను ఆదరించే అవకాశం లేదు. తమిళనాడు తరహా రాజకీయ పరిస్థితులు ఇక్కడ అవతరించే అవకాశాలే ఎక్కువ. ప్రాంతీయ పార్టీలు ఇంకా బలపడి తమిళనాడు తరహాలో కాంగ్రెస్ శాశ్వతంగా జూనియర్ భాగస్వామిగా మారిపోవడానికి అవకాశాలు న్నాయి. ఎన్నికల తర్వాత టీఆరెస్ లేక వైఎస్సార్ కాంగ్రెస్‌లకు ఏ పార్టీతోనూ విలీనం కావలసిన అవసరం అయితే ఉత్పన్నం కాదు. అవి శాశ్వత రాజకీయ పక్షాలుగా నిలిచిపోతాయి. ఎన్‌డీఏ అయినా యూపీఏ అయినా ఎన్నికల తర్వాత మద్దతును కోరగలవు తప్ప షరతులు విధించే శక్తిని కలిగి ఉండవు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ భవిష్యత్తుకోసమయినా తెగించాల్సిన సమయం ఇది. తెగించినవాళ్లను తెలంగాణ సమాజం అక్కున జేర్చుకుంటోంది. మిగిలిన కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తెలంగాణవాదులుగా నిరూపించుకుంటారో, శాశ్వతంగా ద్రోహులుగా మిగిలిపోతారో తేల్చుకోవాలి. ముందు చూపును ప్రదర్శించని నాయకులెవరూ చరిత్రలో మిగల్లేదు.

They Kill Gods, Icons and also Movements

Yes. They kill gods, icons and movements.

NTR is Yugapurusha: Its true. He changed the AP political scene qualitatively and gave power to downtrodden. That is why they thought that he has no place in this sinful world. They joined together to break his heart and consequently to kill him.

Irony is that killers claim his legacy and praise him day in day out. And always pray for his blessings. How can an unpleasant soul of NTR blesses these ditchers?

They damaged Telangana Icons and robbed jobs and resources and claim as welwishers of Telangana. The man once banned the Telangana word on the floor of the house and changed tunes conveniently became notorious for opportunist stands.

They rained bullets on the people of Telangana who came to the streets against hiking of power charges, now boasting himself farmer friendly.

Chesina papam cheppukunte pothundantaaru. But this man never regretted for his misdoings on Telangana. He did not said a single word that entire TDP, regardless Seemandhra or Telangana, will be on the side of Telangana resolution.

He did not mentioned once that what happened in 2009 December 10 onwards is not correct. Without accepting one’s misdoings he cannot become a righteous man. One cannot hide between the lines of a resolution. Again and again he is trying to bluff the Telangana. How can one believe him in his life time.

ట్రిక్కులు, టక్కరి వేషాలు మానని టిడిపి

తెలుగుదేశం పార్టీ ట్రిక్కులు, టక్కరి వేషాలు మానలేదు. ఎన్నికల సమయానికి ఏదో ఒక కొత్త వేషం కట్టడం ఆ పార్టీకి అలవాటే. ఇప్పుడు తెలంగాణ విషయంలో కూడా మరోసారి ఆ పార్టీ అటువంటి వేషం వేయడానికే సిద్ధపడుతున్నాడు. తెలంగాణపై స్పష్టంగా, నిజాయితీగా, సూటిగా తమ వైఖరిని చెప్పి, కోల్పోయిన విశ్వాసాన్ని చూరగొనడానికి బదులు, నాలుకను అనేక మెలికలు తిప్పి, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు.

ఎర్రన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తిలు చేసిన తెలంగాణ తీర్మానానికే దిక్కులేకుండా పోయింది. ఎర్రబెల్లి ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఎవరు నమ్ముతారు?

ఎర్రబెల్లి, మోత్కుపల్లి తీర్మానాలు చేస్తారు, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ, కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ రాజీనామాలు చేస్తారు. 2009 డిసెంబరు 9న స్వయంగా చంద్రబాబే అడ్డం తిరిగారు. వీళ్లను నమ్మేదెలా?

తెలంగాణ తీర్మానం ఎర్రబెల్లి ఎందుకు ప్రవేశపెట్టాలి? పయ్యావుల కేశవ్, దేవినేని ఉమ, కోడెల శివప్రసాద్ ఎందుకు ప్రవేశపెట్టరు? ఎర్రబెల్లి ప్రవేశపెట్టేది పార్టీ తీర్మానమా, ప్రాంతీయ తీర్మానమా? తెలంగాణపై సిపిఐ ఒక తీర్మానం చేస్తే, ఆ పార్టీ కార్యదర్శి కె.నారాయణ కట్టుబడి కొట్లాడడం లేదా? టీడీపీ సీమాంధ్ర నేతలు ఆ పని ఎందువకు చేయరు?

చంద్రబాబు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తాడట. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటాడట. వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలిస్తాడట. తెలంగాణ ఇస్తామని, శాసనసభలో తీర్మానం ఆమోదిస్తామని, కేంద్రంలో తెలంగాణ బిల్లు పెట్టిస్తామని మాత్రం చెప్పడట.

చంద్రబాబు తెలంగాణపై నిర్ణయం తీసుకున్నరోజు ఏం మాట్లాడాడు?
తెలంగాణపై నిర్ణయం వచ్చినరోజు ఏం మాట్లాడాడు?
సీమాంధ్ర టీడీపీ నేతల రాజీనామాలపై ఏం మాట్లాడాడు?

what Babu Said on T
what Babu Said on T

What Babu on D day of T
What Babu on D day of T
How he escaped from Responsibility?
How he escaped from Responsibility?

ఇక అన్ని ఎన్నికల్లో ఉప ఎన్నికల మార్గమే

పొద్దున్నే ఒక అధ్యాపక మిత్రుడు ఫోను చేశారు. చాలా ఆవేశంగా మాట్లాడారు. టీఆరెస్‌పై చంద్రబాబు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి చేసిన విమర్శలు ఆయన కోపానికి కారణం. ‘టీఆరెస్ వసూళ్ల పార్టీ’ అని, ‘కుటుంబ పార్టీ’ అని విమర్శించడంపై ఆయన మండిపడ్డాడు. ‘టీడీపీ కార్పొరేట్ల పార్టీ. కాంట్రాక్టర్ల పార్టీ. దళారీల పార్టీ. కుంభకోణాల పార్టీ. వెన్నుపోట్ల పార్టీ. ఎన్‌టీఆర్‌ను బలితీసుకున్న పార్టీ. కుట్రలు, కుతంత్రాల పార్టీ. తెలంగాణ ద్రోహుల పార్టీ. తోడు దొంగల పార్టీ. ప్రపంచబ్యాంకు పార్టీ. కులపార్టీ గులపార్టీ. అతిపెద్ద కుటుంబ పార్టీ. హైదరాబాద్‌లో ప్రభుత్వరంగ కంపెనీలను మూసేసిన పార్టీ. ఆ కంపెనీల ఆస్తులను తెగనమ్మిన పార్టీ. సీమాంధ్రుల పార్టీ….వంద పేర్లతో తిట్టగలను నేను. మీరెవరూ ఎందుకు పట్టించుకోరు? వాళ్లు అలా మాట్లాడుతుంటే ఎందుకు ఖండించరు?’ అని ఆయన నిలదీస్తున్నట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. ‘వసూళ్ల పార్టీ, వసూళ్ల పార్టీ అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఏమన్నా నారావారి పల్లి పొలాల్లో పంటలు పండించిన డబ్బును తెచ్చి ఎన్నికల్లో పెడుతున్నారా? వెంకటగిరి తోటల్లో బత్తాయి పండ్ల మీద వచ్చిన ఆదాయంతో ఎన్నికలకు ఖర్చు పెడుతున్నారా? హెరిటేజ్ పాలలో వచ్చిన లాభాలతో పార్టీని నడిపిస్తున్నారా? చంద్రబాబుకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తున్నది? ఎవరి దగ్గరా వసూలు చేయకుండానే ఆయన పార్టీని నడిపిస్తున్నారా? ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చుపెడితే సుజనాచౌదరికి రాజ్యసభ టికెట్ ఇచ్చారు? ఎంత డబ్బు వసూలు చేసి మధుకన్ నామా నాగేశ్వర్‌రావుకు ఎంపీ టికెట్ ఇచ్చారు?’ ఆయన కోపం ఇంకా తగ్గలేదు. ‘పెద్ద ఏసు ప్రభువుల్లా వెయ్యి నోట్లు రద్దు చేయాలని, ఐదువందలనోట్లు రద్దు చేయాలి, డబ్బే జబ్బు అని ఆయన, ఆయన భజన బృందాలు నీతులు చెబుతున్నారు. కొవ్వూరు ఎన్నికల సమయంలో నెల్లూరులో పట్టుబడిన కోట్లు ఎవరివి? ఎన్నికల్లో డబ్బులు నీళ్ల ప్రాయంగా ఖర్చుపెడుతున్నది ఎవరు? అందరూ ఓటుకు వంద రూపాయలు ఖర్చు పెడితే ఓటుకు పదిహేను వందల రూపాయలు ఇచ్చింది ఎవరు? ఉప ఎన్నికల సందర్భంగా పట్టుబడిన డబ్బులో ఏ పార్టీ వారిది ఎంతో ఎన్నికల కమిషన్ ఎందుకు బయటపెట్టదు? అంతెందుకు ఇతర పార్టీలలో ఉన్నవారిని కొనడానికి, సొంత పార్టీలో ఉన్నవారిని పార్టీలోనుంచి పోకుండా ఆపడానికి లక్షలు కోట్లు ఆఫర్ చేస్తున్నది ఎవరు?…’ అని ఆ మిత్రుడు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ మిత్రుడు గమనించాల్సిన విషయం ఒకటుంది. నల్లగొండలో ఏదో ఒక మారుమూల పల్లెలో చదువులు చెప్పే ఆ మిత్రుడికి ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత చంద్రబాబు, మోత్కుపల్లి, ఎర్రబెల్లి ఏమంటే మాత్రం ఎందుకు పట్టించుకోవాలి? ఆ మిత్రునికే ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఇందులో కొన్ని విషయాలన్నా తెలియకుండా ఉండవు. తెలంగాణ సమాజం మునుపటికన్నా చైతన్యవంతమైందని ఆ మిత్రుడి మాటలు తేటతెల్లం చేస్తున్నాయి.

తెలంగాణ అదృష్టం ఇదే. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్ నుంచి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన పనిలేదు. ఈసారి ఎక్కడికక్కడ ఇటువంటి అవగాహన ఉంది. నిజమే రాజకీయ ప్రత్యర్థులు బలమైన వాళ్లు. చివరి నిమిషం దాకా యుద్ధాన్ని ఎవరూ వదిలిపెట్టరు. తెలంగాణ ఉద్యమాన్ని ఆగం పట్టించడానికి వారు ప్రయత్నాలు చేయకుండా ఉండరు. ఆరోపణల కుంభవృష్టిని కురిపించకుండా ఉండరు. బాబుగారి నోటినుంచో, బాబుగారి చెంచాల నోటి నుంచో మాట వెలువడగానే పత్రికలు, చానెళ్లు అన్నీ అశ్శరభ శరభ అశ్శరభ శరభ అని ఊగిపోతాయి. ఇంకా అనేకమంది రఘునందన్‌లు బయటపడతారు. రాజకీయ ఆశోపహతులు అనేక మంది కోవర్టులుగా మారతారు. అనేకమంది నాయకులను టీఆరెస్ నుంచి టీడీపీలోకి తీసుకురావడానికి చంద్రబాబు ఒక టాస్క్ ఫోర్సునే ఏర్పాటు చేశారని చెబుతున్నారు. టీఆరెస్ కూడా అదే పనిచేస్తున్నదని చెప్పడానికి సంకోచం లేదు. అయితే రెండు పార్టీల ప్రయత్నాల్లో ఒక తేడా ఉంది. టీఆరెస్ చేస్తున్నది తెలంగాణ రాజకీయ శక్తులను ఒక్కచోటికి తీసుకువచ్చి అస్తిత్వకాంక్షను బలంగా వినిపించాలని ప్రయత్నిస్తున్నది. టీడీపీ తెలంగాణవాదాన్ని బలహీనపర్చడానికి ప్రయత్నిస్తున్నది. టీఆరెస్‌లోకి వచ్చే వాళ్లు టికెట్ల హామీ కోరుతున్నారు. గెలుపు మీద ఆశతో వస్తున్నారు. టీడీపీ మాత్రం ‘గెలుపు సంగతి తర్వాత, ఎవరికి ఎంతకావాలో తీసుకోండి. రండి ఆహ్వానిస్తున్నది’. మెదక్ జిల్లాకు చెందిన టీఆరెస్ నాయకుడొకరు స్వయంగా ఈ విషయం చెప్పారు. ‘జంప్‌ల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మా జిల్లా బాధ్యతలను ఒక కార్పొరేట్ ఎంపీకి అప్పగించారట’ అని ఆయన వివరించారు. ‘మండల స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎవరయినా పర్వాలేదు. అందరికీ రేట్లు ఫిక్స్ చేయండి. మాట్లాడండి. పట్టుకురండి అని ఎన్‌టీఆర్ భవన్ నుంచి ఆదేశాలున్నాయి’ అని టీడీపీ నాయకులు ఇక్కడ చెబుతున్నారని ఆయన తెలిపారు. ఇందులో నిజమెంతో తెలియదు, కానీ చంద్రబాబుకు ఇటువంటి రాజకీయాలు కొత్తకాదు. కుట్రలు కొత్తకాదు. తనను ‘నారా నారా పోరా పోరా’ అన్న నర్సింహులును పార్టీలో చేర్చుకున్నారు. తనను ‘బిగ్‌బాస్’ అని ఆరోపించిన మైసూరాను చేర్చుకున్నారు. తనపై అన్ని రకాలా దుమ్మెత్తిపోసిన ముద్దుకృష్ణమను చేర్చుకున్నారు. క్యాంపులు నిర్వహించడం, జడ్‌పీటీసీలను కొనుగోలు చేయడం చాలా కాలంగా చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు గురించి ఇప్పుడు జనానికే బాగా అర్థమవుతున్నది. మనం ఊహించని కోణాలను జనం గమనిస్తున్నారు.

చంద్రబాబు శాసనసభలో అవిశ్వాసానికి మద్దతు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? అని ఒక విందులో ఒక మిత్రుడు ప్రశ్నించాడు. ప్రభుత్వం పడిపోతే ఎన్నికలొస్తాయని, జగన్‌కు లాభం చేకూరుతుందని ఇవ్వలేదని చెప్పాను. ‘కాదు… తెలంగాణను అడ్డుకోవడం కోసమే’ అని ఆ మిత్రుడు చెప్పారు. అదెలాగంటే, ‘ప్రభుత్వం సంక్షోభంలో పడితే వెంటనే ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు. మహా అయితే సస్పెండెడ్ యానిమేషన్‌లో పెడతారు. వెంటనే ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండేదికాదు. జగన్‌కు వెంటనే ఒరిగేదేమీ ఉండదు. కానీ రాజకీయ సంక్షోభం వస్తుంది. తెలంగాణ సమస్య మరోసారి తీవ్రమవుతుంది. తెలంగాణపై ఏదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని నివారించేందుకే టీఆరెస్ ప్రతిపాదించిన అవిశ్వాసానికి చంద్రబాబు మద్దతు ఇవ్వలేదు’ అని ఆ మిత్రుడు వాదించారు. అదీ నిజమే కావచ్చు. చంద్రబాబు చాలా దూరదృష్టితో ఆలోచిస్తారు. పైకి ఒక లక్ష్యం ప్రకటిస్తారు. అసలు లక్ష్యం వేరే ఉంటుంది. ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని లేఖలు రాసినా కచ్చితంగా ఆయన తెలంగాణకు అనుకూలం కాదు. అనుకూలత ఆచరణలో కూడా ఉండాలి. దేశంలోని సమస్యలన్నింటిపై ఆయన పోరాడతాడు. రాష్ట్రపతిని కలిసి ఏవేవో డిమాండ్లు పెడతాడు. గవర్నరుకు మహజర్లు సమర్పిస్తారు. చిదంబరంతో సమావేశమవుతాడు. ఇక్కడ తెలుగు తమ్ముళ్లు విద్యుత్ కోసం పోరాడతారు. బాబ్లీకోసం పోరాడుతున్నట్టు మాట్లాడతారు. కానీ పన్నెండేళ్లుగా తెలంగాణ హృదయాలను మండిస్తున్న స్వరాష్ట్ర కాంక్ష గురించి మాత్రం మాట్లాడరు. వెయ్యి మంది పిల్లల బలిదానాలను గురించి మాట్లాడరు. రాష్ట్రాన్ని అనిశ్చితిలో పడేసిన ఈ సమస్యను పరిష్కరించాలని ఒక పెద్ద మనిషిగా కూడా డిమాండు చేయరు. ఆయనకు ఆయన తమ్ముళ్లకు కావలసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కాదు, ఆయన ముఖ్యమంత్రి కావడం. ఆయనకు స్పష్టత ఉంది. ఇంకా స్పష్టత రావలసింది తెలంగాణ నాయకులకే.

తెలంగాణ ప్రజలు తమ స్పష్టతను గత రెండేళ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో అనేకసార్లు చూపించారు. వచ్చే ఎన్నికల్లోనూ అదే మార్గాన్ని అనుసరించాల్సిన అవసరాన్నీ వారు గుర్తిస్తున్నారు. ఎప్పటికయినా సీమాంధ్ర పార్టీలు మన పార్టీలు కావని 2009 డిసెంబరు తర్వాత పదే పదే రుజువయిపోయింది. వాళ్లు మనుషులే ఇక్కడ, ఆత్మలు అక్కడే అని తేలిపోయింది. తెలంగాణ ఓట్లతో గెలిచి ఆంధ్ర మేలు కోరతారని అర్థమయింది. మన ఎమ్మెల్యేల బలంతోనే సింహాసనంపై కూర్చుని ‘ఒక్క పైసా ఇవ్వను ఏం చేస్కుంటావో చేస్కో’ అని సవాలు విసరగల పెద్దమనుషులు వాళ్లు. అందుకే ఈ పార్టీలను వదిలించుకోవడం తప్ప తెలంగాణకు వేరే మార్గం లేదు. టీఆరెస్, బీజేపీ, సీపీఐ, న్యూడెమాక్రసీ …తెలంగాణపై పోరాడుతున్న ఈ పార్టీలకు తప్ప మరే పార్టీకీ తెలంగాణ ఓట్లు పడకుండా రాజకీయ శక్తుల పునరేకీకరణ జరగాలి. కలసి పోటీ చేసినా విడిగా పోటీ చేసినా-అందరి లక్ష్యం సీమాంధ్ర పార్టీలను ఓడించడమే కావాలి. టీఆరెస్ ఒంటరి పోరుకు సిద్ధపడడంలో న్యాయం ఉంది. పొత్తులు తెలంగాణ సమస్యను ఎంతగా ఆగం పట్టించాయో గత రెండు ఎన్నికలు రుజువు చేశాయి. పొత్తులు పెట్టుకున్న పార్టీలు ఏవీ ఎదగలేదు. 199లో 1 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, 1999లో టీడీపీ కౌగిలిలో చేరి ఘోరంగా దెబ్బతిన్నది. 2004, 2009లో టీఆరెస్ అనుభవమూ అదే. రాజశేఖర్‌రెడ్డి టీఆరెస్‌కు వ్యతిరేకంగా 2004లో ఎన్నికల తర్వాత కుట్ర చేసి పార్టీని చీల్చితే, 2009లో ఎన్నికల సమయంలోనే చంద్రబాబు కుట్ర చేశారు. తెలంగాణ సొంత రాజకీయ సత్తాను చూపే అవకాశం ఇంతవరకు రాలేదు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ తన సొంత రాజకీయ అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

తెలంగాణలో 2009-2012ల మధ్య 20 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 17 స్థానాలను టీఆరెస్ గెల్చుకుంది. రెండు స్థానాలను బీజేపీ గెల్చుకుంది. ఒక స్థానాన్ని నాగం జనార్దనరెడ్డి గెల్చుకున్నారు. అందరూ తెలంగాణకోసం నిలబడి కొట్లాడుతున్నవారే. ఇందులో 9 స్థానాలు టీడీపీ, కాంగ్రెస్‌ల నుంచి గెల్చుకున్నవే. సీమాంధ్ర పార్టీలు తెలంగాణలో క్రమంగా ఎలా పతనమవుతున్నాయో గత ఐదేళ్ల ఓట్ల శాతాలను పరిశీలిస్తే అవగతమవుతుంది. ఈ ఉప ఎన్నికల నమూనాలోనే రేపు మొత్తం ఎన్నికలు జరగాలి. సర్వేలపై ఎక్కువగా ఆధారపడాల్సిన అవసరం లేకున్నా, ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగానే ఉన్నాయి. అవి తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల ధోరణినే ప్రతిబింబిస్తున్నాయి. సీ-ఓటర్ టీఆరెస్‌కు 12 స్థానాలను, బీజేపీకి ఒక స్థానాన్ని అంచనా వేస్తే, మిన్హాస్ మర్చెంట్ అంచనాలో టీఆరెస్‌కు 13 చూపించారు. ఏబీపీన్యూస్-నీల్సన్ సర్వే కూడా తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగానే వచ్చింది. వచ్చే కాలం చాలా కీలకమైనది. టీఆరెస్ స్వయంకృతాపరాధాలు జరుగకుండా చూసుకోవాలి. టీఆరెస్‌లో రెండు రకాల వాళ్లున్నారు-కొందరు టీఆరెస్‌ను, ఉద్యమాన్ని మోస్తున్నవాళ్లు. ఇంకొందరు టీఆరెస్ మోస్తున్నవాళ్లు, భరిస్తున్నవాళ్లు. రెండో రకం వల్ల ఉద్యమానికి ఏ ప్రయోజనమూ లేదు. పొయ్యేవాళ్లను పోనివ్వండి. ఉద్యమ శ్రేణులను రాజకీయ సమరాంగణంలోకి తీసుకురావడంపై టీఆరెస్ దృష్టిపెట్టాలి. రాజకీయాలకు ఉద్యమ రూపం ఇవ్వాలి. ఏదీ ఆశించకుండా, షరతులు పెట్టకుండా ఇంతకాలం ఉద్యమంలో కీలక భూమిక పోషిస్తున్నవారికి ఎన్నికల సమరంలో అవకాశం ఇవ్వండి. అందరితో సమన్వయంతో వ్యవహరించడం టీఆరెస్‌కే మేలు చేస్తుంది. ప్రత్యర్థులు మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయిలో రాజకీయ దాడి చేయడానికి సమాయత్తమవుతున్నారు. మరింత అప్రమత్తంగా, తొట్రుపాటు లేకుండా వ్యవహరించాల్సిన అవసరం తెలంగాణవాద పార్టీలపై ఉంది.

11

Congress Digging its Own Grave in AP

Congress can be symbolised with Ameoba. It has legs throughout its body. It can move in any direction. It has thousand tongues. It can speak in any tone and tenor. It won’t stand for any test. It won’t have any commitment.

They sailed, honoured and taken every favour from YSR, as long as he is alive. But the same Congress punishing who is associated with YSR since last two years. Congress targeted YS Jagan, started fixing him, but the game not ended there. It’s eating, its own Government in to pieces. Already Government is in minority. Now the Cabinet facing the cracks. Congress persecution of Jagan making him day after day very strong. Though he made a kingdom of corruption, people seeing his prosecution as political witch hunting.

Congress assured many a times they are with Telangana. Every time they asked votes on assurance of Telangana. Once they announced on behalf of Central Government that they will start the process of Telangana State formation. But gone back. Since then started consultation after consultation, but dint solved the problem. The way they behaved with Telangana people, generated all sorts of animosity in the region for life time. They cannot recover forever, without taking a final call on Telangana.

What I am thinking is Congress is preparing for its exit in 2014 polls. In view of this self defeating orientation it’s dragging to take bold decisions.

Beware of Fifth Columnists in Telangana Movements

Fifth columnists, who walk with us and back stab us when we are in war, are very dangerous than known enemies. This is not the first time that back stabbers rise. Ten MLAs who were bought out by YSRaja Shekar Reddy, poured slander on KCR like any thing. Later young Telangana tigers joined hands with YSR and travelled all studios to damage KCR’ image in 2009.

Then Rahman raised the revolt and poured all sorts of mud on KCR and TRS. All these leaders accused in the same lines. They told that they have CD’s or audio records or some evidences. But nothing came forward. All these bluff masters now once again targeting in the TRS and its top brass. But this time they could not succeed because, their true colors proved like any thing.

తెలంగాణవాదులారా, మారీచులున్నారు జాగ్రత్త!

http://missiontelangana.com/maareechulunnaaru-jaagratta/

May 18, 2013

గుణవీర శరత్‌చంద్ర

రాముడిని దెబ్బ తీయాలంటే సీతను అపహరించాలని చెబుతాడు అకంపనుడు. సీతను అపహరించడానికి రావణుడు విసిరిన పాచిక మారీచుడు. బంగారు లేడి వేషంలో పంచవటి సమీపంలో విహరిస్తుంటాడు మారీచుడు. సీత బంగారు లేడిని చూసి ఇష్ట పడుతుంది. దానిని పట్టి తీసుకురమ్మంటుంది. రాముడు వద్దంటాడు. అది మారీచుని మాయ అంటాడు. పట్టుబడుతుంది సీత. లక్ష్మణుడిని పర్ణశాలకు కాపలా ఉంచి, రాముడు దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అది దూరంగా పరుగెడుతుంది. రాముడు వెంటపడతాడు. ఇంకా ఇంకా దూరంగా వెళ్లి, రాముడికి ఏదో ఆపద కలిగిందని అర్థం వచ్చే విధంగా ‘హా సీతా, హా లక్ష్మణా’ అని కేకలు వేస్తాడు మారీచుడు. లక్ష్మణుడు పరుగెత్తుకువస్తాడు. రావణుడు సీతను అపహరిస్తాడు.

తెలంగాణ సమస్యను మాయం చేయాలి. తెలంగాణ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలి. తెలంగాణవాదులను చెట్టుకొకరు పుట్టకొకరు చేయాలి. తెలంగాణవాదుల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలి. అందరూ ఒక్కచోట ఉంటే కొట్టడం కష్టం. విడదీసి కొట్టాలి. విభజించి కొట్టాలి. విభేదం సృష్టించి కొట్టాలి. అందుకే అప్పటి రావణుడిలాగే ఇప్పుడు సీమాంధ్ర నాయకత్వాలు మారీచులను ఎగదోస్తున్నాయి. మారీచుల నోట అసత్యాలు, అర్థసత్యాలు కుమ్మరిస్తున్నాయి. ఎందుకంటే తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోతున్నాయి. ఎన్ని తిప్పలు పడ్డా, ఎన్ని ఎత్తులు పెట్టినా ఆ మేడలు నిలబడటం లేదు. తెలంగాణలో సీమాంధ్ర రాజకీయ కోటలు కూలుతున్నాయి. తెలంగాణ ఓటర్ల భుజాలపై కూర్చుని సీమాంధ్ర నాయకత్వాలకు జీ హుజూర్ అని జేకొట్టిన నేతలకు కనువిప్పు కలుగుతున్నది. తెలంగాణ మనది, మనమే తేల్చుకోవాలన్న సోయి బలపడుతున్నది. తెలంగాణ సంఘటితమవుతున్నది. టీఆర్‌ఎస్‌లోకి లేక బిజెపిలోకి వలసలు జరుగుతున్నాయి. ఇది జీర్ణించుకోవడం సీమాంధ్ర నాయకత్వాలకు కష్టంగా ఉంది. అందుకే బెగ్, బారో, స్టీల్.. తెలంగాణవాదుల్లో చిచ్చుపెట్టేందుకు మూడు పార్టీలూ ఒకే గొంతుకగా మాట్లాడుతున్నాయి.

ఇలా చేయడం కొత్తకాదు. చంద్రబాబునాయుడు 2004 ఎన్నికలకు ముందు ఇలాగే చేశారు. రాజశేఖర్‌రెడ్డి ఏకంగా పదిమంది ఎమ్మెల్యేలను ఎర్రగడ్డ రైతుబజారులో కూరగాయాలను కొన్నట్టు కొనిపారేశారు. తెలంగాణ పాటలు పాడిన నోటనే, తెలంగాణకు చావుగీతాలు పాడించాడు. అలా అమ్ముడుపోయి, సీమాంధ్ర నాయకత్వాలకు ఊడిగం చేసిన వారిలో ఒక్క తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తప్ప అందరూ మట్టికొట్టుకుపోయారు. రాజశేఖర్‌రెడ్డి పోయిన ఎన్నికల సమయంలో కూడా చాలా మంది తెలంగాణ యువకిశోరాలను కొనుగోలు చేశారు. (ఇలా చెప్పాల్సిరావడం అవమానకరమే. కానీ ఏం చేస్తాం. వాళ్ల వద్ద పెట్టుబడులు ఉన్నాయి. పార్టీలు ఉన్నాయి. టికెట్లు ఉన్నాయి. వాళ్లు ఇచ్చేవాళ్లు. కొనేవాళ్లు. మనం తీసుకునే వాళ్లం. అమ్ముడుపోయే వాళ్లం. ‘టీఆరెస్‌లోకి వస్తే ఎన్నికల ఖర్చు ఎవరు భరిస్తారన్నా? ఇక్కడయితే బాబు చూసుకుంటారు’ అని ఒక తెలుగు తమ్ముడు నిర్మొహమాటంగానే చెప్పారు) టీవీ స్టూడియోల చుట్టూ డ్యూటీలు వేసి అడ్డగోలుగా మొరిగించారు. వారంతా ఇప్పుడు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మొరిగే వారికీ అదే గతిపడుతుందని వేరే చెప్పనవసరం లేదు. పెడితే పెళ్లి బాజా లేకపోతే చావు బాజా ఊదడం కొందరికి సహజమే. వీళ్లెవరికీ అంతిమలక్ష్యం తెలంగాణ కాదు, ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడం, రాజకీయాలను లాభసాటిగా మార్చుకోవడం, ఇలా జారిపోయే, చిల్లిపోయే ఎండుకప్పల గురించి తెలంగాణవాదులు పెద్దగా చింతించాల్సిన పని లేదు.

చంద్రబాబు చుట్టూ పారిశ్రామిక వేత్తలు ఉంటారు. కాంగ్రెస్ నిండా స్కామ్‌లు చేసిన వాళ్లుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ స్వయంగా స్కామ్‌ల కాంగ్రెస్‌గా విమర్శలు ఎదుర్కొంటున్నది. విచిత్రం ఏమంటే ఈ రాష్ట్రాన్ని గత ఐదు దశాబ్దాలుగా కొల్లగొట్టిన వాళ్లంతా ఈ పార్టీలలోనే ఉన్నారు. కంపెనీలు పెట్టి ఇన్వెస్టర్లను ముంచినవారు, బ్యాంకులు పెట్టి డిపాజిటర్లను ముంచినవారు, అప్పులు తీసుకుని బ్యాంకులను ముంచినవారు, హైదరాబాద్‌లో వేలకోట్ల విలువజేసే వేలాది ఎకరాల భూములను కాజేసినవారు.. అంతా ఈ పార్టీల నీడలోనే ఉన్నారు. షేర్ మార్కెట్ బూమ్‌లో రొయ్యల కంపెనీలు, ఫార్మా కంపెనీలు, చేపల కంపెనీలు పెట్టి కోట్లాది మంది ప్రజలకు షేర్లమ్మి వేల కోట్ల రూపాయాలు వసూలు చేసి రాత్రికి రాత్రి కంపెనీలు మూసేసి ఇస్వెస్టర్లకు శఠగోపం పెట్టిన వాళ్లూ వీళ్ల అనుచరులే. స్టాంపుల కుంభకోణాలూ వీళ్లవే. ఏలేరు కుంభకోణమూ వీరిదే. మద్యం కుంభకోణంలో ఐదు వేల కోట్లు చేతులు మారిందీ వీరి కనుసన్నల్లోనే. ఐఎంజీ భారత్, ఎమ్మార్ కుంభకోణాల్లోఅందరూ భాగస్వాములే. కృషి వెంకటేశ్వరరావు వీళ్ల మనిషే. నాదర్‌గుల్ సూర్యప్రకాశరావు వీళ్ల మనిషే. క్విడ్ ప్రో క్వో స్కాముల స్వాములంతా వీళ్ల మనుషులే. ఎన్నికల కోసమో, రాజకీయాల కోసమో వీళ్లకు డబ్బులు వసూలు చేయవలసిన పని లేదు. వీళ్లే అందరికీ డబ్బులిస్తారు. ఆధునిక మారీచులు వీరితో చేతులు కలిపి ఏ అధికారమూ లేకుండా గత పన్నెండేళ్లుగా పార్టీని, ఉద్యమాన్ని నడిపిస్తున్న నాయకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకంటే విడ్డూరం ఏముంటుంది?

ఇదంతా ఎందుకంటే తెలంగాణను అడ్డుకోవడం కోసమే. తెలంగాణను దెబ్బతీయడం కోసమే. ఈ మూడు పార్టీల ఉమ్మడి లక్ష్యం టీఆరెస్సే! సంఘటితమవుతున్న తెలంగాణ రాజకీయ శక్తులను నిలువరించడానికి, తెలంగాణ ఉద్యమంలోకి ఇతర పార్టీల వలసలను అడ్డుకోవడానికి సీమాంధ్ర పార్టీలు వేస్తున్న పాచికల్లో ఒక పాచిక మారింది. కానీ ఇది తాత్కాలికం. ఇంకా ఇటువంటి మారీచులు చాలా మంది పుడుతారు. ఇటువంటి దాడులు ఇంకా చాలా చూడాల్సి వస్తుంది. తెలంగాణవాదులు అందుకు సిద్ధపడి ఉండవలసిందే. అంతిమయుద్ధంలో వీళ్లందరితో తలపడవలసిందే. అయోమయానికి గురికావద్దు. ఆందోళన చెందవద్దు.

No arrests for Facebook posts without senior cops’ permission: Supreme Court

Reported by A Vaidyanathan, Edited by Surabhi Malik (With inputs from PTI) | Updated: May 16, 2013 12:44 IST

New DelhiThe Supreme Court today said all states and union territories must follow the Centre’s advisory and refrain from arresting people for posting allegedly objectionable comments on social networking sites unless senior police officials have given their nod for it.

The court’s directions on arrests under Section 66 A of the IT Act came during a hearing on a plea that challenged the arrest of a human rights activist from Andhra Pradesh who was apprehended last week for posting allegedly defamatory comments against a Congress leader on Facebook.

The petitioner in the case, law student Shreya Singhal, has also challenged the validity of Section 66A and had urged that no arrests should be made under the controversial Section till the Supreme Court decides on her PIL. The court today said all states should abide by the advisory till it decides on the validity of the provision.

See More on

http://www.ndtv.com/article/india/no-arrests-for-facebook-posts-without-senior-cops-permission-supreme-court-367554?pfrom=home-lateststories

శల్యులెవరు? యుయుత్సులెవరు? ఎవరి పుట్టలు? ఎవరు పాములు?

యుద్ధంలో నీతి ఉండదు. ఎన్నికలు కూడా యుద్ధమే. గెలవడమే ముఖ్యం. ధర్మమా అధర్మమా అన్నది అప్రస్తుతం. సీమాంధ్ర పార్టీలు ఈ విద్యలో బాగా ఆరితేరాయి. వారికి యాభైయేళ్ల అనుభవం ఉంది. లక్షలకోట్ల పెట్టుబడులు ఉన్నాయి. కోరుకున్నది రాసిపెట్టే పత్రికలున్నాయి. అంకితభావంతో పనిచేసే అరడజను చానెళ్లు ఉన్నాయి. సీమాంధ్ర నాయకులు ఎంత గడసరులంటే పార్టీ మారకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వగలరు. పార్టీ మారేందుకూ డబ్బులు ఇవ్వగలరు. కూలుతున్న తెలుగుదేశం కోటలను కాపాడుకోవడానికి, జారిపోతున్న సైన్యాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు  దేనికైనా తెగిస్తారని అనేక సందర్భాలు రుజువు చేశాయి. ఇప్పుడూ అదేపని చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఇంతకాలం బ్లాక్ షీప్స్‌గా పనిచేస్తున్న వారిని టోకుగా కొనుగోలు చేసే కార్యక్రమం మొదలయింది. టీఆరెస్ కూడా ఇటువంటివారిని ఇప్పుడే వదిలించుకోవడం మంచిది. కురుక్షేత్రం ప్రారంభానికి ముందు సేనలు ఎదురెదురు నిలబడి ఉన్నసమయంలో ధర్మరాజు ఇరు సేనలనుద్దేశించి, ‘ఇది ధర్మయుద్ధం. మీలో ఎవరైనా ఇటువైపు వారు అటుగానీ అటువైపువారు ఇటుగానీ మారదల్చుకుంటే తేల్చుకొండి’ అని అంటారు. కౌరవుల్లో ఒకరైన యుయుత్సుడు పాండవ సేనవైపు వస్తాడు. యుద్ధ రంగంలో పాండవుల పక్షాన ఏడు అక్షౌహిణిల సేన నిలబడితే, కౌరవుల పక్షాన 11 అక్షౌహిణిల సేన నిలబడింది.

పాండవులు అడవి నుంచి వచ్చి యుద్ధానికి ఇంతమందిని సమీకరించుకోగలిగారు. కురురాజు దుర్యోధనుడు అన్ని రకాల తాయిలాలు ప్రయోగించి అనేక దేశాల రాజులను లోబర్చుకున్నాడు. పాండవుల మేనమామ శల్యుడిని కూడా దారిలోనే అడ్డగించి ఆయనకు మధుపానీయాలు, సకల సత్కారాలు, సంపదలు ఎరచూపి తమవైపు తిప్పుకున్నాడు దుర్యోధనుడు. అలాగే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. టీఆరెస్ వైపు వచ్చేవాళ్లు తెలంగాణకోసమో, తెలంగాణపేరుతో గెలవడం కోసమో వస్తున్నారు. వాళ్లు ఎలా వచ్చినా తెలంగాణపక్షం వస్తున్నారు. ఇతరపార్టీలలోకి వెళ్లేవారు గెలిచినా గెలవకపోయినా నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం కోసం, తెలంగాణ ఉద్యమంమీద వందరాళ్లు విసరడంకోసం వెళుతున్నారు. తెలంగాణ ఉద్యమం వందలు వేల మంది నాయకులను తయారు చేసింది. వారంతా తెలంగాణకోసమే ఉద్యమంలోకి వచ్చినా అంతిమంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవి ఆశించడం సహజం. కానీ అవకాశం రాకపోతే తెలంగాణకోసం ఓపికపట్టడమూ అంతే అవసరం. సీమాంధ్ర పార్టీల ఎత్తులకు చిక్కితే చిక్కినవారికి ఏమీ దక్కకపోగా తెలంగాణవాదానికి కూడా చెరుపు చేసినవారవుతారు.

ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణవాదంపై ఈ దాడి ఇంకా పెరుగుతుంది. తెలంగాణవాదులతోనే తెలంగాణవాదుల కళ్లు పొడిపించే ప్రయత్నాలు జరుగుతాయి. అసత్య ప్రచారాలు, అధర్మయుద్ధాలు చాలా చూస్తాం. పన్నెండేళ్లుగా ఏ అధికారమూ లేకుండా ఉద్యమాన్ని, పార్టీని నడిపిస్తున్న నేతపై ఎన్ని అడ్డగోలు ఆరోపణలయినా చేయిస్తారు. అన్ని చానెళ్లు నిరవధికంగా లైవ్‌లు నిర్వహిస్తాయి. వారి ఆరోపణలను పత్రికలు పతాక శీర్షికల్లో ప్రకటిస్తాయి. ఇందుకు తెలంగాణ సమాజం సిద్ధపడవలసిందే. ఇటువంటి రక్తపాతాలు ఇంకా చాలా చూడవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలు తెలంగాణవాదానికి, తెలంగాణ వ్యతిరేకులకు మధ్య జరుగబోతున్నాయి. టీఆరెస్‌కు, సీమాంధ్ర పార్టీలకు మధ్య జరుగబోతున్నాయి. తెలంగాణ అస్తిత్వ కాంక్షకు, సీమాంధ్ర రాజ్యబలానికి, ధనబలానికి మధ్య జరుగబోతున్నాయి. ఇప్పుడు తటస్థంగా ఉండడం అసాధ్యం. మనం ఎవరి పక్షమో నిర్ణయించుకోవాలి.

సీమాంధ్ర నీతి

కుటుంబ రాజకీయాలు సీమాంధ్ర పార్టీలు చేయవచ్చు, ఆ పార్టీలలో తెలంగాణ ద్రోహులు మునిగితేలనూ వచ్చు. కానీ టీఆరెస్‌లో మాత్రం కుటుంబం ఉండరాదట!

సీమాంధ్ర పార్టీలు వందల కోట్ల రూపాలయను ఎన్నికల నిధులుగా సమీకరించుకోవచ్చు. పొలిట్‌బ్యూరోను పారిశ్రామికవేత్తలతో నింపవచ్చు. ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలకు రాజ్యసభ టికెట్లు ఇవ్వచ్చు. కానీ టీఆరెస్ ఎన్నికల నిధులు వసూలు చేయడం నేరం! తెలంగాణవాడికి గోచీ ఉండడం కూడా నేరమే!

సీమాంధ్ర పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయవచ్చు, తీరా తెలంగాణా వచ్చిన తర్వాత అడ్డం తిరిగి అడ్డగోలుగా మాట్లాడొచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో గల్లీలో అనేక కుట్రలు చేయవచ్చు, మూడేళ్లలో వెయ్యి మంది తెలంగాణ యువకులను బలితీసుకోవచ్చు, కానీ ఆ నేరం మాత్రం టీఆరెస్‌పై మోపాలట!

తెలంగాణ సాధనకోసం ఉద్యమాలు చేయరట. కనీసం తీర్మానాలు కూడా చేయరట. తెలంగాణ ఎందుకివ్వలేదని  కూడా అడగరట. పిల్లలు చనిపోతున్నా చలించరట. కానీ ఆ పార్టీలకు తెలంగాణ ప్రజలు ఓట్లెయ్యాలట!!

చంద్రబాబు తెలంగాణ గురించి తప్ప దేశంలోని సమస్యలన్నీ మాట్లాడతాడు. జగనన్న తెలంగాణ గురించి తప్ప రాజన్న రాజ్యం గురించి మాట్లాడతాడు. కిరణన్న ఇందిరమ్మకలలు, బంగారుతల్లి గురించి తప్ప తెలంగాణ మాటెత్తడు. తెలంగాణ గురించి మాట్లాడని వీరందరికంటే, తెలంగాణకోసం కొట్లాడే కేసీఆరే వీళ్లకు శత్రువట.

-శరత్ చంద్ర